Narne Nithin Engagement: యంగ్ హీరో నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్.. అన్నీ తానై చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్-junior ntr arrives at narne nithin engagement ceremony with his wife and kids ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Narne Nithin Engagement: యంగ్ హీరో నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్.. అన్నీ తానై చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్

Narne Nithin Engagement: యంగ్ హీరో నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్.. అన్నీ తానై చూసుకున్న జూనియర్ ఎన్టీఆర్

Galeti Rajendra HT Telugu
Nov 03, 2024 08:39 PM IST

Junior NTR: దేవర పార్ట్-1 భారీగా వసూళ్లు రాబట్టడంతో హ్యాపీగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. పార్ట్-2 షూటింగ్ ముంగిట కొన్ని రోజులు బ్రేక్ తీసుకుని ఫ్యామిలీతో టైమ్ గడుపుతున్నాడు.

నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్‌ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ
నార్నే నితిన్ ఎంగేజ్‌మెంట్‌ వేడుకల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ

మ్యాడ్, ఆయ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన యంగ్ హీరో నార్నే నితిన్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. హైదరాబాద్‌లో ఆదివారం అట్టహాసంగా నార్నె నితిన్ నిశ్చితార్థ వేడుకలు జరగగా.. జూనియర్ ఎన్టీఆర్ అన్నీ తానై వేడుకలో సందడి చేశారు. నార్నే నితిన్ స్వయాన జూనియర్ ఎన్టీఆర్‌కి బావమరిది. ఎన్టీఆర్ భార్య ప్రణతి సోదరుడే ఈ నార్నే నితిన్.

హైదరాబాద్‌లో జరిగిన ఈ ఎంగేజ్‌మెంట్ పంక్షన్‌కి జూనియర్ ఎన్టీఆర్‌ ఫ్యామిలీతో పాటు కళ్యాణ్ రామ్‌ కూడా ఫ్యామిలీ‌తో వచి వధూవరులను ఆశీర్వదించారు. అలానే టాలీవుడ్‌లోని కొంత మంది ప్రముఖులు హాజరై నార్నె నితిన్‌ జంటకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

 

గత ఏడాది విడుదలైన మ్యాడ్ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల్ని మెప్పించింది. ఆ తర్వాత ఈ ఏడాది విడుదలైన ఆయ్ మూవీ ఫ్రెండ్‌షిప్‌కి కొత్త అర్థాన్ని చెబుతూ ప్రేక్షకుల మెప్పు పొందింది. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కొడుకైన నార్నే నితిన్.. జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా కాకుండా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Whats_app_banner