Just a Minute Review: జస్ట్ ఏ మినిట్ రివ్యూ - ఏడు చేపల కథ హీరో బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?
Just a Minute Review: ఏడు చేపల కథ ఫేమ్ అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన జస్ట్ ఏ మినిట్ మూవీ శుక్రవారం థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీకి యశ్వంత్ దర్శకత్వం వహించాడు.
Just a Minute Review: ఏడు చేపల కథ ఫేమ్ అభిషేక్ పచ్చిపాల హీరోగా నటించిన జస్ట్ ఏ మినిట్ మూవీ ఇటీవల థియేటర్లలో రిలీజైంది. యశ్వంత్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో నజియా ఖాన్ హీరోయిన్‌గా నటించింది. ఈ బోల్డ్ మూవీ ఎలా ఉందంటే?
రవి అపోహలు...
రవి (అభిషేక్ పచ్చిపాల) సెక్స్‌కు సంబంధించి తనకు ఓ సమస్య ఉందనే అపోహతో భయపడుతుంటాడు. ఆ సమస్య నుంచి బయటపడడం కోసం స్నేహితుడైన రాంబాబు సహాయంతో తిక్కతిక్క పనులన్నీ చేస్తాడు.
కానీ అవన్నీ బెడిసికొడతాయి. అలాంటి టైమ్‌లోనే పూజ (నజియా ఖాన్) రవి జీవితంలోకి వస్తోంది. పూజను ప్రేమిస్తాడు రవి. కానీ తనకున్న సమస్య కారణంగా పూజ పట్ల మనసులో ఉన్న ప్రేమను ఆమెకు వ్యక్తం చేయలేక ఇబ్బందులు పడతాడు? ఇంతకీ రవికి ఉన్న ప్రాబ్లెమ్ ఏంటి? రవి సమస్యను పూజ అర్థం చేసుకుందా? అతడి ప్రేమకు ఓకే చెప్పిందా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
బోల్డ్ కాన్సెప్ట్...
సెక్స్ విషయంలో యువతలో ఎన్నో అపోహలు, అనుమానాలు, భయాలు ఉంటాయి వాటిని ఎవరికి చెప్పుకోలేక, తమలో తామే కుమిలిపోతూ ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. యువతలో ఉండే సందేహాలను జస్ట్ ఏ మినిట్ మూవీలో ఫన్నీగా చూపించాడు డైరెక్టర్ యశ్వంత్. ఇది బోల్డ్ మూవీ అని ట్రైలర్‌తోనే డైరెక్టర్ జస్ట్ ఏ మినట్‌పై క్లారిటీ ఇచ్చాడు. అందుకు తగ్గట్లుగానే సినిమా మొత్తం బోల్డ్, ఇంటిమేట్ సీన్స్, డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో సాగుతుంది.
స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫన్...
ఈ కాన్సెప్ట్‌ను సీరియస్‌గా చెప్పడం సాధ్యం కాదని, వినోదాత్మకంగానే చెప్పాలని ఫస్ట్ సీన్ నుంచే డైరెక్టర్ ఫిక్సయ్యాడు. తనకు సమస్య కారణంగా హీరోకు ఎదురయ్యే అవమానాలు, పరిష్కారం కోసం అతడు చేసే ప్రయత్నాల చుట్టూ ప్రథమార్థం సరదాగా సాగిపోతుంది.
ఈ కామెడీ ట్రాక్‌లు మొత్తం యూత్‌ను టార్గెట్ చేసి రాసినట్లుగా కనిపిస్తాయి. పూజ క్యారెక్టర్ ఎంట్రీ తర్వాత వినోదం డోస్ కాస్త తగ్గినట్లుగా అనిపిస్తుంది. పూజ, రవి లవ్ స్టోరీ కాస్త పద్దతిగానే డైరెక్టర్ చూపించాడు. హీరోయిన్‌కు తన ప్రాబ్లెమ్ చెప్పుకోలేక, ఆమెకు దూరం కాలేక హీరో తపన పడే సీన్స్ నుంచి ఎమోషన్స్, ఫన్ కలగలిపి చూపించారు.
హద్దులు దాటేశాడు...
బోల్డ్ సీన్స్, కామెడీ విషయంలో దర్శకుడు కొన్ని చోట్ల హద్దులు దాటినట్లుగా అనిపిస్తున్నాయి. ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇబ్బంది పెట్టేలా డైలాగ్స్, సీన్స్ ఉన్నాయి. మెయిన్ కాన్‌ఫ్లిక్ట్ చుట్టూ అల్లుకున్న కామెడీ ట్రాక్‌లలో కొన్ని నవ్వించలేకపోయాయి.
కామెడీ టైమింగ్...
రవి పాత్రలో అభిషేక్ పచ్చిపాల కామెడీ టైమింగ్ బాగుంది. పాత్రకు తగ్గట్లుగా నటనను కనబరిచాడు. హీరోయిన్ నజియాఖాన్ గ్లామర్‌తో మెప్పించింది. కానీ యాక్టింగ్‌లో తేలిపోయింది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్‌లో జబర్దస్త్ ఫణి , తండ్రి పాత్రలో సారిపల్లి సతీష్ కొన్ని సీన్స్‌లో నవ్వించారు.
ఫన్ ప్లస్ మెసేజ్
లైంగిక విజ్ఞానం విషయంలో యువతకు సందేశాన్ని ఇస్తూనే నవ్వించే సినిమా ఇది. సినిమాలోని డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఇంటిమేట్ సీన్స్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఇబ్బందిపెడతాయి.
రేటింగ్: 2.5/5