KA Day 1 Box Office Collection: అదిరిపోయిన క మూవీ తొలి రోజు కలెక్షన్లు.. కిరణ్ అబ్బవరం కెరీర్లోనే అత్యధికం
KA Day 1 Box Office Collection: కిరణ్ అబ్బవరం నటించిన క మూవీ తొలి రోజే బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది. అతని కెరీర్లోనే అత్యధిక తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు సాధించిన సినిమాగా నిలవడం విశేషం.
KA Day 1 Box Office Collection: క మూవీ అంచనాలకు తగినట్లే తొలి రోజు తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా నచ్చకపోతే తాను మొత్తానికే మూవీస్ వదిలేస్తానని కిరణ్ అబ్బవరం అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్పాడో ఈ సినిమాకు తొలి షో నుంచే వచ్చిన పాజిటివ్ రివ్యూలు చూస్తే అర్థమవుతోంది. సుజిత్, సందీప్ డైరెక్ట్ చేసిన క మూవీ ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆడియెన్స్ ముందుకు వచ్చింది.
క తొలి రోజు బాక్సాఫీస్ కలెక్షన్లు
మూవీ పేరే క (KA) అంటూ వచ్చి భిన్నమైన టైటిల్ తోనే కాదు భిన్నమైన స్టోరీతోనూ ఆకర్షిస్తోంది. కిరణ్ అబ్బవరం నటించిన ఈ సినిమా గురువారం (అక్టోబర్ 31) దీపావళి సందర్భంగా రిలీజైంది. తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.6.18 కోట్లు వసూలు చేయడం విశేషం.
అతని కెరీర్లోనే తొలి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఈ 'క' నిలిచింది. అంతేకాదు సినిమాకు వచ్చిన పాజిటివ్ రివ్యూల నేపథ్యంలో ఈ వీకెండ్ లోనే ఈ మూవీ బ్రేక్ఈవెన్ సాధిస్తుందని ట్రేడ్ ఎక్స్‌పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చి ప్రేక్షకులకు తగిన థ్రిల్ పంచుతోందీ సినిమా.
క మూవీ గురించి..
కిరణ్ అబ్బవరం అసలు క అనే టైటిల్ తో వస్తున్నాడంటేనే అసలు దానికి అర్థం ఏంటి? అతని పేరులోని తొలి అక్షరమా లేక అతని పేరు, ఇంటి పేరు ఇంగ్లిష్ అక్షరాల్లోని తొలి అక్షరాల కలయికా లేక ఇంకా ఏదైనా అర్థం ఉందా అన్న చర్చ మొదలైంది. దీనికి అర్థమేంటన్నది సినిమా చూస్తే క్లైమ్యాక్స్ లో తెలుస్తుందని కిరణ్ కూడా ఆ మధ్య చెప్పాడు.
ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ సందర్భంగా కూడా తనను ట్రోల్ చేయడంపై బాగా ఎమోషనల్ అయిన కిరణ్.. క మూవీ నచ్చకపోతే సినిమాలే వదిలేస్తానని సవాలు విసిరాడు. సుమారు ఏడాదిన్నర పాటు కష్టపడి ఈ సినిమా చేశానని, దీనిపై తనకు చాలా నమ్మకం ఉందని అతడు ఎందుకు అన్నాడో తొలి రోజే సినిమా చూసిన ప్రేక్షకులకు తెలిసి వచ్చింది.
ఈ 'క' మూవీలో అభినయ్ వాసుదేవ్ అనే ఓ అనాథ పాత్రలో కిరణ్ అబ్బవరం నటించాడు. తనకు ఎవరూ లేకపోవడంతో వేరే వాళ్లకు ఎవరో రాసిన ఉత్తరాలను చదివి సంతృప్తి చెందే ఓ వింత అలవాటు ఈ హీరోకి ఉంటుంది. అయితే ఆ అలవాటే అతని జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది?
తాను పోస్ట్‌మ్యాన్ గా పని చేస్తున్న కృష్ణగిరిలో అమ్మాయిలు కనిపించకుండా పోవడం వెనుక ఉన్న కారణం ఏంటి అన్నది ఈ సినిమాలో చూడొచ్చు. క్లైమ్యాక్స్ వరకూ అసలు విషయం రివీల్ చేయకుండా చివర్లో ప్రేక్షకులను థ్రిల్ చేసిన తీరు బాగా నచ్చింది. అటు కిరణ్ నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. దీంతో క మూవీ ఫస్ట్ వీకెండ్ మరిన్ని భారీ వసూళ్లు సాధించే అవకాశం కనిపిస్తోంది.
టాపిక్