మండోదరిగా కాజల్.. రావణుడు యశ్ పక్కన ఛాన్స్.. రామాయణం షూటింగ్‌లో చేరిన టాలీవుడ్ బ్యూటీ-kajal aggarwal as mandodari in nitish tiwary ramayana movie starring opposite ravana yash ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  మండోదరిగా కాజల్.. రావణుడు యశ్ పక్కన ఛాన్స్.. రామాయణం షూటింగ్‌లో చేరిన టాలీవుడ్ బ్యూటీ

మండోదరిగా కాజల్.. రావణుడు యశ్ పక్కన ఛాన్స్.. రామాయణం షూటింగ్‌లో చేరిన టాలీవుడ్ బ్యూటీ

Hari Prasad S HT Telugu

నితీశ్ తివారీ రామాయణ మూవీలో కాజల్ అగర్వాల్ కూడా చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఆమె రావణుడి భార్య మండోదరి పాత్ర పోషిస్తోంది. అంటే మూవీలో రావణుడు అయిన యశ్ పక్కన ఆమె కనిపించనుంది.

మండోదరిగా కాజల్.. రావణుడు యశ్ పక్కన ఛాన్స్.. రామాయణం షూటింగ్‌లో చేరిన టాలీవుడ్ బ్యూటీ

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ప్రాజెక్ట్ రామాయణ. రెండు భాగాలుగా ఈ సినిమా రానుంది. ఇందులో రాముడిగా రణ్‌బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక నిర్మాతల్లో ఒకరిగా ఉన్న యశ్.. రావణుడిగా నటిస్తున్నాడు. ఇప్పుడతని భార్య మండోదరిగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లు ఇండియా టుడే రిపోర్ట్ వెల్లడించింది.

రామాయణ షూటింగ్ మొదలుపెట్టిన కాజల్

అత్యంత భారీ బడ్జెట్ తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. వచ్చే ఏడాది తొలి పార్ట్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా వస్తున్న రిపోర్టుల ప్రకారం.. ఇందులో మండోదరి పాత్రను కాజల్ అగర్వాల్ పోషిస్తోంది. రావణుడిగా నటిస్తున్న యశ్ పక్కన ఆమె కనిపించబోతున్నట్లు ఇండియా టుడే రిపోర్టు తెలిపింది. ఇప్పటికే ఆమె షూటింగ్ కూడా మొదలుపెట్టినట్లు ఈ రిపోర్టు వెల్లడించింది.

“రామాయణంలో మండోదరి పాత్ర చాలా కీలకమైనది. అందుకే ఇండస్ట్రీలో మంచి పేరున్న నటిని, అంతేకాకుండా యశ్ పోషిస్తున్న రావణుడి పాత్ర పక్కన అదే స్థాయిలో పేరున్న నటిని ఎంపిక చేశారు. వివిధ భాషల్లో పరిచయం ఉన్న నటిని మేకర్స్ అనుకున్నారు. ఎంతోమంది హీరోయిన్లను అనుకున్నారు. అందులో బాలీవుడ్ నుంచి కూడా ఉన్నారు. అటు నార్త్, సౌత్ లో మంచి పేరు సంపాదించిన కాజల్ మంచి ఛాయిస్ గా కనిపించింది” అని ఆ రిపోర్టు చెప్పింది.

రామాయణ మూవీ గురించి..

నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణ మూవీలో దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకున్నారు. బాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకడైన రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సౌత్ లో మంచి పేరున్న సాయి పల్లవిని సీతగా, కేజీఎఫ్ తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యశ్ ను రావణుడిగా చూపించబోతున్నారు.

ఇక సన్నీడియోల్, లారా దత్తాలాంటి వాళ్లూ నటిస్తున్నారు. రామాయణలో తొలి భాగం వచ్చే ఏడాది దీపావళికి రిలీజ్ కానుంది. ఇక రెండో భాగంగా 2027లో రిలీజ్ కానుంది. నమిత్ కపూర్ ఈ సినిమా నిర్మిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం