Jr NTR Fan: జపాన్‌లో తెలుగు మాట్లాడిన మహిళా అభిమాని.. RRR చూశాక నేర్చుకున్నానంటూ.. వీడియో షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్-jr ntr japanese fan learnt telugu after watching rrr over devara release video shared by tarak with beautiful note ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr Fan: జపాన్‌లో తెలుగు మాట్లాడిన మహిళా అభిమాని.. Rrr చూశాక నేర్చుకున్నానంటూ.. వీడియో షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

Jr NTR Fan: జపాన్‌లో తెలుగు మాట్లాడిన మహిళా అభిమాని.. RRR చూశాక నేర్చుకున్నానంటూ.. వీడియో షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

Sanjiv Kumar HT Telugu

Jr NTR Fan Speaking Telugu In Japan Video Viral: జపాన్‌లో తెలుగులో మాట్లాడి ఆశ్చర్యపరిచింది జూనియర్ ఎన్టీఆర్ లేడి అభిమాని. దేవర సినిమాను జపాన్‌లో రిలీజ్ చేసిన సందర్భంగా ఫ్యాన్స్ అందరికి తారక్ అటోగ్రాఫ్ ఇచ్చాడు. ఈ క్రమంలో తనతో తెలుగులో మాట్లాడిన ఓ లేడి ఫ్యాన్ వీడియోను జూనియర్ ఎన్టీఆర్ షేర్ చేశాడు.

జపాన్‌లో తెలుగు మాట్లాడిన మహిళా అభిమాని.. RRR చూశాక నేర్చుకున్నానంటూ.. వీడియో షేర్ చేసిన జూనియర్ ఎన్టీఆర్

Jr NTR Fan Speaking Telugu In Japan Video Viral: ప్రస్తుతం మన తెలుగు సినిమా ఖ్యాతి, తెలుగు హీరోల స్థాయి ప్రపంచ దేశాలకు విస్తరించిన సంగతి తెలిసిందే. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన దేవర సినిమాను జపాన్‌లో భారీ ఎత్తున ప్రమోట్ చేశారు. ఆర్ఆర్ఆర్ తరువాత అక్కడ మ్యాన్ ఆఫ్ మాసెస్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిన విషయం తెలిసిందే.

తెలుగులో మాట్లాడిన జపనీస్ ఫ్యాన్

అందుకే అక్కడి అభిమానుల్ని అలరించేందుకు దేవరను జపాన్‌లో రిలీజ్ చేశారు. ఈ క్రమంలో అక్కడి మీడియా, అభిమానులతో ఎన్టీఆర్ ముచ్చటించారు. అనంతరం అక్కడున్న అభిమానులందరికి జూనియర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఓ లేడి అభిమాని జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వచ్చి తెలుగులో మాట్లాడారు.

దాంతో జపాన్‌లో తెలుగులో మాట్లాడటం ఏంటీ అని ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు తారక్. వెంటనే ఆ ఎమోషనల్ వీడియోని సోషల్ మీడియా వేదికగా జూనియర్ ఎన్టీఆర్ పంచుకున్నారు. ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత ఒక జపనీస్ అభిమాని తెలుగు నేర్చుకోవడం ప్రారంభించారట. ఆ అభిమాని గురించి చెబుతూ ఎన్టీఆర్ ఓ పోస్ట్ చేశారు.

అందమైన జ్ఞాపకాలే గుర్తుకొస్తాయి

సినిమా అనేది భాషా సరిహద్దుల్ని చెరిపేస్తుందని, అందరినీ ఏకం చేస్తుందని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అన్నట్టుగా ఎక్స్‌లో షేర్ చేసిన పోస్ట్‌లో జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్‌లో "నేను జపాన్‌కి వచ్చినప్పుడల్లా అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి. అయితే ఈ సారి మాత్రం కాస్త భిన్నమైన అనుభూతి కలిగింది" అని ఎన్టీఆర్ అన్నారు.

"ఒక జపనీస్ అభిమాని ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తాను తెలుగు నేర్చుకున్నానని చెప్పడం విని నిజంగా నన్ను కదిలించింది. సంస్కృతుల మధ్య వారధిగా ఉండటానికి సినిమా అనేది ఓ శక్తిలా ఉంటుందని చాటి చెప్పారు" అని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎక్స్‌లో రాసుకొచ్చారు.

ఎప్పటికీ మర్చిపోలేను

"సినిమా, భాషల ప్రేమికుడిగా ఒక అభిమానిని భాష నేర్చుకోవడానికి ఆ సినిమా ప్రోత్సహించింది అని చెప్పడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇలాంటి వాటి కోసమే మన ఇండియన్ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం" అని అభిమాని తెలుగులో మాట్లాడిన వీడియోను షేర్ చేశారు జూనియర్ ఎన్టీఆర్.

ఆ వీడియోలో "అన్నా.. అన్నా.. నేను ఆర్ఆర్ఆర్ చూసిన తర్వాత తెలుగు నేర్చుకున్నాను" అని ఆమె చెప్పారు. దాంతో జూనియర్ ఎన్టీఆర్ "వావ్.." అని ఆమెకు షేర్ హ్యాండ్ ఇచ్చారు. "నేను మీతో మాట్లాడాలి అని. నేను రెండు సంవత్సరాలుగా నేర్చకుంటున్నాను" అని చెప్పిన ఆమె తెలుగులో అక్షరాలు ఉన్న పుస్తకాన్ని చూపించింది. తర్వాత "మీరు చాలా మందికి గొప్ప ఇన్సిపిరేషన్" అని ఆమె తెలిపారు.

మీరే గొప్ప ఇన్సిపిరేషన్

దానికి ఆశ్చర్యపోయిన జూనియర్ ఎన్టీఆర్ "ఓ మై గాడ్. నిజానికి మీరే గొప్ప ఇన్సిపిరేషన్. థ్యాంక్యూ సో మచ్" అని ఆమె ఇచ్చిన బుక్‌పై తన అటోగ్రాఫ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక రీసెంట్‌గా దేవర సినిమాలోని ఆయుధ పూజ పాటకు ఓ పిల్లాడు స్టెప్పులేయగా.. అతనితోపాటు తారక్ కూడా డ్యాన్స్ చేసిన వీడియో కూడా తెగ ట్రెండ్ అయిన విషయం తెలిసిందే.

కొరటాల శివ దర్శకత్వం వహించిన దేవర సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సెప్టెంబర్ 27న గతేడాది విడుదలైంది. ఇందులో జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.