Kajal Aggarwal: అందుకే తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నా - సీక్రెట్ రివీల్ చేసిన కాజల్
Kajal Aggarwal: తన పెళ్లిని తెలుగు సంప్రదాయం ప్రకారం జరుపుకోవడం వెనుకున్న సీక్రెట్‌ను సత్యభామ ప్రమోషన్స్‌లో కాజల్ అగర్వాల్ రివీల్ చేసింది. బాలీవుడ్ మూవీ ఫెయిలవ్వడం కెరీర్‌లో ఎక్కువగా బాధపెట్టిందని కాజల్ అన్నది.
Kajal Aggarwal: లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామతో త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది కాజల్ అగర్వాల్. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో కాజల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నది. సత్యభామ మూవీ ప్రమోషన్స్‌తో కాజల్ బిజీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అలీతో సరదాగా షోకు గెస్ట్‌గా కాజల్ అటెండ్ అయ్యింది.
తెలుగు కల్చర్‌పై అభిమానంతో...
ఈ షోలో తన పెళ్లిపై కాజల్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. తెలుగు కల్చర్ అంటే తనకు ఇష్టమని కాజల్ అన్నది. మాతృభాష పంజాబీ అయినా తెలుగు తనకు మరో పుట్టిల్లుగా మారిందని అన్నది. తెలుగు అమ్మాయిననే ఫీలింగ్ తనలో ఎప్పుడు ఉంటుందని, ఇక్కడి కల్చర్‌పై అభిమానంతోనే తన పెళ్లిని పంజాబీ, కశ్మీరీ తో పాటు తెలుగు సంప్రదాయం ప్రకారం జరుపుకున్నానని కాజల్ చెప్పింది.
తనకు హీరోయిన్‌గా పేరుతెచ్చిపెట్టిన తెలుగు భాషపై అభిమానాన్ని ఇలా చాటుకునే అవకాశం దక్కిందని కాజల్ అన్నది. సినిమాల్లో ఎన్నోసార్లు ఫేక్ వెడ్డింగ్ సీన్స్‌లో నటించానని. కానీ రియల్‌లైఫ్‌లో తెలుగు సంప్రదాయం ప్రకారం పెళ్లిచేసుకోవడం మాత్రం మరచిపోలేని అనుభూతిని ఇచ్చిందని చెప్పింది. తన పెళ్లి వేడుకలు తెలుగు ట్రెడిషన్‌తోనే మొదలయ్యాయని కాజల్ అన్నది.
నాగార్జునతో సినిమా మిస్...
నాగార్జునతో ఇప్పటివరకు సినిమా చేయలేకపోయానని కాజల్ అన్నది. ది ఘోస్ట్‌లో తొలుత హీరోయిన్‌గా నాకు అవకాశం వచ్చింది. నా కెరీర్‌లో ఫస్ట్ యాక్షన్ మూవీ కావడంతో ఇమిడియేట్‌గా గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాను. కానీ అదే టైమ్‌లో నేను ప్రెగ్నెంట్‌గా ఉండటంతో సినిమా నుంచి తప్పుకోవాల్సివచ్చిందని కాజల్ అన్నది.
నా జీవితంలో ఎప్పుడు ఐటెంసాంగ్ చేయకూడదని రూల్ పెట్టుకున్నాను. జనతా గ్యారేజ్‌లో అవకాశం రావడంతో ఎన్టీఆర్ కోసమే ఆ సినిమాలో పాట చేశానని చెప్పింది. డ్యాన్స్ పరంగా ఛాలెంజింగ్ సాంగ్ కావడంతోనే పాటలో నటించడానికి అంగీకరించానని కాజల్ అన్నది.
రెమ్యునరేషన్ పెంచలేదు...
తాను రెమ్యునరేషన్ పెంచినట్లు వచ్చిన వార్తలను కాజల్ ఖండించింది. సినిమాల కోసం తాను పడుతోన్న కష్టానికి తగ్గట్లుగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు కాజల్ తెలిపింది. తాను ఎప్పుడు రెమ్యునరేషన్ ఎక్కువ కావాలని ఎవరిని డిమాండ్ చేయలేదని అన్నది. తెలుగులో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్ తానేనని అడిగిన ప్రశ్నకు కాజల్ కాదని సమాధానం ఇచ్చింది.
ఆ బాలీవుడ్ మూవీ రిజల్ట్ బాధపెట్టింది.
కష్టపడి యాక్ట్ చేసిన సినిమా ఫెయిలైన తర్వాత బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయని కాజల్ అన్నది. హిందీలో దో లఫ్జోంజీ కహానీ పేరుతో ఓ సినిమా చేశానని కాజల్ అన్నది. ఈ సినిమాలో బ్లైండ్ అమ్మాయిగా కనిపించానని, బ్లైండ్ స్కూల్‌కు వెళ్లికి వర్క్‌షాప్స్ చేశానని కాజల్ అన్నది. కానీ సినిమా రిజల్ట్ మాత్రం నేను ఊహించినట్లుగా రాకపోవడంతో చాలా డిసపాయింట్ అయ్యానని కాజల్ చెప్పింది. ఆ సినిమా రిలీజైన విషయం కూడా ఎవరికి తెలియకపోవడం ఇంకా బాధించిందని కాజల్ అన్నది.
ఇండియన్ 2లో హీరోయిన్...
ప్రస్తుతం సత్యభామతో పాటు కమల్‌హాసన్‌తో ఇండియన్ 2 మూవీ చేస్తోంది కాజల్ అగర్వాల్. 1996లో రిలీజైన ఇండియన్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
టాపిక్