Kajal Agarwal Ghosty Teaser: కాజల్ ఫస్ట్ హారర్ మూవీ ఘోస్టీ టీజర్ రిలీజ్
Kajal Agarwal Ghosty Teaser: హారర్ సినిమాతో కెరీర్‌లో తొలిసారి ప్రేక్షకుల్ని భయపెట్టేందుకు రెడీ అవుతోంది కాజల్ అగర్వాల్. ఆమె హీరోయిన్‌గా నటించిన తమిళ చిత్రం ఘోస్టీ ట్రైలర్ సోమవారం విడుదలైంది.
Kajal Agarwal Ghosty Teaser: కెరీర్‌లో తొలిసారి ఓ హారర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది కాజల్ అగర్వాల్. ఆమె హీరోయిన్‌గా నటించిన తమిళ సినిమా ఘోస్టీ టీజర్ సోమవారం రిలీజైంది. హారర్ కామెడీ మిక్స్‌తో నవ్విస్తూనే ఈ ట్రైలర్ భయపెడుతోంది. ఈ ఘోస్టీ టీజర్ పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ పవర్‌ఫుల్ లుక్‌లో ఎంట్రీ ఇచ్చింది.
పోలీస్ స్టేషన్‌లో ఓ దయ్యం ప్రవేశించడం, ఆ ఆత్మ కారణంగా కాజల్‌తో పాటు మిగిలిన పోలీసులు ఎదుర్కొనే ఇబ్బందులతో టీజర్ ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. 18 ఏళ్ల సినీ ప్రయాణంలో కాజల్ అగర్వాల్ చేస్తోన్న తొలి హారర్ సినిమా ఇదే కావడం గమనార్హం.
ఈ సినిమా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ వార్తలను ఖండిస్తూ థియేటర్లలోనే సినిమాను విడుదలచేయబోతున్నట్లు ట్రైలర్‌లో యోగిబాబు డైలాగ్ ద్వారా చెప్పించారు. ఘోస్టీ సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
హారర్ డార్క్ ఫాంటసీ కథాంశంతో రూపొందుతోన్న ఈ మహిళా ప్రధాన చిత్రంలో కాజల్ అగర్వాల్‌తో పాటు రాధిక, ఊర్వశి, యోగిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలో ఘోస్టీ సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
తల్లిగా మారడంతో గత ఎనిమిది నెలలుగా సినిమాలకు దూరంగా ఉంటోంది కాజల్. ఇండియన్- 2తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నది. ఇటీవలే ఈ సీక్వెల్ షూటింగ్ మొదలుపెట్టింది. కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ పోరాట యోధురాలి పాత్రలో కనిపించబోతున్నది.