NTR New Photos viral: స్టైలిష్ లుక్‌లో ఎన్టీఆర్.. ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్
NTR New Photos viral: జూనియర్ ఎన్టీఆర్ తన లేటెస్ట్ ఫొటోషూట్‌లో అదరగొట్టారు. స్టైలిష్‌గా కనిపించడమే కాకుండా క్యూట్ లుక్‌లో ఆకర్షణీయంగా కనిపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
NTR New Photos viral: యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి మూవీ వస్తుందంటే చాలు ఫ్యాన్స్ ఎంతగానో ఆత్రుతగా చూస్తుంటారు. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ లాంటి భారీ హిట్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో ఆయన తన సినిమాలను తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా మాస్‌గా, రగెడ్ లుక్‍లో కనిపించే మన తారక్.. తాజా ఫొటోషూట్‌లో మాత్రం ఎంతో స్టైలిష్‌గా క్యూట్‌గా కనిపించారు.
ఆర్ఆర్ఆర్, దేవర తారక్ మాస్ లుక్‌లో కనిపించారు. త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రానున్న ఎన్టీఆర్ 31లోనూ రగెడ్‌లో కనిపిస్తారని తెలుస్తోంది. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ క్యూట్ లుక్‌లో దర్శనమిచ్చారు. తాజా ఫొటోషూట్‌లో ఆయన క్యూట్‌గా కనిపించారు. ఓ బ్రాండ్ ఎండోర్స్ మెంట్ కోసం ఈ విధంగా సాఫ్ట్ లుక్‌లో కనిపించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.
ఈ ఫొటోలను గమనిస్తే ఎన్టీఆర్ తన చిరునవ్వుతోనే ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేస్తున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్‌ను ఆకర్షించేలా తన లుక్‌ను మార్చుకున్నారు. ఇప్పటి వరకు గుబురు గడ్డం, రగ్గెడ్ లుక్‌తో మాస్ అప్పియరెన్స్ ఇచ్చిన తారక్.. ఈ ఫొటోల్లో మాత్రం స్టైలిష్‌గా, మ్యాన్లీగా కనిపించారు. ఇటీవల విడుదలైన దేవర లుక్‌లో వయెలెంట్‌గా కనిపించిన తారక్.. ఈ ఫొటోల్లో మాత్రం నాన్ వయెలెన్స్ లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు సైతం విశేషంగా స్పందిస్తున్నారు.
ప్రస్తుతం తారక్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర చిత్రంలో చేస్తున్నారు. ఎన్టీఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై సుధాకర్ మిక్కిలినేని, హరికృష్ణ కే నిర్మిస్తున్నారు. నందమూరి కల్యాణ్ రామ్ ఈ సినిమాకు సమర్పకులుగా వ్యవహిరంచారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్చున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందించనున్నారు. ఆర్ట్ డైరెక్టర్‌గా సాబు సిరిల్, రత్నవేలు ఛాయగ్రహణం, శ్రీకర ప్రసాద్ ఎడిటర్‌గా వ్యవహరించనున్నారు. త్వరలోనే రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.