యంగ్ టైగ‌ర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. జూనియ‌ర్ ఎన్టీఆర్ టాప్‌-5 ఫిల్మ్స్‌..కోట్లు కొల్ల‌గొట్టిన సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే?-jr ntr birth day special his top 5 highest grossing movies check this films in these otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  యంగ్ టైగ‌ర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. జూనియ‌ర్ ఎన్టీఆర్ టాప్‌-5 ఫిల్మ్స్‌..కోట్లు కొల్ల‌గొట్టిన సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

యంగ్ టైగ‌ర్ బ‌ర్త్‌డే స్పెష‌ల్.. జూనియ‌ర్ ఎన్టీఆర్ టాప్‌-5 ఫిల్మ్స్‌..కోట్లు కొల్ల‌గొట్టిన సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే?

వర్సటైల్ యాక్టింగ్ తో క్రమంగా గ్లోబల్ స్టార్ రేంజ్ కు ఎదిగారు జూనియర్ ఎన్టీఆర్. ఈ రోజే (మే 20) ఆయన పుట్టిన రోజు. బ‌ర్త్‌డే స్పెష‌ల్ గా తారక్ యాక్ట్ చేసిన టాప్-5 హైయ్యస్ట్ గ్రాసింగ్ మూవీస్ ఏవీ? అవి ఏ ఓటీటీలో ఉన్నాయో? ఓ లుక్కేయండి.

జూనియర్ ఎన్టీఆర్ (instagram-Jr NTR)

తాత ఘన వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని.. బాల నటుడిగానే తెరంగేట్రం చేశారు జూనియర్ ఎన్టీఆర్. తాతకు తగ్గ మనవడిగా యాక్టింగ్ తో అదరగొడుతున్నారు. ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా డెబ్యూ చేసిన జూనియర్ నందమూరి తారక రామారావు అంచెలంచెలుగా ఎదిగారు.

బాక్సాఫీస్ ను శాసించే స్థాయికి చేరారు జూనియర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీతో గ్లోబల్ రేంజ్ కు చేరారు. మంగళవారం (మే 20) ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తారక్ టాప్-5 మూవీస్ ఏంటో చూసేయండి.

ఆర్ఆర్ఆర్

రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’ మూవీ గ్లోబల్ సెన్సేషన్ గా మారింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే హైయ్యస్ట్ కలెక్షన్లు రాబట్టిన మూవీగా ఆర్ఆర్ఆర్ నిలిచింది. ఈ మూవీలో ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమ్ అవుతోంది.

దేవర పార్ట్ 1

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత తారక్ చేసిన మూవీ ‘దేవర పార్ట్1’. భారీ అంచనాల మధ్య థియేటర్లకు వచ్చిన ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. చివరకు బాక్సాఫీస్ దగ్గర సుమారు రూ.500 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఉంది.

అరవింద సమేత వీర రాఘవ

రాయలసీమ ఫ్యాక్షన్ బ్రాక్ డ్రాప్ లో, శాంతిని కోరుకునే హీరో క్యారెక్టర్ లో తారక్ ఒదిగిపోయిన మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ’. 2018లో త్రివిక్రమ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.179.6 కోట్ల వసూళ్లతో సత్తాచాటింది. జీ5 ఓటీటీలో ఈ మూవీ చూడొచ్చు.

జనతా గ్యారేజీ

ఫ్యామిలీ ఎమోషన్స్, సోషల్ రెస్పాన్సిబిలీటీతో వచ్చిన 2016లో వచ్చిన ‘జనతా గ్యారేజీ’ కూడా బాక్సాఫీస్ దగ్గర సత్తాచాటింది. మోహన్ లాల్, తారక్ కాంబినేషన్ వర్కౌట్ అయింది. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.135 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. జియో హాట్ స్టార్ లో ఈ సినిమా అందుబాటులో ఉంది.

జై లవకుశ

జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ సత్తాకు నిలువెత్తు నిదర్శనం ‘జై లవకుశ’. ఈ మూవీలో తారక్ మూడు డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. ముఖ్యంగా రావణగా విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో అదరగొట్టారు. ఈ మూవీ రూ.130 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది సినిమా.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం