OTT Romantic: ఓటీటీకి వచ్చిన రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామా- తల్లి ముందే రొమాన్స్ చేసే కూతురు- 9.1 ఐఎమ్‌డీబీ రేటింగ్!
Kaadhal Enbadhu Podhu Udamai OTT Streaming: ఓటీటీలోకి వివాదాస్పద తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రం కాదల్ ఎంబదు పోదు ఉడమై డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చింది. థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కాంట్రవర్సీకి గురి కాగా నటీనటుల నుంచి ప్రశంసలు అందుకుంది. కాదల్ ఎంబదు పోదు ఉడమై ఓటీటీ రిలీజ్ వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
Kaadhal Enbadhu Podhu Udamai OTT Release: ఓటీటీలోకి ఎవరు ఊహించని కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. జోనర్ ఎలాంటిది అయినా కాన్సెప్ట్ కొత్తగా ఉంటే ప్రేక్షకులు మాత్రం ఆదరణ చూపిస్తున్నారు. అయితే, కొన్నిసార్లు బోల్డ్ కంటెంట్‌తో వచ్చే సినిమాలకు వివాదాలు ఎదురవుతుంటాయి.
స్వలింగ సంపర్కం వంటి
అలా కాంట్రవర్సీ ఎదుర్కొన్న తమిళ సినిమానే కాదల్ ఎంబదు పోదు ఉడమై (Kaadhal Enbadhu Podhu Udamai). తమిళ రొమాంటిక్ డ్రామా చిత్రంగా తెరకెక్కిన కాదల్ ఎంబదు పోదు ఉడమై సినిమా ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకోవడం అనే బోల్డ్ కాన్సెప్ట్‌పై తెరకెక్కింది. ఈ మధ్య కాలంలో అబ్బాయి-అబ్బాయి, అమ్మాయి-అమ్మాయి, స్వలింగ సంపర్కం వంటి విషయాలు చూస్తున్నాం.
ఇలాంటి అమ్మాయి-అమ్మాయి ప్రేమించుకోవడం, పెళ్లి చేసుకోవడంలో తప్పులేదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. 2023లో తెరకెక్కిన ఈ సినిమాను ముందుగా అదే ఏడాది నవంబర్ 20న రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ, 2025లో ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలో కాదల్ ఎంబదు పోదు ఉడమై మూవీ రిలీజ్ అయింది.
జ్యోతిక మెచ్చిన చిత్రం
థియేటర్లలో రిలీజ్ అవ్వగానే ఈ సినిమా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇందులో చూపించిన బోల్డ్ కాన్సెప్ట్ కాంట్రవర్సీకి దారితీసింది. కానీ, కాదల్ ఎంబదు పోదు ఉడమై సినిమాకు మాత్రం ప్రశంసలు వచ్చాయి. సీనియర్ హీరోయిన్ జ్యోతిక సైతం ఈ మూవీని మెచ్చుకున్నారు. మంచి సందేశాత్మక చిత్రమంటూ కితాబిచ్చారు.
అంతేకాకుండా ఐఎమ్‌డీబీ సంస్థ నుంచి 10కి ఏకంగా 9.1 రేటింగ్ సొంతం చేసుకుంది కాదల్ ఎంబదు పోదు ఉడమై సినిమా. లెన్స్ వంటి విభిన్న చిత్రం తెరకెక్కించిన జయప్రకాశ్ రాధాకృష్ణన్ కాదల్ ఎంబదు పోదు ఉడమై మూవీకి దర్శకత్వం వహించారు. తెలుగు నటి రోహిణి, సీనియర్ హీరో వినీత్ ఇందులో తల్లిదండ్రులుగా నటించారు.
ఓటీటీ రిలీజ్
జై భీమ్ నటి లిజోమోల్ జోస్, అనూష ప్రభు ప్రధాన పాత్రలు పోషించగా దీప శంకర్, కాలేష్, దీప ఇతర కీ రోల్స్ చేశారు. ఇలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 14 నుంచి టెంట్‌కొట్టా ప్లాట్‌ఫామ్‌లో కాదల్ ఎంబదు పోదు ఉడమై ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతానికి తమిళంలోనే కాదల్ ఎంబదు పోదు ఉడమై ఓటీటీ రిలీజ్ అయింది.
ముందు ముందు తెలుగులో కాదల్ ఎంబదు పోదు ఉడమై మూవీని డిజిటల్ స్ట్రీమింగ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికొస్తే గారాబంగా పెంచుకున్న కూతురు సామ్ ఒకరిని ప్రేమించానని చెబుతుంది. దాంతో అతన్ని ఇంటికి తీసుకురమ్మని తల్లి అంటుంది. కానీ, తను ప్రేమించింది మరో అమ్మాయిని అని ఎలా చెప్పాలో తెలియక సతమతం అవుతుంది.
తల్లి ముందే
తనను చిన్నప్పటి నుంచి ఇష్టపడే అబ్బాయితోపాటు తను ప్రేమించిన అమ్మాయిని తల్లి దగ్గరికి తీసుకెళ్తుంది సామ్. అబ్బాయి బాగున్నాడని తల్లి అంటుంది. కానీ, తను ప్రేమించింది అమ్మాయిని అని సామ్ చెబుతుంది. కానీ, పేరెంట్స్ నమ్మరు. దాంతో తల్లి ముందే అమ్మాయిని కిస్ చేసి తామిద్దరు ప్రేమించుకున్నట్లు, పెళ్లి చేసుకోవాలనుకున్నట్లు చెబుతుంది సామ్.
కూతురు చేసిన పనికి ఒక్కసారిగా షాక్ అయిన తల్లిదండ్రులు దాన్ని వ్యతిరేకిస్తారు. ఆ తర్వాత ఏమైంది అనేదే సినిమా కథ. టెంట్‌కొట్టా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ తమిళ రొమాంటిక్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా చిత్రం కాదల్ ఎంబదు పోదు ఉడమైని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో ఎంచక్కా చూసేయొచ్చు.
సంబంధిత కథనం
టాపిక్