ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులకు రెండు సర్‌ప్రైజ్‍లు పక్కా!-jr ntr birthday updates glimpse from prashanth neel directorial and war 2 movies to release ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులకు రెండు సర్‌ప్రైజ్‍లు పక్కా!

ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులకు రెండు సర్‌ప్రైజ్‍లు పక్కా!

జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులకు ఫుల్ ట్రీట్ ఉండనుంది. రెండు సర్‌ప్రైజ్‍లు వచ్చేయనున్నాయి. వీటి కోసం అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

ఎన్టీఆర్ పుట్టిన రోజున అభిమానులకు రెండు సర్‌ప్రైజ్‍లు పక్కా!

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్‍తో ఓ భారీ యాక్షన్ చిత్రం చేస్తున్నారు. దీనికి హైప్ విపరీతంగా ఉంది. హృతిక్ రోషన్‍‌తో కలిసి ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సినిమాతోనే బాలీవుడ్‍లోకి డైరెక్ట్ ఎంట్రీ ఇస్తున్నారు తారక్. ఈ చిత్రాల నుంచి అప్‍డేట్ల కోసం అభిమానులు ఎంతో ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఎన్టీఆర్ పుట్టిన రోజున (మే 20) ఫ్యాన్స్‌కు డబుల్ ట్రీట్ రానుంది.

ఎన్టీఆర్, నీల్ మూవీ నుంచి..

ప్రశాంత్ నీల్‍తో చేస్తున్న సినిమా నుంచి ఎన్టీఆర్ పుట్టిన రోజైన మే 20న గ్లింప్స్ రానుంది. ఇప్పటికే ఇది ఖరారైంది. టైటిల్‍తో ఈ గ్లింప్స్ ఉండొచ్చు. ఈ మూవీకి డ్రాగన్ టైటిల్ ఫిక్స్ అయిందని చాలా కాలంగా రూమర్లు ఉన్నాయి. ఎన్టీఆర్ చాలా సన్నపడటంతో ఈ మూవీలో లుక్ ఎలా ఉంటుందనే ఆసక్తి కూడా చాలా ఉంది. ఈ గ్లింప్స్‌తో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉంటుందో తెలిసిపోనుంది.

వార్ 2 స్పెషల్ గ్లింప్స్!

ఎన్టీఆర్ పుట్టిన రోజున వార్ 2 చిత్రం నుంచి కూడా ఓ గ్లింప్స్ వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ స్పై యాక్షన్ మూవీని యశ్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాతో హృతిక్‍తో కలిసి లీడ్ రోల్ చేశారు ఎన్టీఆర్. ఈ మూవీ నుంచి మే 20న ఎన్టీఆర్ స్పెషల్ గ్లింప్స్ అడుగుపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో ఈ సినిమా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఏంటని కాస్త క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది.

అభిమానుల నిరీక్షణ

ఎగ్జైటింగ్ అప్‍డేట్లు వచ్చే ఛాన్స్ ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజైన మే 20వ తేదీ కోసం చాలా ఎదురుచూస్తున్నారు. రెండు భారీ చిత్రాల నుంచి రానున్న అప్‍డేట్లు ఫ్యాన్స్‌కు సంబరాన్ని తీసుకురానున్నాయి. ఆరోజు సోషల్ మీడియో మోతెక్కిపోవచ్చు.

ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. కర్ణాటకలో చిత్రీకరణ జరుగుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ సెట్‍లో జాయిన్ అయ్యారు ఎన్టీఆర్. ఈ సినిమాను వచ్చే ఏడాది 2026 జూన్ 25న విడుదల చేస్తామని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా భారీ బడ్జెట్‍తో హైవోల్టేజ్ యాక్షన్ మూవీగా ఉండనుంది.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం