Jr NTR: ఆవిడ మాట్లాడుతుంటే నాన్న గారు లేని లోటు తీరినట్లయింది.. హీరోలకు సమానంగా నిల్చున్న ఏకైక మహిళ: జూనియర్ ఎన్టీఆర్-jr ntr comments in arjun son of vyjayanthi trailer launch event says vijayashanthi full filled his father dis appearance ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jr Ntr: ఆవిడ మాట్లాడుతుంటే నాన్న గారు లేని లోటు తీరినట్లయింది.. హీరోలకు సమానంగా నిల్చున్న ఏకైక మహిళ: జూనియర్ ఎన్టీఆర్

Jr NTR: ఆవిడ మాట్లాడుతుంటే నాన్న గారు లేని లోటు తీరినట్లయింది.. హీరోలకు సమానంగా నిల్చున్న ఏకైక మహిళ: జూనియర్ ఎన్టీఆర్

Sanjiv Kumar HT Telugu

Jr NTR Comments In Arjun Son Of Vyjayanthi Trailer Launch Event: జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా నందమూరి కల్యాణ్ రామ్ అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ట్రైలర్ లాంచ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ ఈవెంట్‌లో విజయశాంతి గురించి, సినిమా గురించి జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

ఆవిడ మాట్లాడుతుంటే నాన్న గారు లేని లోటు తీరినట్లయింది.. హీరోలకు సమానంగా నిల్చున్న ఏకైక మహిళ: జూనియర్ ఎన్టీఆర్

Jr NTR Comments In Arjun Son Of Vyjayanthi Trailer Launch Event: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన వేడుక అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ట్రైలర్ లాంచ్ అండ్ మ్యాసీవ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.

అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా సీనియర్ హీరోయిన్ విజయశాంతి ముఖ్య పాత్రలో నటించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీ ఏప్రిల్ 18న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 12న నిర్వహించిన అర్జున్ సన్నాఫ్ వైజయంతి ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ స్పీచ్

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బృందానికి అందరికీ కూడా నా నమస్కారాలు" అని తన స్పీచ్ మొదలుపెట్టాడు.

ఆ లోటు నాకు భర్తీ అయిపోయింది

"ఈ వేదిక పైన నేను, అన్న నిలుచున్నప్పుడు నాన్నగారు (నందమూరి హరికృష్ణ) చాలా సార్లు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈరోజు నాన్నగారు లేని లోటు తీరినట్లు అయింది విజయశాంతి గారు మాట్లాడుతుంటే. ఈవెంట్‌లో నాన్నగారు ఉంటే ఎలా ఉండేదో విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే ఆ లోటు నాకు భర్తీ అయిపోయింది" అని జూనియర్ ఎన్టీఆర్ తెలిపాడు.

వైవిధ్యమైనటువంటి పాత్రలు చేశారు

"చాలామంది గొప్ప సినిమాలు చేసి అద్భుతంగా అలరించారు. కానీ, విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు. కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు ఇలా ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేశారు. నాకు తెలిసి భారత దేశంలో ఏ నటి విజయశాంతి గారి లాంటి వైవిధ్యమైనటువంటి పాత్రలు చేయలేదు. ఆ ఘనత ఆవిడ ఒక్కరికే దక్కింది" అని చెప్పాడు తారక్.

కొడుకు పుడితే ఎలా ఉంటుందనే ఆలోచన

"భారతదేశ చలనచిత్ర పటంలో హీరోలకి సమానంగా నిలుచున్న ఏకైక మహిళ విజయశాంతి గారే. ఈ చిత్రం ఆలోచన కూడా కర్తవ్యంలో ఉన్న పాత్రకు ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఆలోచన నుంచే మొదలయింటుందని భావిస్తున్నాను. ఈ వేడుకకు రావడం అభిమానులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది" అని జూనియర్ ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.

విజయశాంతి లేకపోతే ఈ సినిమా లేదు

"ఈ సినిమా నేను చూశాను. విజయశాంతి గారు లేకపోతే ఈ సినిమా లేదు. పృథ్వి గారు లేకపోతే, సోహెల్ లేకపోతే ఈ సినిమా లేదు. ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్ కాకపోతే ఈ సినిమా లేదు. సునీల్ గారు, అశోక్ గారు ప్రొడ్యూసర్స్ లేకపోతే ఈ సినిమా లేదు. ఒక్కొక్కళ్లు తమ ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేశారు. సినిమా చుసిన నాకు తెలుసు ఈ సినిమాని వాళ్లు ఎంత నమ్మారో" అని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పేర్కొన్నాడు.

Sanjiv Kumar

TwittereMail
సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం