Devara Ticket Bookings: దేవర క్రేజ్.. అక్కడ నిమిషాల్లోనే ఆ షో టికెట్లు ఖతం-jr ntr devara movie telugu version 4am shows tickets booked full in minutes in bengaluru ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Ticket Bookings: దేవర క్రేజ్.. అక్కడ నిమిషాల్లోనే ఆ షో టికెట్లు ఖతం

Devara Ticket Bookings: దేవర క్రేజ్.. అక్కడ నిమిషాల్లోనే ఆ షో టికెట్లు ఖతం

Chatakonda Krishna Prakash HT Telugu
Sep 22, 2024 04:54 PM IST

Devara Ticket Bookings: దేవర సినిమాకు క్రేజ్ ఫుల్ రేంజ్‍లో ఉంది. కొన్ని చోట్ల టికెట్ల బుకింగ్స్ షురూ అవుతున్నాయి. బెంగళూరులో తాజాగా ఓపెన్ అయ్యాయి. అక్కడ బుకింగ్‍ల్లో దేవర జోరు చూపిస్తోంది. కర్ణాటకలోనూ మంచి ఓపెనింగ్ ఖాయంగా కనిపిస్తోంది.

Devara Ticket Bookings: దేవర క్రేజ్.. అక్కడ నిమిషాల్లోనే ఆ షో టికెట్లు ఖతం
Devara Ticket Bookings: దేవర క్రేజ్.. అక్కడ నిమిషాల్లోనే ఆ షో టికెట్లు ఖతం

మ్యాన్ ఆఫ్ మాసెస్ హీరోగా నటించిన దేవర సినిమాకు హైప్ ఓ రేంజ్‍లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా పాన్ ఇండియా రేంజ్‍లో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఓవర్సీస్‍‍లో అడ్వాన్స్ బుకింగ్‍ల్లో కొన్ని చోట్ల ఈ మూవీ రికార్డులు క్రియేట్ చేసింది. ఈ శుక్రవారమే సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. దేవర సినిమా టికెట్ల బుకింగ్ కర్ణాటకలోని బెంగళూరులో నేడు (సెప్టెంబర్ 26) షూరు అయింది. క్రేజ్ స్పష్టంగా కనిపించింది.

ఆ షో టికెట్లు.. నిమిషాల్లోనే

బెంగళూరు సిటీలో దేవర తెలుగు వెర్షన్ టికెట్లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. సెప్టెంబర్ 27న తెల్లవారుజామున 4 గంటల షోకు చాలా థియేటర్లలో టికెట్లు నిమిషాల్లోనే బుక్ అయిపోయాయి. నేడు బుకింగ్స్ మొదలైన కాసేపటికే 4 గంటల షోకు టికెట్స్ సోల్డౌట్ అయ్యాయి. ఆ తర్వాతి షోలకు బుకింగ్స్ వేగంగా జరుగుతున్నాయి.

కర్ణాటకలోనూ దేవర భారీ స్థాయిలోనే రిలీజ్ అవుతోంది. తెలుగు వెర్షన్‍తో పాటు కన్నడ వెర్షన్‍కు కూడా మంచి క్రేజ్ కనిపిస్తోంది. ముఖ్యంగా బెంగళూరులో ఈ చిత్రానికి అంచనాలకు మించి ఓపెనింగ్ దక్కడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్.. కర్ణాటకలోని దేవాలయాలను సందర్శించారు. కన్నడ స్టార్ యశ్‍తో కలిసి వెళ్లారు. కన్నడలోనూ ఎన్టీఆర్ ధారాళంగా మాట్లాడారు. కన్నడ జనాలకు మరింత చేరువయ్యారు. ఎన్టీఆర్ తల్లి షాలినీ సొంత ఊరు కర్ణాటకలోని కుందాపుర. అందుకే ఎన్టీఆర్‌కు కన్నడ బాగా అలవాటైంది. దేవర మూవీ కర్ణాటకలోనూ భారీ వసూళ్లు దక్కించుకుంటుందనే అంచనాలు ఉన్నాయి. దేవర తర్వాత కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తోనే ఎన్టీఆర్ మూవీ చేయనున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు!

దేవర సినిమా టికెట్ల బుకింగ్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎప్పుడు మొదలవుతాయా అని ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. టికెట్ల ధరల పెంపు, అదనపు షోలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే దేవర టీమ్‍కు గ్రీన్‍సిగ్నల్ ఇచ్చింది. జీవో జారీ చేసింది. దీంతో ఏపీలో సోమవారమే టికెట్ల బుకింగ్స్ షురూ అవుతాయని తెలుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి సోమవారం అనుమతులు వస్తాయని అంచనాలు ఉన్నాయి. దీంతో అక్కడ మంగళవారం టికెట్లు అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

దేవర చిత్రం నుంచి నేడు (సెప్టెంబర్ 22) రెండో ట్రైలర్ కూడా వచ్చింది. దీనికి కూడా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. మూవీపై అంచనాలు పెరుగుతూనే ఉన్నాయి. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో హైవోల్టేజ్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ కొరటాల శివ. ఎన్టీఆర్ డ్యుయల్ రోల్‍లో యాక్షన్‍తో దుమ్మురేపేశారు. ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్స్ ఆశ్చపరిచేలా అద్భుతంగా ఉంటాయని ఎన్టీఆర్ ప్రమోషన్లలో చెబుతున్నారు.

దేవర మూవీలో సైఫ్ అలీ ఖాన్, షైన్ టామ్ చాకో, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, శృతి మరాఠే కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‍తో నిర్మించాయి. నేడు (సెప్టెంబర్ 22) దేవర ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‍లో జరగనుంది.