Murder Mystery OTT: గుప్పెడంత మనసు ఫేమ్ జ్యోతిరాయ్ ప్రధాన పాత్రలో నటించిన కన్నడ మూవీ నైట్ రోడ్ ఓటీటీలోకి రాబోతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కన ఈ కన్నడ మూవీకి గోపాల్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో జ్యోతిరాయ్‌తోపాటు ధర్మ, గిరిజా లోకేష్, రేణు శిఖారీ కీలక పాత్రల్లో నటించారు.
నైట్ రోడ్ మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నెలాఖరున లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్‌లో నైట్‌రోడ్ మూవీ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సమాచారం.
కర్మ సిద్ధాంతానికి మిస్టరీ అంశాలను జోడించి తెరకెక్కించిన నైట్ రోడ్ మూవీలో పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ షేడ్ రోల్‌లో జ్యోతిరాయ్ కనిపించింది. ఓ రోడ్ యాక్సిడెంట్ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడనే పాయింట్‌తో చివరి వరకు దర్శకుడు ఉత్కంఠభరితంగా ఈ మూవీని తెరకెక్కించాడు. సెప్టెంబర్ నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్నది. మంచి ఓపెనింగ్స్‌ను రాబట్టింది.
పోలీస్ ఆఫీసర్ దీక్ష (ధర్మ) తమ్ముడు కళ్యాణ్ (సాచి) ఓ డ్రగ్ అడిక్ట్. ఓ అమ్మాయిని శారీరకంగా హింసించిన కేసులో పోలీసులు అరెస్ట్ చేయడానికి రావడంతో పారిపోతాడు. రోడ్ యాక్సిడెంట్‌లో కళ్యాణ్ చనిపోతాడు. అతడిని వాహనం ఢీ కొట్టినట్లుగా ఎలాంటి ఆనవాళ్లు కనిపించవు.
అదే ప్లేస్‌లో అంతకుముందు కళ్యాణ్ స్నేహితుడు సూరప్ప కూడా చనిపోయినట్లుగా దీక్ష ఇన్వేస్టిగేషన్‌లో బయటపడుతుంది. ఈ రెండు హత్యలకు ఆ ప్లేస్‌కు ఉన్న సంబంధమేమిటి? నిజంగానే కళ్యాణ్ యాక్సిడెంట్‌లో చనిపోయాడా? అతడిని ఎవరైనా హత్యచేశారా? తమ్ముడి చావుకు కారణమైన వారిని దీక్ష ఎలా పట్టుకున్నాడన్నదే ఈ మూవీ కథ.
ప్రస్తుతం తెలుగులో జ్యోతిరాయ్ ఏ మాస్టర్ పీస్‌తో పాటు కిల్లర్ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలకు ఆమె భర్త సుకు పూర్వజ్ దర్శకత్వం వహిస్తోన్నాడు. కిల్లర్ మూవీలో జ్యోతిరాయ్ హీరోయిన్‌గా నటిస్తోంది.
గుప్పెడంత మనసు సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన జ్యోతిరాయ్. ఈ సీరియల్‌లో జగతిగా కొడుకు ప్రేమ కోసం తల్లడిల్లే తల్లి పాత్రలో అసమాన నటనను కనబరిచింది. ఇటీవలే గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది. ఇకపై సీరియల్స్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న జ్యోతిరాయ్ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతోంది.
మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్‌ను సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న జ్యోతిరాయ్ తన పేరును జ్యోతి పూర్వజ్‌గా మార్చుకుంది. కెరీర్‌లో ఇప్పటివరకు కన్నడ, తెలుగు భాషల్లో కలిపి 15కుపైగా సీరియల్స్ చేసింది జ్యోతిరాయ్.