July OTT Release: జూలైలో ఓటీటీలోకి రానున్న ముఖ్యమైన సినిమాలు ఇవే.. ఎంతగానో ఎదురుచూస్తున్న వెబ్ సిరీస్ కూడా..
July OTT Movies, Web Series Release: జూలై నెలలో మరిన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు ఓటీటీల్లోకి వచ్చేస్తున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఏవో ఇక్కడ చూడండి.
ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో కంటెంట్ చూడాలనుకునే వారికి జూలైలోనూ చాలా కంటెంట్ అందుబాటులోకి రానుంది. చాలా సినిమాలు, వెబ్ సిరీస్‍లు స్ట్రీమింగ్‍గు అడుగుపెట్టనున్నాయి. ఎంతో మంది ఎదురుచూస్తున్న మీర్జాపూర్ మూడో సీజన్ కూడా ఇదే నెలలో వచ్చేస్తోంది. విజయ్ సేతుపతి మహరాజ చిత్రం కూడా అడుగుపెట్టనుంది. మరిన్ని కూడా రానున్నాయి. జూలైలో నెలలో ఓటీటీల్లోకి వచ్చే ముఖ్యమైన సినిమాలు, సిరీస్‍లు ఏవంటే..
మహారాజ
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి ప్రధాన పాత్ర పోషించిన మహారాజ చిత్రం బ్లాక్‍బస్టర్ అయింది. జూన్ 14న థియేటర్లలో విడుదలైన ఈ యాక్షన్ సస్పెన్స్ థ్రిల్లర్ రూ.100కోట్ల కలెక్షన్లకు సమీపించింది. తమిళంతో పాటు తెలుగులోనూ భారీ వసూళ్లను రాబట్టింది. మహారాజ చిత్రం జూలైలోనే నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. జూలై మూడో వారం ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు వస్తుందని తెలుస్తోంది. స్ట్రీమింగ్ డేట్‍పై నెట్‍ఫ్లిక్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మహారాజ మూవీకి నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు.
కకుడా
రితేశ్ దేశ్‍ముఖ్, సోనాక్షి సిన్హా, షాకిబ్ సలీమ్ మూవీలో ప్రధాన పాత్రలు పోషించిన ‘కకుడా’ సినిమా నేరుగా ఓటీటీలోకి వస్తోంది. ఈ హారర్ కామెడీ మూవీ జూలై 12వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఆదిత్య సర్పోర్ట్‌దార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మీర్జాపూర్ సీజన్ 3
ఎంతో మంది ఎదురుచూస్తున్న మీర్జాపూర్ మూడో సీజన్ జూలై 5వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. గత రెండు సీజన్లు సూపర్ సక్సెస్ అవగా.. మూడో సీజన్‍పై చాలా హైప్ ఉంది. ఈ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ మూడో సీజన్ జూలై 5న ప్రైమ్ వీడియోలో అడుగుపెట్టనుంది. పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, రసిక దుగల్, శ్వేత త్రిపాఠి శర్మ, విజయ్ వర్మ, ఇషా తల్వార్ మీర్జాపూర్ మూడో సీజన్‍లో ప్రధాన పాత్రలు పోషించారు.
మనమే
శర్వానంద్, కృతి శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ‘మనమే’ సినిమా జూన్ 7వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించిన ఈ మూవీ అంచనాలకు తగ్గట్టుగా కలెక్షన్లను దక్కించుకోలేకపోయింది. ఈ మూవీ జూలైలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఓటీటీ ప్లాట్‍ఫామ్‍పై మేకర్స్ నుంచి త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
శశిమథనం
శశిమథనం తెలుగు వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూలై 4వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. పవన్ సిద్ధు, సోనియా సింగ్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా సిరీస్‍కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు.
వైల్డ్ వైల్డ్ పంజాబ్
వైల్డ్ వైల్డ్ పంజాబ్ చిత్రం జూలై 10వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ కామెడీ డ్రామా మూవీలో వరుణ్ శర్మ, సన్నీ సింగ్, మనోజ్ సింగ్, జెస్సీ గిల్, పత్రలేఖ ప్రధాన పాత్రలు పోషించారు. సిమ్రన్‍ప్రీత్ దర్శకత్వం వహించారు.
మలయాళీ ఫ్రమ్ ఇండియా
మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీ మంచి హిట్ అయింది. ఈ సినిమా జూలై 5వ తేదీన సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. మే 1వ తేదీన ఈ పొలిటికల్ సెటైర్ కామెడీ డ్రామా మలయాళంలో థియేటర్లలో రిలీజ్ అయింది. మంచి వసూళ్లను దక్కించుకుంది. మలయాళీ ఫ్రమ్ ఇండియా మూవీలో నివిన్ పౌలీ, ధ్యాన్ శ్రీనివాసన్, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు పోషించారు.