Kajal Aggarwal Upset: కాజల్‌ను అలా తాకిన అభిమాని.. ఆమె ఏం చేసిందో చూడండి.. వైరల్ అవుతున్న వీడియో
Kajal Aggarwal: టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఓ అభిమాని ఆమెను తాకుతూ సెల్ఫీ దిగడానికి ప్రయత్నించడంతో ఆమె ఇబ్బంది పడుతున్న వీడియో వైరల్ అయింది.
Kajal Aggarwal: అభిమానుల అత్యుత్సాహం సెలబ్రిటీలకు ఎప్పుడూ ఇబ్బందే. అందులోనూ హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లకు వెళ్లినప్పుడు చేదు అనుభవాలు ఎదురవడం మనం చూస్తూనే ఉంటాం. తాజాగా టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కు అలాంటి అనుభవమే ఎదురైంది. ఓ అభిమాని ఆమె నడుముపై చేయి వేసి సెల్ఫీ దిగడానికి ప్రయత్నించాడు.
కాజల్ నడుముపై చేయి వేసి..
కాజల్ అగర్వాల్ హైదరాబాద్ లోని ఓ స్టోర్ ప్రారంభోత్సవం కోసం వచ్చింది. తన తండ్రి వినయ్ కూడా ఆమె వెంట ఉన్నారు. ఈ సమయంలో ఆమెతో సెల్ఫీ దిగే నెపంతో ఓ అభిమాని కాజల్ దగ్గరకి వచ్చాడు. ఆమె నడుముపై చేయి వేసి సెల్ఫీ దిగే ప్రయత్నం చేశాడు. అతడు తనను అసభ్యకరంగా టచ్ చేయడంతో వెంటనే అలర్ట్ అయిన కాజల్ ఏంటిది అంటూ అతన్ని ప్రశ్నించింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ అభిమాని సడెన్ గా చేసిన ఆ పని కాజల్ ను షాక్ కు గురి చేసినట్లు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి చేసిన పనికి సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా మండిపడుతున్నారు. అయితే ఈ ఘటన సమయంలో కాజల్ కాస్త ఇబ్బందిగా ఫీలైనా.. తర్వాత మిగిలిన కార్యక్రమం మాత్రం పూర్తి చేసింది.
హీరోయిన్లకు ఇబ్బందే..
నిజానికి సినిమా హీరోయిన్లకు ఇలాంటి పరిస్థితులు ఎదురవడం ఇదే కొత్త కాదు. ముఖ్యంగా ఇలా పబ్లిక్ ఈవెంట్లకు వచ్చినప్పుడు వాళ్లను ఎలాగోలా టచ్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తూనే ఉంటారు. ముఖ్యంగా ఈ సెల్ఫీలు వచ్చినప్పటి నుంచీ వాటి నెపంతో నటీమణులకు దగ్గరగా వెళ్లడం, వాళ్లను తాకడం సాధారణమైపోయింది.
ఈ మధ్యే బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్, అపర్ణ బాలమురళి, అహానా కుమార్ లాంటి హీరోయిన్లకు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి. కొందరు అభిమానులు వాళ్లను అసభ్యకరంగా తాకుతూ సెల్ఫీలు దిగడానికి ప్రయత్నించారు. అయితే వాళ్లు ఇబ్బందిగా ఫీలవుతూనే వాళ్లను దూరం పెడుతూ ముందుకు సాగిపోయారు.
ఇక కాజల్ అగర్వాల్ విషయానికి వస్తే ఒకప్పుడు తెలుగు సినిమా టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఎదిగిన ఆమె.. 2022లో తన తొలి సంతానం గౌతమ్ కు జన్మనిచ్చిన తర్వాత కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పుడు తెలుగులో సత్యభామ అనే మూవీ చేస్తోంది. ఇక శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వస్తున్న ఇండియన్ 2లోనూ కాజల్ నటించింది.
సత్యభామ మూవీలో కాజల్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించనుంది. అయితే ఇండియన్ 2లో ఆమె పాత్ర ఏంటన్నది మాత్రం తెలియలేదు. తాను చాలా రోజులుగా మంచి స్క్రిప్ట్ ల కోసం ఎదురు చూస్తున్నానని, రెండు సినిమాలతో త్వరలోనే రానుండటం సంతోషంగా ఉందని కాజల్ చెప్పింది. ఇండియన్ 2 మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. తెలుగులో లక్ష్మీ కల్యాణం మూవీతో పరిచయమైన కాజల్.. తర్వాత అందరు టాప్ హీరోలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించింది.