Kajal Aggarwal in Chandramukhi Sequel: చంద్రముఖి సీక్వెల్‌లో కాజల్
Kajal Aggarwal in Chandramukhi Sequel: కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కలయికలో రూపొందుతోన్న ఇండియన్ 2తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది కాజల్ అగర్వాల్. తాజాగా ఆమె మరో సీక్వెల్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. ఆ సీక్వెల్ ఏదంటే...
Kajal Aggarwal in Chandramukhi Sequel: రజనీకాంత్ హీరోగా నటించిన చంద్రముఖి సినిమా కోలీవుడ్‌లో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. హారర్ సినిమాల్లో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కుతోంది. చంద్రముఖి -2 పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాలో లారెన్స్ హీరోగా నటిస్తున్నాడు.
చంద్రముఖికి దర్శకత్వం వహించిన పి. వాసు ఈ సీక్వెల్‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో ఈ సీక్వెల్ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైనట్లు సమాచారం. కాగా ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
చంద్రముఖిగా యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్ కావడంతో కాజల్ ఈ హారర్ సినిమాలో నటించడానికి అంగీకరించినట్లు సమాచారం. చంద్రముఖి పార్ట్ వన్‌లో జ్యోతిక క్యారెక్టర్‌తో పాటు ఆమె నటనకు ప్రశంసలు దక్కాయి. అలా ఈ సీక్వెల్‌లో కాజల్ అగర్వాల్ పాత్ర నిలిచిపోతుందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సీక్వెల్ మొత్తం కాజల్ అగర్వాల్ క్యారెక్టర్ చుట్టూ సాగుతుందని తెలిసింది.
త్వరలోనే ఆమె చంద్రముఖి సీక్వెల్ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈ సీక్వెల్‌ను పూర్తిగా ఫ్రెష్ స్క్రిప్ట్‌తో దర్శకుడు పి. వాసు తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్నారు. మాతృత్వం కారణంగా సినిమాలకు దాదాపు ఎనిమిది నెలల పాటు విరామం తీసుకున్నది కాజల్ అగర్వాల్.
కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్నది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ను మొదలుపెట్టింది. ఇందులో పోరాట యోధురాలిగా ఆమె కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తన క్యారెక్టర్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటోంది.వచ్చే ఏడాది ఇండియన్ 2 సినిమా రిలీజ్ కానుంది.