ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా బాలీవుడ్ మూవీ వార్ 2 నుంచి అదిరిపోయే సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ స్పై యాక్షన్ మూవీ నుంచి స్పెషల్ అప్‌డేట్ ఉంటుందని మేకర్స్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూశారు. టీజర్ రిలీజ్ చేసి అభిమానులను ఆనందాన్ని మేకర్స్ రెట్టింపు చేశారు.
ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో వార్ 2 టీజర్ రిలీజైంది. కంప్లీట్‌గా యాక్షన్ అంశాలతో ఈ టీజర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. రిలీజైన కొద్ది నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తోనే టీజర్ ప్రారంభమైంది. నా కళ్లు ఎప్పటినుంచో నిన్ను వెంటాడుతూనే ఉన్నాయి కబీర్. ఇండియాస్ బెస్ట్ సోల్జర్. రాలో బెస్ట్ ఏజెంట్....నువ్వే...కానీ ఇప్పుడు కాదు. నీకు నా గురించి తెలియదు. ఇప్పుడు తెలుసుకుంటావు...గెట్ రెడీ ఫర్ వార్ అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్‌తో ఈ టీజర్ ప్రారంభమైంది. ఆ డైలాగ్‌తోనే స్టైలిష్‌గా టీజర్‌లోకి ఎంట్రీ ఇచ్చారు ఎన్టీఆర్.
హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్, ఛేజింగ్ సీక్వెన్స్‌లతో హాలీవుడ్ మూవీస్‌ను తలదన్నేలా టీజర్ సాగింది. టీజర్‌లో హృతిక్‌కు ధీటుగా ఎన్టీఆర్ క్యారెక్టర్ కనిపించింది. ముఖ్యంగా మంచు కొండల్లో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య సాగిన ఫైట్ టీజర్‌కు హైలైట్‌గా నిలిచింది. టీజర్ బికినీలో కియారా అద్వానీ గ్లామర్ మెరుపులతో ఆకట్టుకుంటుంది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ స్పై యాక్షన్ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. ఈ మూవీలో ఎన్టీఆర్ క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌లో సాగనున్నట్లు టీజర్ చూస్తుంటే తెలుస్తోంది. యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోన్న వార్ 2 షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఆగస్టు 14న పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. 2019లో రిలీజైన వార్ మూవీకి సీక్వెల్‌గా వార్ 2 తెరకెక్కుతోంది.
వార్ 2తో పాటు ప్రస్తుతం ప్రశాంత్ నీల్‌తో ఓ యాక్షన్ మూవీ చేస్తోన్నాడు ఎన్టీఆర్. ప్రశాంత్ నీల్ మూవీ నుంచి కూడా ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా స్పెషల్ అప్‌డేట్ ఉండొచ్చని ప్రచారం జరిగింది. కానీ వార్ 2 టీజర్ రిలీజ్ కానుండటంతో అప్‌డేట్‌ను వాయిదావేశారు. ఇటీవలే ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్‌లో ఎన్టీఆర్ భాగమయ్యారు. ఓ లాంగ్ షెడ్యూల్‌ను షూట్ చేశారు. ప్రశాంత్ నీల్ మూవీ తర్వాత దేవర 2 షూటింగ్‌ను ఎన్టీఆర్ మొదలుపెట్టనున్నారు.