Kaatera OTT Release Date: కన్ఫమ్.. కాటేరా ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే కానీ..-kaatera ott release date zee5 to stream darshan movie ott news in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kaatera Ott Release Date: కన్ఫమ్.. కాటేరా ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే కానీ..

Kaatera OTT Release Date: కన్ఫమ్.. కాటేరా ఓటీటీలోకి వచ్చేది ఆ రోజే కానీ..

Hari Prasad S HT Telugu
Feb 01, 2024 07:28 PM IST

Kaatera OTT Release Date: కన్నడ ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన కాటేరా మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ప్రముఖ ఓటీటీ జీ5 ఈ మూవీని ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ చేయనుంది.

కాటేరా మూవీలో దర్శన్
కాటేరా మూవీలో దర్శన్

Kaatera OTT Release Date: ప్రభాస్ సలార్ మూవీకి పోటీగా రిలీజై సంచలన విజయం సాధించిన మూవీ కాటేరా. ఛాలెంజింగ్ స్టార్ దర్శన్ నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా వసూళ్లతో సంచలనం సృష్టించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ కన్ఫమ్ అయింది. ఫిబ్రవరి 9న దర్శన్ బర్త్‌డే నుంచే మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.

yearly horoscope entry point

కాటేరా ఓటీటీ స్ట్రీమింగ్

కన్నడలో సలార్ మూవీకి పోటీగా డిసెంబర్ 29న కాటేరా రిలీజైంది. సలార్ లాంటి పెద్ద సినిమాతో ఎందుకు పోటీ పడుతున్నారని రిలీజ్ కు ముందు అడిగితే.. తన కాటేరా సినిమా చూసే సలార్ భయడాలని దర్శన్ అన్నాడు. చెప్పినట్లే ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర సలార్ ను పక్కకు నెట్టి భారీ వసూళ్లు సాధించింది. ఇప్పుడు సుమారు నెలన్నర రోజుల తర్వాత ఫిబ్రవరి 9న ఓటీటీ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.

నిజానికి ఫిబ్రవరి 16న వస్తుందని అనుకున్నా.. వారం ముందుగానే జీ5 తీసుకొస్తోంది. అయితే ఆరోజు కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళం వెర్షన్లు కాస్త ఆలస్యం కానున్నాయి. దీనికోసం ఇప్పటికే సెన్సార్ పనులు కూడా మొదలైనట్లు గతంలో వార్తలు వచ్చాయి. అన్ని భాషల్లోనూ ఒకేసారి రిలీజ్ చేస్తారని అనుకున్నా.. ఫిబ్రవరి 9న కన్నడ వెర్షన్ మాత్రమే రానుంది.

కాటేరా మూవీపై అభిమాని విమర్శలు

కన్నడనాట కాటేరా మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాక్సాఫీస్ దగ్గర కూడా అదరగొట్టింది. అయితే ఓ అభిమాని మాత్రం సోషల్ మీడియాలో ఈ సినిమాకు వ్యతిరేకంగా చేసిన పోస్ట్ వైరల్ అయింది. ఈ మూవీలో కుల వ్యవస్థతోపాటు బ్రాహ్మణులను అవమానించినట్లు చూపించడంపై ఆ అభిమాని మండిపడ్డారు. ఈ కాలంలో కుల వ్యవస్థ ఏంటని ప్రశ్నించారు.

ఈ మూవీలో దర్శన్ నటనను సదరు ఫ్యాన్ అభినందించినా.. బ్రాహ్మణులను ఏమన్నా కూడా ఏమీ అనరన్న ఉద్దేశంతోనే ఇలాంటి సినిమాలు చేస్తారా అని విమర్శించారు. కాటేరా మూవీ ఓ పీరియడ్ మూవీ. 1970ల్లో జరిగిన కథగా తీశారు. ఆ కాలంలోని ఓ భూసంస్కరణ బిల్లు చుట్టూ తిరిగే కథ ఇది. తన గ్రామ ప్రజల హక్కుల కోసం పోరాడే పాత్రలో దర్శన్ నటించాడు.

కాటేరా మూవీ 2023లో సాండ‌ల్‌వుడ్‌లో అత్య‌ధిక వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. క‌న్న‌డ ఇండ‌స్ట్రీ చ‌రిత్ర‌లో హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకున్న సినిమాల్లో ఏడో స్థానంలో నిలిచింది.

కాటేరా మూవీలో సీనియ‌ర్ క‌థానాయిక మాలాశ్రీ కూతురు ఆరాధ‌న రామ్ హీరోయిన్‌గా న‌టించింది. ఈ సినిమాతోనే ఆమె క‌న్న‌డ ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కాటేరాలో టాలీవుడ్ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు విల‌న్‌గా న‌టించాడు. రాక్‌లైన్ వెంక‌టేష్ ఈ మూవీని నిర్మించాడు.

Whats_app_banner