Jr NTR: బావమరిది సినిమా సక్సెస్‍మీట్‍కు హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్!-jr ntr reportedly to may attend narne nithin aay movie success meet celebrations ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr: బావమరిది సినిమా సక్సెస్‍మీట్‍కు హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్!

Jr NTR: బావమరిది సినిమా సక్సెస్‍మీట్‍కు హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్!

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 16, 2024 02:17 PM IST

Jr NTR - Aay Movie: ఆయ్ సినిమాకు పాజిటివ్ టాక్‍తో దుమ్మురేపుతోంది. తక్కువ బడ్జెట్‍తో తీవ్రమైన పోటీ మధ్య వచ్చిన ఈ చిత్రం మంచి హిట్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది. తన బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన ఈ మూవీ సక్సెస్ మీట్‍కు జూనియర్ ఎన్టీఆర్ హాజరుకానున్నారని తెలుస్తోంది.

Jr NTR: బావమరిది సినిమా సక్సెస్‍మీట్‍కు హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్!
Jr NTR: బావమరిది సినిమా సక్సెస్‍మీట్‍కు హాజరుకానున్న జూనియర్ ఎన్టీఆర్!

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే దేవర మూవీ కోసం తన షూటింగ్‍ను పూర్తి చేసుకున్నారు. మణికట్టుకు స్వల్ప గాయం వల్ల ప్రస్తుతం కాస్త బ్రేక్ తీసుకుంటున్నారు. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న హైవోల్టేజ్ మాస్ యాక్షన్ మూవీ దేవర సెప్టెంబర్ 27వ తేదీన విడుదల కానుంది. కాగా, ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ హీరోగా నటించిన ఆయ్ సినిమా ఆగస్టు 15 నుంచే ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ చిత్రానికి ప్రీమియర్ల నుంచే పాజిటివ్ టాక్ రావటంతో ఫస్ట్ డే అయిన నేడు (ఆగస్టు 16) భారీగా టికెట్ల బుకింగ్స్ జరిగాయి. ఈ తక్కువ బడ్జెట్ సినిమా మంచి వసూళ్లను సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.

చీఫ్ గెస్ట్‌గా ఎన్టీఆర్

సక్సెస్ సెలెబ్రేషన్లను ఆయ్ మూవీ టీమ్ నిర్వహించనుంది. ఈ ఈవెంట్‍కు జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్టుగా రానున్నారని తెలుస్తోంది. ఈ ఈవెంట్ డేట్, టైమ్‍ను మూవీ టీమ్ త్వరలోనే ఖరారు చేయనుంది. త్వరలోనే ప్రకటన రానుంది. ముఖ్యఅతిథిగా ఎన్టీఆర్ వస్తారని కూడా ఈవెంట్ పోస్టర్లో వెల్లడించనున్నారని సమాచారం.

తొలిసారి బావమరిది గురించి..

నార్నే నితిన్ నటించిన తొలి మూవీ మ్యాడ్ మంచి హిట్ అయింది. అయితే, ఆ అప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్లకు ఎన్టీఆర్ రాలేకపోయారు. అలాగే, నితిన్ గురించి ఆయన ఎప్పుడు బయట మాట్లాడలేదు. దీంతో ఆయ్ సక్సెస్ సెలెబ్రేషన్లకు హాజరైతే తన బావమరిది నితిన్ గురించి ఎన్టీఆర్ తొలిసారి ఓ ఈవెంట్‍లో మాట్లాడినట్టువుతుంది.

ఆయ్ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍కే ఎన్టీఆర్ హాజరువుతారనే రూమర్లు గట్టిగానే వచ్చాయి. అయితే, దేవర షూటింగ్ తుదిదశలో ఉన్న తరుణంలో ఆయన రాలేకపోయారు. ఇప్పుడు దేవరకు తన షూటింగ్‍ను ఎన్టీఆర్ పూర్తి చేసుకున్నారు. చేతి గాయం వల్ల రెస్ట్ తీసుకుంటున్నారు. దీంతో ఆయ్ సక్సెస్ సెలెబ్రేషన్లకు ఆయన హాజరుకానున్నారని తెలుస్తోంది.

ఆయ్‍కు పాజిటివ్ రెస్పాన్స్

ఆయ్ సినిమాతో నార్నే నితిన్ సరసన నయన్ సారిక హీరోయిన్‍గా నటించారు. కసిరెడ్డి రాజ్‍కుమార్, అంకిత్ కొయ్య, వినోద్ కుమార్ కీలకపాత్రలు పోషించారు.ఈ చిత్రానికి కొత్త డైరెక్టర్ అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. గోదావరి విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది.

ఆయ్ సినిమాలో కామెడీ అదియిపోయిందనే టాక్ వచ్చింది. ఫ్రెండ్స్ మధ్య సరదా సన్నివేశాలు, కామెడీ, లవ్ ట్రాక్, గోదావరి అందాలను చూపించిన తీరు, విజువల్స్ ఇలా ఈ చిత్రంలోని అన్ని అంశాలపై పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా ప్రశంసలు దక్కించుకుంటోంది. దీంతో ఈ మూవీ మంచి కలెక్షన్లు దక్కించుకుంటుందనే అంచనాలు పెరిగిపోయాయి. ఆయ్ మూవీని జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, విద్య కొప్పినీడి ప్రొడ్యూజ్ చేయగా.. రామ్ మిర్యాల సంగీతం అందించారు. మిస్టర్ బచ్చన్, ఇస్మార్ట్ శంకర్ పోటీలో ఉన్నా ఆయ్ మూవీ పాజిటివ్ టాక్‍తో మంచి రన్ సాధించే అవకాశం ఉంది.  

ఇటీవలే జిమ్‍లో వర్కౌట్స్ చేస్తుండగా ఎన్టీఆర్ ఎడమ చేతి మణికట్టుకు స్వల్ప గాయమైందని, రెండు వారాల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని ఆయన టీమ్ వెల్లడించింది. బాలీవుడ్‍లో వార్ 2ను కూడా ఎన్టీఆర్ చేస్తుండగా.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో తదుపరి ఓ సినిమా చేయనున్నారు.