Devara: ఎన్టీఆర్‍తో అతి భారి యాక్షన్ సీన్స్.. ఏకంగా 20 రోజులు.. దేవరలో ఇదే హైలెట్!-jr ntr underwater fight scenes for 20 days in devara movie ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara: ఎన్టీఆర్‍తో అతి భారి యాక్షన్ సీన్స్.. ఏకంగా 20 రోజులు.. దేవరలో ఇదే హైలెట్!

Devara: ఎన్టీఆర్‍తో అతి భారి యాక్షన్ సీన్స్.. ఏకంగా 20 రోజులు.. దేవరలో ఇదే హైలెట్!

Sanjiv Kumar HT Telugu
Sep 04, 2023 10:01 AM IST

Jr NTR Underwater Fight Scenes: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా చేస్తున్న సినిమా దేవర. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా అందులో యాక్షన్ సీక్వెన్స్ హై రేంజ్‍లో ప్లాన్ చేస్తున్నారట. దానికి సంబంధించిన ఓ క్రేజీ ఫైట్ సీన్ గురించి నెట్టింట్లో జోరుగా చర్చ సాగుతోంది.

దేవరలో భారి యాక్షన్ సీన్స్..
దేవరలో భారి యాక్షన్ సీన్స్..

నందమూరి కుటుంబం నుంచి బాలనటుడిగా, హీరోగా సినిమాల్లోకి అడుగు పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. నిన్ను చూడాలని సినిమాతో కథానాయకుడిగా పరిచయం అయిన తారక్ స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి సినిమాలతో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్నాడు. తనదైన యాక్షన్, డ్యాన్స్, డైలాగ్ డెలీవరీతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో గ్లోబల్ హీరోగా పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. దీంతో తారక్‍కు బాలీవుడ్, హాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది.

ప్లాప్ తర్వాత

ఎన్టీఆర్ చేస్తున్న తొలి బాలీవుడ్ మూవీ వార్ 2. గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ హీరోగా చేస్తున్న వార్ 2 సినిమాలో తారక్ విలన్‍గా నటిస్తున్నాడని సమాచారం. అయితే ఆర్ఆర్ఆర్ చిత్రం విజయం తర్వాత ఎన్టీఆర్‍పై నెక్ట్స్ సినిమాలపై విపరీతమైన బజ్, అంచనాలు పెరిగాయి. అందులోను ముఖ్యంగా తెలుగులో చేసే చిత్రాలపై మరింత ఆసక్తితో ఉన్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం తారక్ చేస్తున్న తెలుగు చిత్రం దేవర (Devara). ఆచార్య ప్లాప్ తర్వాత కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవరపై ఎప్పటికప్పుడు అప్డేట్స్, గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.

ఏకంగా 20 డేస్

అయితే తాజాగా దేవర సినిమా కొత్త షూటింగ్ షెడ్యూల్‍ను కొరటాల శివ స్టార్ట్ చేశారు. స్టార్టింగ్ నుంచి ఫైటింగ్ సీక్వెన్స్ పై ఫోకస్ పెట్టిన కొరటాల ఇప్పుడు కీలకంగా ఉండే మరో భారీ యాక్షన్ సీన్స్ మొదలు పెట్టారట. పూర్తిగా నీళ్లలో సాగే ఈ ఫైట్ సీక్వెన్స్ సినిమా మొత్తానికే హైలెట్‍గా నిలవనుందట. యాక్షన్ కొరియోగ్రాఫర్ కింగ్ సోలొమన్ వాటిని డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ అండర్ వాటర్ ఫైట్ సన్నివేశాలను ఏకంగా 20 రోజులపాటు తెరకెక్కించనున్నారని టాక్. అందుకోసం ఇప్పటికే నిపుణుల నుంచి మూడు రోజులపాటు శిక్షణ కూడా తీసుకున్నాడట తారక్.

నవంబర్ చివర్లో

ఎన్టీఆర్ శిక్షణ తర్వాత దేవర అండర్ వాటర్ సీక్వెన్స్ స్టార్ట్ చేస్తారని సమాచారం. ఇప్పటికే షిప్ ఫైట్ పూర్తి కాగా.. తాజాగా అండర్ వాటర్ సీన్స్ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉంటే దేవర సినిమాలో తారక్‍కు జోడీగా జాన్వీ కపూర్ నటించనుంది. సైఫ్ అలీ ఖాన్ పవర్‍ఫుల్ విలన్ రోల్ చేయనున్నాడు. నవంబర్ చివర్లో షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేయాలని కొరటాల ప్లాన్ చేస్తున్నారట. కాగా వార్ 2 తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోని NTR31 సినిమాకు తారక్ రెడీ కానున్నాడు.

టీ20 వరల్డ్ కప్ 2024