Kajal Aggarwal Horror Movie: ఏడాది గ్యాప్ త‌ర్వాత హార‌ర్ సినిమాతో కాజ‌ల్ రీఎంట్రీ - రిలీజ్ డేట్ ఫిక్స్‌-kajal aggarwal regina karungaapiyam release date locked
Telugu News  /  Entertainment  /  Kajal Aggarwal Regina Karungaapiyam Release Date Locked
కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా
కాజ‌ల్ అగ‌ర్వాల్‌, రెజీనా

Kajal Aggarwal Horror Movie: ఏడాది గ్యాప్ త‌ర్వాత హార‌ర్ సినిమాతో కాజ‌ల్ రీఎంట్రీ - రిలీజ్ డేట్ ఫిక్స్‌

15 January 2023, 19:21 ISTNelki Naresh Kumar
15 January 2023, 19:21 IST

Kajal Aggarwal Horror Movie: ఏడాది గ్యాప్ త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్ హార‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది. ఆమె న‌టించిన త‌మిళ సినిమా ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ కానుంది. ఈ సినిమా ఏదంటే...

Kajal Aggarwal Horror Movie: కాజ‌ల్ అగ‌ర్వాల్ సినిమా రిలీజై దాదాపు ఏడాది కావ‌స్తోంది. హే సినామికా త‌ర్వాత‌ ప్రెగ్నెన్సీ కార‌ణంగా సినిమాల‌కు దూర‌మైంది. షూటింగ్‌ల‌కు గ్యాప్ తీసుకున్న‌ది. దాదాపు ఏడాది విరామం త‌ర్వాత ఓ హార‌ర్ సినిమాతో తిరిగి ప్రేక్ష‌క‌లు ముందుకు రాబోతున్న‌ది.

కాజ‌ల్, రెజీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో త‌మిళంలో క‌రుంగాపియ‌మ్ పేరుతో ఓ హార‌ర్ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు డి కార్తికేయ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సంక్రాంతి సంద‌ర్భంగా ఈ సినిమా కొత్త పోస్ట‌ర్‌ను ఆదివారం రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్‌లో అద్ధంలో రెజీనా చూస్తూ క‌నిపిస్తోంది. ప్ర‌తిబింబంలో రెజీనా కాకుండా కాజ‌ల్ క‌నిపించ‌డం ఆస‌క్తిని పంచుతోంది.

ఈ సినిమాను ఫిబ్ర‌వ‌రిలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. దాదాపు ఏడాది విరామం త‌ర్వాత రిలీజ్ అవుతోన్న కాజ‌ల్ సినిమా ఇదే కావ‌డం గ‌మ‌నార్హం. ఐదుగురు హీరోయిన్ల‌తో క‌రుంగాపియ‌మ్ సినిమా రూపొందుతోంది. కాజ‌ల్‌, రెజీనాతో పాటు జ‌న‌ని అయ్య‌ర్‌, రైజా విల్స‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న 62వ సినిమా ఇది. క‌రుంగాపియ‌మ్‌తో పాటుగా కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ సినిమా ఘోస్టీ, బాలీవుడ్ ఫిల్మ్ ఉమా రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. ప్ర‌స్తుతం క‌మ‌ల్ హాస‌న్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో రూపొందుతోన్న ఇండియ‌న్ -2 సినిమాలో కాజ‌ల్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

1996లో రిలీజైన ఇండియ‌న్‌కు సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ఇండియ‌న్ -2 సినిమా కోసం మార్ష‌ల్ ఆర్ట్స్ నేర్చుకొంది కాజ‌ల్ అగ‌ర్వాల్‌.