Satyabhama OTT: కాజల్ సత్యభామ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే - స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
Satyabhama OTT: కాజల్ అగర్వాల్ సత్యభామ మూవీ ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ జూలై ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ ఓటీటీలో రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
Satyabhama OTT: కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన సత్యభామ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. క్రైమ్ మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. తొలిరోజు సత్యభామ మూవీ కోటికిపైగా గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.
గూఢచారి ఫేమ్...
క్రైమ్ ఇన్వేస్టిగేషన్ థ్రిల్లర్ కథకు హ్యూమన్ ట్రాఫికింగ్, టెర్రరిజం, అంశాలను జోడించి దర్శకుడు సుమన్ చిక్కాల ఈ మూవీని తెరకెక్కించాడు. సత్యభామతోనే సుమన్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీకి గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్కా స్క్రీన్‌ప్లే అందించడంతో పాటు ప్రజెంటర్‌గా వ్యవహరించాడు. సత్యభామలో కాజల్ అగర్వాల్‌తో పాటు నవీన్‌చంద్ర, ప్రకాష్‌రాజ్, ప్రజ్వల్ యాద్మ కీలక పాత్రలు పోషించారు.
ఆహా ఓటీటీలో...
సత్యభామ ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకున్నట్లు సమాచారం. థియేటర్లలో తెలుగులో రిలీజైన ఈ మూవీ ఓటీటీలో మాత్రం తెలుగుతో పాటు తమిళంలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు చెబుతోన్నారు. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాతే సత్యభామ మూవీ ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలిసింది. జూలై ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ నుంచి సత్యభామ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. జూన్ నెలాఖరున సత్యభామ ఓటీటీ రిలీజ్ డేట్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
సత్యభామ కథ ఇదే...
సత్యభామ (కాజల్ అగర్వాల్) షీ టీమ్‌లో ఏసీపీగా పనిచేస్తుంటుంది. హసీనా అనే యువతిని ఆమె భర్త యాదు దారుణంగా హత్యచేస్తాడు. ఆ మర్డర్ తర్వాత హసీనా భర్త యాదుతో పాటు ఆమె తమ్ముడు ఇక్బాల్ (ప్రజ్వల్ యాద్మ) కనిపించకుండాపోతారు.హసీనాను చంపిన యాదును పట్టుకోవడంతో పాటు ఆమె తమ్ముడు ఇక్బాల్ మిస్సింగ్ వెనకున్న మిస్టరీని ఛేదించే క్రమంలో సత్యభామకు ఎలాంటి నిజాలు తెలిశాయి? ఈ మర్డర్ కేసులోకి ఎంపీ కొడుకు రిషితో పాటు విజయ్, నేహా ఎలా వచ్చారు? అసలు హసీనా ఎలా చనిపోయింది? ఆమె మరణం వెనుకున్న మిస్టరీని సత్యభామ ఏ విధంగా ఛేదించింది అన్నదే ఈ మూవీ కథ.
కాజల్ యాక్టింగ్ అదుర్స్...
ఈ సినిమాలో పోలీస్ క్యారెక్టర్‌లో కాజల్ అగర్వాల్ యాక్టింగ్ బాగుంటూ తెలుగు ఆడియెన్స్ ప్రశంసలు కురిపిస్తోన్నారు. సత్యభామ కోసం దర్శకుడు ఎంచుకున్న పాయింట్, కథలోని ట్విస్ట్, ఎమోషన్స్ బాగున్నాయంటూ ప్రశంసలు లభిస్తోన్నాయి. అయితే లెక్కకుమించిన క్యారెక్టర్స్ ఉండటం, కథలో అనేక అంశాలకు చోటు ఇచ్చిన దర్శకుడు వాటిని క్లారిటీగా స్క్రీన్‌పై చెప్పడంలో కన్ఫ్యూజ్ అయినట్లు నెగెటివ్ కామెంట్స్ వినిపించాయి. సత్యభామతో పాటు ఈ శుక్రవారం థియేటర్లలో పది సినిమాలు రిలీజయ్యాయి.
నెల రోజుల గ్యాప్
నెల రోజుల గ్యాప్
సత్యభామ తర్వాత నెల రోజుల గ్యాప్‌లోనే ఇండియన్ 2 తో తెలుగు, తమిళ ప్రేక్షకులను పలకరించబోతున్నది కాజల్ అగర్వాల్. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఇండియన్ 2 జూలై 12న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్‌తో పాటు రకుల్ ప్రీత్‌సింగ్, ప్రియా భవానీ శంకర్ కూడా నటిస్తోన్నారు. సిద్ధార్థ్ మరో హీరోగా కనిపించబోతున్నాడు.