ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ సెన్సేషన్ గా మారారు జూనియర్ ఎన్టీఆర్. ఆ మూవీలో యాక్టింగ్ తో అదరగొట్టారు. గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. ఆ తర్వాత దేవరతో అలరించారు. తన కెరీర్ లో ఎన్టీఆర్ ఎన్నో బ్లాక్ బస్టర్లు అందించారు. కానీ ఆయన మిస్ చేసుకున్న కొన్ని సినిమాలు కూడా సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ సినిమాలను ఎన్టీఆర్ చేసి ఉంటే ఇప్పటికే మరో రేంజ్ కు వెళ్లేవారని చెప్పొచ్చు.
డేట్లు ఖాళీ లేకనో, కథ నచ్చకనో ఇతర కారణాలతోనో ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన మూవీస్ టాలీవుడ్ లో సంచలనంగా మారాయి. దిల్ నుంచి మొదలు పెడితే ఎవడు మూవీ వరకూ ఎన్టీఆర్ వదులుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రవితేజ హీరోగా వచ్చిన కిక్ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే.
అయితే ఫస్ట్ కిక్ స్టోరీ ఎన్టీఆర్ కే చెప్పారంటా. కానీ ఇందులో కామెడీ ఎక్కువగా ఉందని వద్దన్నారని తెలిసింది. అలాగే సుకుమార్-అల్లు అర్జున్ కాంబోలో వచ్చిన ఫస్ట్ మూవీ ఆర్య కూడా ఎన్టీఆర్ చేయాల్సిందే. కానీ ఆ టైమ్ కు లవ్ స్టోరీలపై ఎన్టీఆర్ కు ఇంట్రెస్ట్ పోయిందని టాక్.
ఎన్టీఆర్ అంటేనే మాస్ ఇమేజ్ గుర్తుకొస్తోంది. కానీ కొన్ని మాస్ సినిమాలను కూడా ఎన్టీఆర్ వదిలేసుకున్నారు. సూపర్ హిట్ అయిన ఆ మూవీస్ ఎన్టీఆర్ కు పడి ఉంటే ఓ లెవల్ మాస్ హీరో అయ్యేవారు. బోయపాటి శ్రీనివాస్ ఫస్ట్ మూవీ భద్రను ఎన్టీఆర్ తోనే చేయాలనుకున్నారు. కానీ అప్పుడు తారక్ డేట్స్ కుదరలేదు.
ఇక అన్న కల్యాణ్ రామ్ చేసిన అతనొక్కడే, రవితేజ కృష్ణ, నితిన్ దిల్, రామ్ చరణ్ ఎవడు సినిమాలు కూడా ఫస్ట్ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికే వచ్చాయని టాక్.
ప్రస్తుతం తారక్.. హృతిక్ రోషన్ తో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో ఈ వార్ 2 మూవీ రెడీ అవుతోంది. ఆ మూవీ తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్.. డ్రాగన్ మూవీ చేయబోతున్నారు. ఈ మూవీ కంప్లీట్ అయ్యాక నెల్సన్ దిలీప్ డైరెక్షన్ లో మూవీ కోసం తారక్ బరిలో దిగుతారు. మరోవైపు దేవర2పై కూడా బజ్ వినిపిస్తోంది. కానీ అది ఎప్పుడు స్టార్ట్ చేస్తారన్న దానిపై క్లారిటీ లేదు.
సంబంధిత కథనం