Kajal Aggarwal Ghosty: హార‌ర్ సినిమాలో ఫ‌స్ట్ టైమ్ కాజ‌ల్ డ్యూయ‌ల్ రోల్ - ఉగాదికి రిలీజ్‌-kajal aggarwal ghosty release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kajal Aggarwal Ghosty Release Date Locked

Kajal Aggarwal Ghosty: హార‌ర్ సినిమాలో ఫ‌స్ట్ టైమ్ కాజ‌ల్ డ్యూయ‌ల్ రోల్ - ఉగాదికి రిలీజ్‌

Nelki Naresh Kumar HT Telugu
Mar 11, 2023 07:21 AM IST

Kajal Aggarwal Ghosty: పెళ్లి త‌ర్వాత దాదాపు ఏడాదిన్న‌ర విరామం అనంత‌రం తొలిసారి ఓ హార‌ర్ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న‌ది కాజ‌ల్ అగ‌ర్వాల్‌. ఆ సినిమా ఏదంటే..

కాజ‌ల్
కాజ‌ల్

Kajal Aggarwal Ghosty: పెళ్లి త‌ర్వాత హార‌ర్ సినిమాతో టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్న‌ది కాజ‌ల్‌. ఆమె హీరోయిన్‌గా న‌టించిన ఘోస్టీ సినిమా ఉగాదికి టాలీవుడ్‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

హీరోయిన్‌గా వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న త‌రుణంలోనే వ్యాపార‌వేత్త‌, చిర‌కాల ప్రేమికుడు గౌత‌మ్ కిచ్లూను పెళ్లాడింది కాజ‌ల్‌. కుటుంబ‌బాధ్య‌త‌లు, మాతృత్వ‌బంధం కార‌ణంగా రెండేళ్ల‌కుపైగా సినిమాల‌కు దూరంగా ఉంది.

లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఘోస్టీ సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్న‌ది. హార‌ర్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాకు క‌ళ్యాణ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఈ సినిమాలో కాజ‌ల్ డ్యూయ‌ల్ రోల్‌లో న‌టించ‌డం గ‌మ‌నార్హం. పోలీస్ ఆఫీస‌ర్‌గా, సినిమా హీరోయిన్‌గా రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్న‌ది. ఇద్ద‌రు ఒకే పోలిక‌ల‌తో ఉండ‌టం వ‌ల్ల ఏర్ప‌డే క‌న్ఫ్యూజ‌న్ చుట్టూ అల్లుకున్న కామెడీతో ఈ సినిమాను రూపొందించారు.

ఘోస్టీ సినిమాలో యోగిబాబుతో పాటు రాధికా శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. సీనియ‌ర్‌డైరెక్ట‌ర్ కె.ఎస్ ర‌వికుమార్ విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఉగాదికి ఈ సినిమా రిలీజ్ కానుంది.

ప్ర‌స్తుతం తెలుగులో బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది కాజ‌ల్‌. త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్‌, శంక‌ర్ క‌ల‌యిక‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఇండియ‌న్ -2 సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తోంది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.