OTT Today: నేడు ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు.. తమిళ మూవీ తెలుగులోనూ.. ఓ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్-kadhalikka neramillai and bobby aur rishi ki love story films streaming started today on netflix and hostar otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Today: నేడు ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు.. తమిళ మూవీ తెలుగులోనూ.. ఓ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్

OTT Today: నేడు ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు.. తమిళ మూవీ తెలుగులోనూ.. ఓ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్

Chatakonda Krishna Prakash HT Telugu
Published Feb 11, 2025 09:31 AM IST

OTT Today: నేడు ఓటీటీల్లో రెండు చిత్రాలు స్ట్రీమింగ్‍కు వచ్చేశాయి. నిత్యా మీనన్ నటించిన ఓ తమిళ మూవీ నేడు ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఓ హిందీ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఆ రెండు సినిమాలు ఏవి.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు వచ్చాయంటే..

OTT Today: నేడు ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు.. తమిళ మూవీ తెలుగులోనూ.. ఓ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్
OTT Today: నేడు ఓటీటీలోకి వచ్చిన రెండు సినిమాలు.. తమిళ మూవీ తెలుగులోనూ.. ఓ చిత్రం డైరెక్ట్ స్ట్రీమింగ్

ఓటీటీలో కొత్త చిత్రాలు చూడాలనుకునే వారికి.. నేడు రెండు అందుబాటులోకి వచ్చేశాయి. రెండు రొమాంటిక్ కామెడీ చిత్రాలు అడుగుపెట్టాయి. ఇందులో కాదలిక్క నేరమిళ్లై డిఫరెంట్ స్టోరీతో తెరకెక్కింది. ఈ మూవీలో నిత్యా మీనన్, రవి మోహన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఓ హిందీ చిత్రం నేరుగా స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. నేడు (ఫిబ్రవరి 11) స్ట్రీమింగ్‍కు వచ్చిన రెండు సినిమాల వివరాలు ఇవే..

కాదలిక్క నేరమిళ్లై

కాదలిక్క నేరమిళ్లై చిత్రం నేడు ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళంలో స్ట్రీమింగ్‍కు వచ్చింది. కన్నడ వెర్షన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. నాలుగు భాషల్లో స్ట్రీమ్ అవుతోంది. ఈ చిత్రం జనవరి 14న థియేటర్లలో తమిళంలో విడుదలైంది. సరిగ్గా నాలుగు వారాలకు నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేసింది.

మోడ్రన్ రిలేషన్స్, లవ్, ఐవీఎఫ్ అంశాల చుట్టూ కాదలిక్క నేరమిళ్లై చిత్రం సాగుతుంది. కామెడీ కూడా బాగానే ఉంటుంది. ఈ చిత్రం కొన్ని సెన్సిటివ్ అంశాలను కూడా టచ్ చేస్తుంది. ఈ సినిమాలో తమిళ హీరో రవి మోహన్ (జయం రవి), నిత్యా మీనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి కృతిగ ఉదయనిధి దర్శకత్వం వహించారు.

కాదలిక్క నేరమిళ్లై మూవీకి థియేటర్లలో పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే కమర్షియల్‍గా పెద్ద హిట్ కొట్టలేకపోయింది. ఈ మూవీ సుమారు రూ.17కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుందని అంచనా. ఓటీటీలోకి నాలుగు భాషల్లో రావడంతో మంచి వ్యూస్ దక్కే అవకాశం ఉంది. ఈ మూవీకి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు.

బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ

హిందీ రొమాంటిక్ కామెడీ మూవీ ‘బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ’ డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీలో నేడు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. అమ్మాయి, అబ్బాయి ఇష్టపడడం, ఆ తర్వాత వారి మధ్య దూరం పెరగడం, మళ్లీ కలిసే సవాళ్లు ఎదురవడం చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. ఈ మూవీలో వర్ధన్ పూరి, కావేరి కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ కాకుండా నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది.

వాలైంటైన్స్ వీక్‍లో ఈ లవ్ మూవీ ‘బాబీ ఔర్ రిషి కీ లవ్ స్టోరీ’ హాట్‍స్టార్ ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇంగ్లిష్ సబ్‍టైటిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ మూవీకి కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించారు.

Whats_app_banner

సంబంధిత కథనం