Jyothi Rai: టాలీవుడ్ నాకు మెట్టినిల్లు - డైరెక్ట‌ర్‌తో పెళ్లిపై జ్యోతిరాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌-jyothi roy intresting comments on her marriage life at a masterpiece teaser launch event ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jyothi Rai: టాలీవుడ్ నాకు మెట్టినిల్లు - డైరెక్ట‌ర్‌తో పెళ్లిపై జ్యోతిరాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Jyothi Rai: టాలీవుడ్ నాకు మెట్టినిల్లు - డైరెక్ట‌ర్‌తో పెళ్లిపై జ్యోతిరాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jun 08, 2024 08:10 AM IST

Jyothi Rai: సూప‌ర్ హీరో క‌థాంశంతో తెర‌కెక్కుతోన్న ఓ మాస్ట‌ర్ పీస్ మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది జ్యోతిరాయ్‌. ఈ సినిమాకు జ్యోతిరాయ్ భ‌ర్త సుకు పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

జ్యోతిరాయ్
జ్యోతిరాయ్

Jyothi Rai: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఫేమ్ జ్యోతిరాయ్ (Jyothi Roy) హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోంది. ఏ మాస్ట‌ర్ పీస్ పేరుతో ఓ మూవీ చేస్తోంది. ఈ సినిమాకు జ్యోతిరాయ్ భ‌ర్త సుకు పూర్వ‌జ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ అంశాల‌తో కూడిన సూప‌ర్ హీరో మూవీగా ఏ మాస్ట‌ర్ పీస్ తెరకెక్కుతోంది. టీజ‌ర్‌లోని విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్ ఆక‌ట్టుకుంటున్నాయి.

డైరెక్ట‌ర్‌తో పెళ్లి...

ఏ మాస్ట‌ర్ పీస్‌తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌డంపై జ్యోతి రాయ్ ఆనందాన్ని వ్య‌క్తం చేసింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో త‌న‌ పర్సనల్ లైఫ్ ఒక టర్న్ తీసుకుంద‌ని, . డైరెక్ట‌ర్‌ సుకుతో త‌న పెళ్టి జ‌రిగింద‌ని టీజ‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో జ్యోతి రాయ్ అన్న‌ది. సుకుతో పెళ్లి త‌ర్వాత టాలీవుడ్ త‌న‌కు మెట్టినిల్లు అయిపోయింద‌ని చెప్పింది ఇక నుంచి మూవీస్ కంటిన్యూ చేస్తాన‌ని జ్యోతి రాయ్ పేర్కొన్న‌ది.

భాగ‌వతం స్ఫూర్తితో...

ఈ వేడుక‌లో దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ -"సూపర్ హీరో క్యారెక్టర్ కు భార‌తీయ‌ పురణాల నేపథ్యాన్ని జోడించి ఏ మాస్ట‌ర్ పీస్ సినిమా తీశా. భాగవతంలోని జయ విజయుల పాత్ర‌ల స్ఫూర్తితో హీరో, విలన్ క్యారెక్టర్స్ ను డిజైన్ చేశాం. మైథాలజీని, సైన్స్ ఫిక్షన్ ను కలిపేందుకు శివుడి పాత్రను వార‌ధిగా తీసుకున్నా. ఇది పురాణాల్లో ఉండదు. కల్పిత పాత్రగా రాసుకున్నా. అందుకే సినిమా పోస్టర్స్‌లో మిథ్స్ రీఇమాజిన్ డ్ అని రాశాం. చిన్న ప్రాజెక్ట్ గా ఏ మాస్టర్ పీస్ మూవీ మొదలైంది. ఇప్పుడు భారీ బ‌డ్జెట్ మూవీగా మారింది" అని తెలిపాడు.

“హాలీవుడ్ మూవీస్ కు పోస్ట్ ప్రొడక్షన్ చేసే మెర్జ్ ఎక్స్ ఆర్ టీమ్ ఈ సినిమాకు వీఎఫ్ఎక్స్ అందిస్తోంది. ఈ సినిమాలో 1500కు పైగా వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉంటాయి ఈ సూప‌ర్ హీరో మూవీలో నా వైఫ్ జ్యోతి పూర్వజ్ ఒక ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ప్రస్తుతం క్లైమాక్స్ మినహా షూటింగ్ పూర్తయింది. పది రోజుల పాటు క్లైమాక్స్ షూట్ చేయబోతున్నాం. ఫ‌స్ట్ పార్ట్ రిలీజ్ డేట్‌ను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తాం” అని సుకు పూర్వజ్ అన్నాడు.

డైరెక్ట‌ర్ నాకు గురువు...

హీరో అరవింద్ కృష్ణ మాట్లాడుతూ - “ఏ మాస్ట‌ర్ పీస్‌ సినిమా ఆఫర్ నాకు సుకు ఇచ్చే ముందే నాకు కొడుకు పుట్టాడు. నా కొడుకుకు నేను సూపర్ హీరోలా ఉండాలని అనుకున్నా. అదే టైమ్ లో సుకు ఈ మూవీ ఆఫర్ అందించాడు. నా కోస‌మే ఏ మాస్ట‌ర్ పీస్ మూవీని నా స్నేహితుడు మ‌నీష్‌ ప్రొడ్యూస్ చేశాడు. సుకు పూర్వజ్ నాకు గురూజీ లాంటి వాడు. నేను సినిమాలు వదిలేసిన టైమ్ లో నీలాంటి హీరో ఇండస్ట్రీలో ఉండాలి, సినిమాలు చేయాలని చెప్పి ఎంకరేజ్ చేశాడు” అని చెప్పాడు

జ్యోతిరాయ్‌కి అందుకే కోపం వ‌స్తుంది...

“ఆయన డైరెక్షన్ లో శుక్ర మూవీ చేశాను. సుకుకు రీసెంట్ గా మ్యారేజ్ అయ్యింది. అయితే ఆయన నాతో మూవీ డిస్కషన్స్ లో ఉన్న టైమే ఎక్కువ. ఈ విష‌యంలోనే జ్యోతికి ఎప్పుడు కోపం వ‌స్తుంది. కొద్ది రోజులు అయితే మీ ఆయనను మీకు ఇచ్చేస్తాం. ఏ మాస్ట‌ర్ పీస్ తెలుగు ఆడియెన్స్‌ గర్వంగా చెప్పుకునే సూపర్ హీరో మూవీ అవుతుంది”అని అరవింద్ కృష్ణ పేర్కొన్నాడు

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌తో...

ఏ మాస్ట‌ర్ పీస్‌కు ముందు శుక్ర మాట‌రాని మౌన‌మిది సినిమాలు చేశాడు సుకు పూర్వ‌జ్‌. ద‌ర్శ‌కుడిగా ఇది అత‌డికి మూడో మూవీ. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే సుకు పూర్వ‌జ్‌, జ్యోతి రాయ్ మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం పెళ్లికి దారితీసింది. సుకు పూర్వాజ్‌తో పెళ్లి త‌ర్వాత త‌న పేరును జ్యోతి పూర్వ‌జ్‌గా మార్చుకున్న‌ది జ్యోతిరాయ్‌. గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌లో జ‌గ‌తి పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది జ్యోతిరాయ్‌. ఇటీవ‌లే ఈ సీరియ‌ల్‌లో ఆమె క్యారెక్ట‌ర్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024