Teja On NTR Biopic : ఎన్టీఆర్ బయోపిక్​ను వెబ్ సిరీస్ చేయాలని ఉంది.. తారక్​ అయితే బెటర్-jr ntr is perfect for ntr biopic says director teja
Telugu News  /  Entertainment  /  Jr Ntr Is Perfect For Ntr Biopic Says Director Teja
దర్శకుడు తేజ
దర్శకుడు తేజ

Teja On NTR Biopic : ఎన్టీఆర్ బయోపిక్​ను వెబ్ సిరీస్ చేయాలని ఉంది.. తారక్​ అయితే బెటర్

26 May 2023, 11:33 ISTAnand Sai
26 May 2023, 11:33 IST

NTR Biopic : దర్శకుడు తేజ స్ట్రెయిట్ గా మాట్లాడుతారు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. ప్రేక్షకులకు ఎప్పుడూ గుర్తుంటాయి. తాజాగా ఆయన చేసిన కొన్ని కామెంట్స్ వైరల్ అయ్యాయి.

దర్శకుడు తేజ(Director Teja) తన అభిప్రాయాన్ని బహిరంగంగా వ్యక్తపరుస్తారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు తరచూ మీడియాలో సంచలనంగా మారుతూ ఉంటాయి. తేజ ప్రస్తుతం అహింస(ahimsa) ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. ప్రొడ్యూసర్ సురేష్ బాబు తనయుడు అభిరామ్ దగ్గుబాటి ఈ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు.

ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ బయోపిక్(NTR Biopic) గురించి తేజ మాట్లాడారు. లెజెండరీ నందమూరి తారక రామారావు బయోపిక్.. ఎన్టీఆర్ తేజ దర్శకత్వంలో రావాల్ససింది. ముహూర్తం షాట్ తర్వాత, తేజ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. బాలకృష్ణ(Balakrishna)తో విభేదాల కారణంగా తేజ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు పుకార్లు షికార్లు చేశాయి. కానీ తాను ఆ స్క్రిప్ట్ కు న్యాయం చేయలేనని, అందుకే తప్పుకొన్నానని తేజ చాలాసార్లు చెప్పారు.

అయితే తాజాగా మరోసారి ఎన్టీఆర్ బయోపిక్ గురించి మాట్లాడారు తేజ. ఎన్టీఆర్‌ లాంటి లెజెండ్‌ జీవితాన్ని హ్యాండిల్‌ చేసే సత్తా తనకు లేదని భావించానని అన్నారు. దాంతో స్వయంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టుగా వెల్లడించారు. ఎన్‌బీకేతో విభేదాల్లో వాస్తవం లేదని తేజ స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఎన్టీఆర్ బయోపిక్ కూడా చేస్తానని చెప్పారు. చేయాలనే ఆశ ఉందని వెల్లడించారు. ఇది వెబ్ సిరీస్‌గా ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని కూడా తేజ వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ పాత్రను కేవలం జూనియర్ ఎన్టీఆర్(NTR) మాత్రమే చేయగలడని వెల్లడించారు. అతను ఎన్టీఆర్ బయోపిక్ తీస్తే అది జూనియర్ ఎన్టీఆర్ తో మాత్రమే అవుతుందని క్లారీటీ ఇచ్చారు తేజ.

ఈ ఇంటర్వ్యూలో నటుడు ఉదయ్ కిరణ్ ఆత్మహత్య(Udai Kiran Suicide) గురించి కూడా ప్రస్తావన వచ్చింది. సమయం వచ్చినప్పుడు కచ్చితంగా ఉదయం కిరణ్ ఆత్మహత్యకు కారణాలు చెబుతానని చెప్పుకొచ్చాడు తేజ. అందరూ ఈ విషయంలో నటిస్తున్నారని, ప్రేక్షకులకు కూడా ఉదయ్ ఆత్మహత్య చేసుకునేందుకు కారణం ఏంటో తెలుసని అన్నారు. సమయం వచ్చినప్పుడు అందరినీ పిలిచి తప్పుకుండా ఈ విషయంపై క్లారిటీ ఇస్తానని స్పష్టం చేశారు తేజ.

తేజ దర్శకత్వంలో అభిరామ్, గీతిక జంటగా నటించిన అహింసలో సదా కీలక పాత్రలో కనిపించనుంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆర్పీ పట్నాయక్ సంగీతం అందించారు. జూన్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

టాపిక్