Dhee Promo: ఢీషోకు స్పెష‌ల్ గెస్ట్‌గా కాజ‌ల్ - గ్రాండ్ ఫినాలే చేరుకునే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవ‌రంటే?-kajal aggarwal attends as special guest for this week dhee celebrity special dance show etv satyabhama movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhee Promo: ఢీషోకు స్పెష‌ల్ గెస్ట్‌గా కాజ‌ల్ - గ్రాండ్ ఫినాలే చేరుకునే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవ‌రంటే?

Dhee Promo: ఢీషోకు స్పెష‌ల్ గెస్ట్‌గా కాజ‌ల్ - గ్రాండ్ ఫినాలే చేరుకునే ముగ్గురు కంటెస్టెంట్స్ ఎవ‌రంటే?

Nelki Naresh Kumar HT Telugu
May 21, 2024 01:05 PM IST

Dhee Promo: ఢీ డ్యాన్స్ షో సీజ‌న్ 17లో ఈ వారం ఎపిసోడ్‌కు కాజ‌ల్ అగ‌ర్వాల్ స్పెష‌ల్ గెస్ట్‌గా రాబోతోంది. గ్రాండ్ ఫినాలే ముందు జ‌రుగునున్న ఈ ఎపిసోడ్ నుంచి ఓ కంటెస్టెంట్ ఎలిమినేట్ కాబోతున్నాడు. మిగిలిన ముగ్గురు ఫినాలేలో అడుగుపెట్ట‌బోతున్నారు.

ఢీ డ్యాన్స్ షో
ఢీ డ్యాన్స్ షో

Dhee Promo: బుల్లితెరపై ఢీ షో క్రియేట్ చేసిన సెన్సేష‌న్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగులో అత్య‌ధిక సీజ‌న్స్ టెలికాస్ట్ అయిన డ్యాన్స్ రియాలిటీ షోల‌లో ఒక‌టిగా ఢీ నిలిచింది. ప్రస్తుతం ఢీషోలో 17వ సీజన్ నడుస్తోంది. ఢీ సీజ‌న్ 17 కూడా ముగింపు దశకు వచ్చేసింది. ఇప్పుడు రేస్ టూ ఫినాలే ఎపిసోడ్ జరగనుంది. ఈ ఢీ సీజ‌న్‌ 17లో బుధవారం నాడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో కాజల్ అగర్వాల్ సందడి చేయబోత‌న్న‌ది. స‌త్య‌భామ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా కాజ‌ల్ ఢీ షోకు స్పెష‌ల్ గెస్ట్‌గా హాజ‌రైంది.

క్వీన్ ఆఫ్ టాలీవుడ్‌...

ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అవుతోంది. క్వీన్ ఆఫ్ టాలీవుడ్ అని పేరు చెప్ప‌గానే కాజ‌ల్ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇస్తూ ఈ ప్రోమోలో క‌నిపించింది. అక్టోబ‌ర్ 30 మీ మ్యారేజ్...కానీ అదే రోజు నా డెత్ డే...పెళ్లికి ముందు మిమ్మ‌ల్ని ఊహించుకుంటూ ఎన్నో క‌విత‌లు రాసుకున్నా. పెళ్లి త‌ర్వాత నేను కిచ్లూ బాధితుడిని అయ్యా అంటూ హైప‌ర్ ఆది వేసిన పంచ్‌లు ప్రోమోలో న‌వ్వుల‌ను పూయిస్తున్నాయి. ఆ త‌ర్వాత కాజ‌ల్ అగ‌ర్వాల్‌, హైప‌ర్ ఆది ఇద్ద‌రు క‌లిసి పాట పాడారు.

బంతిపూల జాన‌కీ....

శేఖర్ మాస్టర్‌తో కలిసి బంతిపూల జానకి పాట‌కు కాజల్ వేసిన స్టెప్పులు ప్రోమోకే హైలెట్ అయ్యాయి. ఇక కాజల్ రాకతో ఈ ఎపిసోడ్ ఎంతో గ్రాండియర్‌గా మారింది. ఇవే కాకుండా కంటెస్టెంట్ల అల్టిమేట్ పర్ఫామెన్స్‌లు చూసి కాజల్ షాక్ అయ్యారు. ఒక్క‌రిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించింది.

గ్రాండియ‌ర్ ప‌ర్ఫామెన్స్‌...

ఈ ఎపిసోడ్‌లో నాలుగు గ్రాండియర్ పర్ఫామెన్స్‌లు ఉంటాయి. శంభో శివ శంభో అంటూ ఆదర్శ్ అందరినీ మెస్మరైజ్ చేయబోతన్నారు. శ్వేతనాయుడు కాజల్‌ని ఇమిటేట్ చేసింది. వర్షిణి అర్జ ఏమో రావణాసుర ఆంథమ్‌కి డ్యాన్స్ చేసి రామాయణాన్ని చూపించింది. శ్వేతా నాయుడు, రాకీ ప‌ర్ఫార్మెన్స్‌లు అద‌రిపోయేలా ఉన్న‌ట్లు ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది.

ఈ ఎపిసోడ్ తరువాత ఒకరు ఎలిమినేట్ అవుతారు. ముగ్గురు మాత్రం ఫైనల్‌కి వెళ్ల‌నున్నారు. ఆ ఒక్క‌రు ఎవ‌ర‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. పోటాపోటీ ప‌ర్ఫార్మెన్స్‌లు చూస్తూ రేస్ టూ ఫినాలే పోటీ ర‌స‌వ‌త్త‌రంగా ఉండ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఎవ‌రిని ఎలిమినేట్ చేయాల‌న్న‌ది జ‌డ్జ్‌ల‌కు ట‌ఫ్ డెసిష‌న్‌గా నిల‌వ‌నున్న‌ట్లు తె లుస్తోంది. ఢీ షో ప్ర‌తి బుధ‌వారం రాత్రి 9.30 టెలికాస్ట్ అవుతుంది. ఢీ సీజ‌న్ 17కు శేఖ‌ర్ మాస్ట‌ర్, హీరోయిన్ ప్ర‌ణీత జ‌డ్జ్‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

స‌త్య‌భామ మూవీ ప్ర‌మోష‌న్స్‌...

స‌త్య‌భామ మూవీ ప్ర‌మోష‌న్స్‌తో కాజ‌ల్ బిజీగా ఉంది. క్రైమ్ థ్రిల్ల‌ర్ క‌థ‌తో తెర‌కెక్కుతోన్న ఈ లేడీ ఓరియెంటెడ్ మూవీతో సుమ‌న్ చిక్కాల ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. తొలుత ఈ మూవీని మే 17న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. కానీ థియేట‌ర్స్ బంద్ స‌మ‌స్య కార‌ణంగా రిలీజ్ వాయిదా ప‌డింది. కొత్త రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లోనే అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ మూవీలో ప్రకాష్ రాజ్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.

టీ20 వరల్డ్ కప్ 2024