టాలీవుడ్‌లో హ్యాట్రిక్ హిట్స్‌తో అదరగొట్టాడు ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్. అతడు హీరోగా నటించిన మ్యాడ్, ఆయ్‌తో పాటు మ్యాడ్ స్క్వేర్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టాయి. మ్యాడ్ స్క్వేర్ బ్లాక్‌బస్టర్ తర్వాత ఓ విలేజ్ లవ్‌స్టోరీతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాడు నార్నే నితిన్. అతడు హీరోగా నటించిన శ్రీ శ్రీ శ్రీ రాజావారు మూవీ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న ఈ మూవీకి దర్శకత్వం వహిస్తున్నాడు.
శ్రీ శ్రీ శ్రీ రాజావారు ట్రైలర్‌ను శనివారం మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్, లవ్ అంశాలతో ఈ ట్రైలర్ సాగింది. ప్రేమించడం ఎలెక్షన్‌లో నిలబడటం లాంటిది...గెలవడం అంత ఈజీ కాదని రావురమేష్ డైలాగ్‌తోనే ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఓ యువకుడి ప్రేమకు సిగరెట్ వ్యసనం ఎలా అడ్డంకిగా మారిందన్నది ఈ ట్రైలర్‌లో చూపించారు. మనిషి గెలవడం అంటే ఏంటో తెలుసా...తనను తాను గెలవడం అంటూ సీనియర్ నరేష్ చెప్పిన డైలాగ్ ట్రైలర్‌లో ఆకట్టుకుంటోంది. గత సినిమాలకు భిన్నంగా మాస్ రోల్‌లో నార్నే నితిన్ ఈ మూవీలో కనిపించబోతున్నట్లు ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది.
శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీలో నార్నే నితిన్‌కు జోడీగా సంపద హీరోయిన్‌గా నటిస్తోంది. రావు రమేష్, నరేష్, రఘు కుంచె, ప్రవీణ్ కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీకి కైలాష్ మీనన్ మ్యూజిక్ అందించాడు.
ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సతీష్ వేగేశ్న మాట్లాడుతూ “మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అన్నదే శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీ కాన్సెప్ట్. నార్నే నితిన్ పక్కింటి కుర్రాడిలా మొదలుపెట్టి, యాక్షన్ పరంగా ఆకట్టుకుంటూ అద్భుతంగా పర్ ఫార్మ్ చేశాడు. మరుగున పడిన సంప్రదాయాలు, అనుబంధాలను నా ప్రతి సినిమాలో చూపిస్తుంటాడు. ఇందులోనూ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయి. శ్రీశ్రీశ్రీ రాజావారు ఆడియెన్స్‌ను నిరాశపర్చదు” అన్నారు.
*నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ"విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది.పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో అగ్ర నటీనటులీతో ఈ సినిమాను రూపొందించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. జూనియర్ ఎన్టీఆర్ మెచ్చిన కథ ఇది. ఆయనే స్వయంగా నార్నే నితిన్ కోసం ఈ మూవీని ఎంపిక చేశారు. మ్యాడ్ స్క్వేర్ తర్వాత నార్నే నితిన్ ఖాతాలో మరో సూపర్ హిట్ హిట్ సినిమా శ్రీశ్రీశ్రీ రాజావారు నిలుస్తుందనే నమ్మకముంది" అని తెలిపారు.
సంబంధిత కథనం
టాపిక్