Kabzaa OTT Release Date: ఉపేంద్ర కబ్జా వచ్చేది ఆ ఓటీటీలోనే.. రిలీజ్ డేట్ ఇదే!
Kabzaa OTT Release Date: ఉపేంద్ర కబ్జా ఏ ఓటీటీలో వస్తుందో తేలిపోయింది. ఈ మూవీ శుక్రవారం (మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అప్పుడే ఓటీటీ రిలీజ్ డేట్ కూడా వచ్చేసింది.
Kabzaa OTT Release Date: కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన లేటెస్ట్ మూవీ కబ్జా. ఈ సినిమా శుక్రవారం (మార్చి 17) థియేటర్లలో రిలీజైంది. కేజీఎఫ్ తర్వత కన్నడనాట ఆ స్థాయిలో ఆసక్తి రేపిన మూవీ ఇది. నిజానికి ఈ సినిమా ట్రైలర్ వచ్చినప్పుడు కేజీఎఫ్ సెట్ లోనే తీసిన మరో సినిమా, అచ్చూ దానిలాగే ఉందన్న విమర్శలు కూడా వచ్చాయి.
ట్రెండింగ్ వార్తలు
అయినా ఈ సినిమాకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు. నిజానికి గతేడాదే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా.. మొత్తానికి ఇప్పుడు వచ్చింది. కేజీఎఫ్ లో బ్యాక్‌గ్రౌండ్ స్కోరు ఇరగదీసిన రవి బస్రూరే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందించాడు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగినట్లే ఈ కబ్జా మూవీ డిజిటల్ హక్కులను ఏకంగా రూ.150 కోట్లకు అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
నిజానికి ఈ సినిమాకు భారీ మొత్తమే దక్కినా.. మరీ ఈ స్థాయిలో మాత్రం రాలేదని ఇండస్ట్రీ వర్గాలు తెలిపాయి. ఆర్.చంద్రు డైరెక్టర్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 13 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉపేంద్ర, శివ రాజ్ కుమార్, కిచ్చా సుదీప్, శ్రియ శరణ్ లాంటి సీనియర్ నటీనటులు నటించిన కబ్జా మూవీ పాన్ ఇండియా లెవల్లో ఎంతో ఆసక్తి రేపుతోంది.
1942 నుంచి 1986 మధ్య కాలంలో ఉన్న ఓ గ్యాంగ్‌స్టర్ స్టోరీగా కబ్జా మూవీ తెరకెక్కింది. ఓ చిన్న గ్యాంగ్‌స్టర్ పెద్ద డాన్ గా ఎలా ఎదిగాడన్నదే ఈ మూవీ ప్రధాన కథాంశం. నిజానికి ఈ స్టోరీ విన్నా, ట్రైలర్ చూసినా కేజీఎఫ్ గుర్తుకు రావడం ఖాయం. ఆ మూవీ రెండు భాగాలు సూపర్ డూపర్ హిట్ కావడంతో వాటి ప్రభావం ఈ మూవీపై పడినట్లు మేకింగ్ చూస్తే స్పష్టంగా కనిపిస్తోంది.
కబ్జా మూవీ కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో శుక్రవారం (మార్చి 17) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు ట్విటర్ లో చాలా వరకూ పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. స్క్రీన్ ప్లే, స్టోరీ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయంటూ ట్వీట్లు చేస్తున్నారు.
సంబంధిత కథనం