బిగ్‌బాస్ సీజన్ 8 తర్వాత మరోసారి ఓ ఓటీటీలో షోలో కలిసి సందడి చేయబోతున్నారు ప్రేరణ, యష్మి. ఆహా ఓటీటీలో కాకమ్మ కథలు పేరుతో ఓ టాక్ షో టెలికాస్ట్ అవుతోంది. ఈ షోకు తేజస్వి మదివాడ హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. కాకమ్మ కథలు సీజన్ 2 నాలుగో ఎపిసోడ్‌కు బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ ప్రేరణ కంభం, యష్మి గౌడ గెస్ట్‌లుగా రాబోతున్నారు.
ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను ఇటీవల ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. యూట్యూబ్‌లో ఈ ప్రోమో వైరల్ అవుతోంది. ఈ ప్రోమోలో ఒకరిపై మరొకరు పోటీపడి పంచ్‌లు వేస్తూ ప్రేరణ, యష్మి నవ్వించారు.
వరల్డ్స్‌లో ఉన్న బ్రాండ్స్‌ను కాపీ చేస్తుంది చైనా. కానీ కాపీ చేయలేని ఒక బ్రాండ్ ఉంది తనే ప్రేరణ అంటూ తేజస్వి ఎలివేషన్లు ఇవ్వడం ఈ ప్రోమోలో ఆకట్టుకుంటుంది. నైటీతో ఈ షోలోకి ప్రేరణ ఎంట్రీ ఇచ్చినట్లుగా ప్రోమోలో చూపించారు. నా షోకు నైటీలో ఎందుకు వచ్చావని ప్రేరణను అడిగింది తేజస్వి. మస్తు కంపర్టబుల్‌గా ఉంటది...ఇంట్లో కూర్చొని మాట్లాడుకున్నట్లే ఉంటది నీ షో అన్నావు...నాకు దీని కన్న కంఫర్టబుల్ లేదు ఇంట్లో అని ప్రేరణ బదులిచ్చింది.
ప్లీజ్ లేచి వెళ్లి బట్టలు మార్చుకో అని ప్రేరణను తేజస్వి బతిమిలాడింది. కొత్త బట్టలు అని చెప్పగానే ప్రేరణ పరిగెత్తుకుంటూ వెళ్లింది. ప్రేరణ బయటకు వెళ్లగానే ఆమె గురించి ఓ గాసిప్ చెప్పమని యష్మిని అడిగింది తేజస్వి. కొత్త బట్టలు అనగానే ఎలా పరిగెత్తుకుంటూ వెళ్లిందో చూశావా అన్నది యష్మి.
నాది ఫాస్ట్ నీది స్మూత్ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ చెప్పింది యష్మి. ఏదైనా సినిమాలో నీకు విలన్ రోల్‌లో నటించే ఆఫర్ వస్తే...ఆ సినిమాలో ఎవరు హీరో అయితే బాగుంటుంది...అతడితో ఎలాంటి పంచ్ డైలాగ్ చెబుతావు అని యష్మిని తేజస్వి అడిగింది.
నేను విలన్‌గా నటించే సినిమాలో బిగ్‌బాస్ విన్నర్ నిఖిల్ హీరోగా నటిస్తే బాగుంటుందని యష్మి బదులిస్తుంది. నా కొడకా అంటూ నిఖిల్‌కు వార్నింగ్ ఇస్తానని కన్నడ భాషలో డైలాగ్ చెప్పింది యష్మి.
నవ్వులే కాకుండా తమ లైఫ్‌లోని కొన్ని ఎమోషనల్ మూవ్‌మెంట్స్‌ను యష్మి, ప్రేరణ ఈ షోలో పంచుకున్నారు. ఇప్పటికీ కూడా తన జీవితంలో చాలా స్లీప్‌లెన్ నైట్స్ ఉన్నాయని ప్రేరణ అన్నది. తాను ఎదుర్కొంటున్న కష్టాలను పంచుకుంది.
ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో తండ్రి తనపై చేయి చేసుకున్నాడని చెబుతూ యష్మి ఎమోషనల్ అయ్యింది. నన్ను స్క్రాప్ పీస్ అంటూ కెరీర్ ఆరంభంలో అవమానించారని అన్నది. ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.మే 17న ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కాబోతోంది.