Devara Movie: దేవర రిలీజ్ డేట్ విషయంలో వారంలో క్లారిటీ వచ్చేస్తుందట!
Devara Movie Release Date: దేవర సినిమా రిలీజ్ విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇప్పటికే డేట్ ఖరారైనా.. మళ్లీ మారడం ఖాయమే టాక్ విపరీతంగా వస్తోంది.
Devara Movie: దేవర సినిమాపై హైప్ విపరీతంగా ఉంది. కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవలే ఓ సాంగ్ రాగా మోతెక్కిపోతోంది. అయితే, ఈ సినిమా రిలీజ్ విషయంలో మరోసారి సందిగ్ధత నెలకొంది. అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేస్తామని మూవీ యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే, విడుదల తేదీ మారుతోందంటూ టాక్ జోరుగా సాగుతోంది. ఆ వివరాలు ఇవే..
ఓజీ డేట్‍కు..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ నుంచి వాయిదా పడడం దాదాపు ఖాయమైంది. దీంతో దేవర రిలీజ్ డేట్‍ను ముందుకు తీసుకురావాలని మూవీ టీమ్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ 27న విడుదల చేయాలని దేవర మేకర్స్ షెడ్యూల్ చేసుకుంటున్నారని సినీ సర్కిల్‍లో జోరుగా ప్రచారం సాగుతోంది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన వెట్టైయాన్ చిత్రం అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుంది. దీంతో తెలుగులో కాకపోయినా తమిళం, కన్నడ బాక్సాఫీస్ వద్ద దేవరకు పోటీ ఉంటుంది. భారీ బడ్జెట్‍తో రూపొందించిన దేవర పాన్ ఇండియా టార్గెట్‍తో వస్తోంది. దీంతో వెట్టైయన్ నుంచి పోటీ లేకుండా సెప్టెంబర్ 27 అయితే బాగుంటుందని దేవర టీమ్ ఆలోచిస్తోందని తెలుస్తోంది.
వారంలో క్లారిటీ!
దేవర సినిమా రిలీజ్ డేట్ గురించి ఇప్పటికే దర్శక నిర్మాతల మధ్య చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. సెప్టెంబర్ 27 లోగా అన్ని పనులు పూర్తవుతాయా అనే విషయంపై ప్లానింగ్ చేసుకున్నారని తెలుస్తోంది. మరోవారం రోజుల్లోనే దేవర టీమ్ నుంచి రిలీజ్ డేట్‍పై అధికారిక ప్రకటన వస్తుందనే అంచనాలు సినీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి, దేవర మూవీ ముందు ప్రకటించినట్టు అక్టోబర్ 10న వస్తుందా.. లేకపోతే సెప్టెంబర్ 27కు మేకర్స్ తేదీని మారుస్తారా అనేది ఉత్కంఠగా మారింది.
త్వరలో రెండో సాంగ్
దేవర చిత్రం నుంచి గత నెల వచ్చిన ఫియర్ సాంగ్ సూపర్ సక్సెస్ అయింది. ఈ పాట మోతమోగుతోంది. అనిరుధ్ రవిచందర్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే రెండో పాట కూడా తీసుకొచ్చేందుకు మూవీ టీమ్ ప్లాన్ చేస్తోంది. ఈసారి మెలోడీ సాంగ్ వస్తుందని టాక్. దేవర షూటింగ్ ప్రస్తుతం గోవా పరిసరాల్లో సాగుతోంది. ఈ మూవీ షూటింగ్‍ను ఆగస్టులోగా పూర్తి చేయాలనే టార్గెట్‍ను పెట్టుకున్నట్టు తెలుస్తోంది.
దేవర మూవీని గ్రాండ్ స్కేల్‍లో యాక్షన్ థ్రిల్లర్‌గా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న మూవీ కావటంతో పాన్ ఇండియా రేంజ్‍లో ఫుల్ హైప్ ఉంది. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఈ సినిమాతోనే టాలీవుడ్‍లోకి జాన్వీ అడుగుపెడుతున్నారు. సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠే, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, అజయ్, షైన్ టామ్ చాకో, నరైన్ కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా దేవర చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
టాపిక్