Jurassic World Rebirth Trailer: డైనోసార్స్ మళ్లీ వచ్చేస్తున్నాయి.. జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ట్రైలర్ ఎలా ఉందంటే?
Jurassic World Rebirth Trailer Dinosaurs In Telugu: జురాసిక్ ప్రపంచం అలరించేందుకు మరోసారి వచ్చేస్తోంది. 2022లో వచ్చిన జురాసిక్ డొమినియన్ మూవీకి సీక్వెల్‌గా తెరకెక్కిన జురాసిక్ వరల్డ్ రీ బర్త్ మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్. మరి జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం.
Jurassic World Rebirth Trailer Telugu: చిన్నా, పెద్దా అని తేడా లేకుండా ఆకట్టుకునే సినిమాలు కొన్నే ఉంటాయి. వాటిలో హాలీవుడ్ సినిమాల గురించి ఎక్కవగా తెలియని తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న సైన్స్ ఫిక్షన్ ఫాంటసీ సినిమా జురాసిక్ పార్క్. 1993లో వచ్చిన ఈ సినిమా అబ్బురపరిచి వరల్డ్ వైడ్‌గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.
దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్
వేల సంవత్సారల క్రితం అంతరించిపోయిన డైనోసార్స్ తిరిగి భూమ్మీదకు వస్తే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా వసూళ్ల ప్రభంజనం సృష్టించింది. అయితే, హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు స్పీల్ బర్గ్ తెరకెక్కిన జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో ఎన్నో సినిమాలు వచ్చిన ఆ రేంజ్‌లో ఆకట్టుకోలేదు. కానీ, సినిమాలు మాత్రం వస్తూనే ఉన్నాయి.
జురాసిక్ పార్క్ 7వ సినిమాగా
2022లో చివరిగా వచ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ మాత్రం మంచి ఫలితాలే సాధించింది. బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా వస్తున్న సినిమానే జురాసిక్ వరల్డ్ రీ బర్త్. జురాసిక్ పార్క్ ఫ్రాంచైజీలో 7వ సినిమాగా వస్తున్న జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ట్రైలర్‌ను ఇవాళ (ఫిబ్రవరి 6) మేకర్స్ రిలీజ్ చేశారు.
ప్రమాదకరమైన డైనోసార్స్
ఒక పరిశోధన నిమిత్తం ఒరిజినల్ జురాసిక్ పార్క్ ఉన్న ఐలాండ్‌కు ఓ రీసెర్చ్ బృందం వెళ్తుంది. అది అత్యంత ప్రమాదకరమైన మిషన్ అని తెలిసిన ఒకరి సహాయంతో అక్కడికి వారు వెళ్తారు. అయితే, అక్కడ మూడు డైనోసార్స్ డీఎన్‌ఏను వీళ్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, అక్కడ ఊహించని విధంగా ప్రమాదకరమైన డైనోసార్స్ కూడా ఉంటాయి. మరి ఆ డైనోసార్స్ నుంచి ఈ బృందం తప్పించుకుందా, లేదా అనేదే కథగా ట్రైలర్‌లో చూపించారు.
వింత జీవులు
అయితే, ఇదివరకు వచ్చిన సినిమా తరహాల్లోనే కథ ఉంది. ఒక మిషన్, దానికి సంబంధించి ఓడ, షిప్ వంటి వాటిని నడిపే వ్యక్తులను కలవడం, వారితో మాట్లాడే డైలాగ్స్ అన్ని ఎప్పటిలా రెగ్యులర్‌గానే ఉన్నాయి. ప్రమాదకరమైన డైనోసార్స్‌ను పూర్తిగా చూపించలేదు. ఇక సముద్రం మధ్యలో వచ్చి వింత జీవులు ఆకట్టుకునేలా ఉన్నాయి.
విశేషాలు
ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాకు మొదటి రెండు జురాసిక్ మూవీస్‌కు కథ అందించిన డేవిడ్ కోప్ స్టోరీ ఇచ్చారు. అలాగే, స్టార్ వార్స్ వంటి సినిమాలకు విజువల్స్ అందించిన గరేత్ ఎడ్వర్డ్స్ ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇక మార్వెల్ బ్యూటి బ్లాక్ విడో స్కార్లెట్ జాన్సన్ జురాసిక్ వరల్డ్ రీ బర్త్‌లో మెయిన్ లీడ్ రోల్ చేయడం విశేషం.
జురాసిక్ వరల్డ్ రీ బర్త్ రిలీజ్ డేట్
జూలై 2న జురాసిక్ వరల్డ్ రీ బర్త్ ఇంగ్లీష్‌తోపాటు తెలుగు ఇతర భాషల్లో కూడా రిలీజ్ కానుంది. జురాసిక్ వరల్డ్ రీ బర్త్ తెలుగు ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. మరి మరోసారి వస్తున్న ఈ డైనోసార్స్ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
సంబంధిత కథనం
టాపిక్