బావమరిది పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా జూనియర్ ఎన్టీఆర్..మ్యాడ్ హీరో వెడ్డింగ్ లో ఫ్యామిలీతో కలిసి సందడి.. ఫొటోలు వైరల్-jr ntr attented brother in law narne nithiins wedding with wife pranathi and kids mad hero wedding pics goes viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  బావమరిది పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా జూనియర్ ఎన్టీఆర్..మ్యాడ్ హీరో వెడ్డింగ్ లో ఫ్యామిలీతో కలిసి సందడి.. ఫొటోలు వైరల్

బావమరిది పెళ్లిలో స్పెషల్ అట్రాక్షన్ గా జూనియర్ ఎన్టీఆర్..మ్యాడ్ హీరో వెడ్డింగ్ లో ఫ్యామిలీతో కలిసి సందడి.. ఫొటోలు వైరల్

తన బావమరిది, హీరో నార్నే నితిన్ పెళ్లితో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. భార్య ప్రణతి, పిల్లలతో కలిసి ఈ వివాహానికి తారక్ అటెండ్ అయ్యాడు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

బావమరిది పెళ్లిలో తారక్ (X)

మ్యాడ్ హీరో నార్నే నితిన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. లక్ష్మీ శివాని తల్లూరిని నితిన్ పెళ్లి చేసుకున్నాడు. ఈ కల్యాణంలో టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిరు. తారక్ కు నార్నే నితిన్ బావమరిది అవుతాడన్న సంగతి తెలిసిందే. అందుకే ఈ పెళ్లికి ఫ్యామిలీతో కలిసి అటెండ్ అయ్యాడు తారక్.

భార్య పిల్లలతో తారక్

హైదరాబాద్ లో నార్నే నితిన్, లక్ష్మీ శివాని తల్లూరి వివాహం ఘనంగా జరిగింది. తన వ్యక్తిగత జీవితాన్ని ప్రజల దృష్టికి దూరంగా ఉంచే జూనియర్ ఎన్టీఆర్ ఈ వివాహంలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు. బావమరిది పెళ్లిలో తన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి సందడి చేశాడు తారక్. జూనియర్ ఎన్టీఆర్ తన పిల్లలతో ఆప్యాయంగా గడిపిన క్షణాలు, ఆయనలోని తండ్రి ప్రేమను చూసి అభిమానులు మురిసిపోయారు.

ఫొటోలు వైరల్

ఈ వివాహం అత్యంత వైభవంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకను తెలుగు సంప్రదాయాల ప్రకారం నిర్వహించారు. పూల అలంకరణ, సంప్రదాయబద్ధమైన ఆచారాలు, అతిథుల రంగురంగుల దుస్తులతో ఈ వేడుక కన్నుల పండువగా సాగింది. నార్నే నితిన్ పెళ్లికి సంబంధించిన అనేక ఫొటోలు, వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. ఆయన భార్య శివాని సంప్రదాయ పెళ్లికూతురు దుస్తుల్లో ఎంతో అందంగా, హుందాగా కనిపించారు. మరోవైపు, నార్నే నితిన్ కూడా సంప్రదాయ దుస్తుల్లో ఆమెకు తగిన జోడీగా నిలిచారు.

ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు, చిత్రాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవ్వగా, జూనియర్ ఎన్టీఆర్ అతిథులను ఆప్యాయంగా పలకరిస్తూ, నవ్వులు పంచుకుంటూ, కుటుంబ సభ్యులతో ఫొటోలకు పోజులిచ్చారు. ఈ క్షణాలు ఆయనలోని సూపర్‌స్టార్ ఇమేజ్‌కు మించిన నిరాడంబర వ్యక్తిత్వాన్ని చూపించాయి. సినీ పరిశ్రమ నుంచి ఆయన సన్నిహితుడు, నటుడు రాజీవ్ కనకాల కూడా ఈ వేడుకకు హాజరయ్యారు.

దగ్గుబాటి ఫ్యామిలీతోనూ

ఈ పెళ్లి కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదు. వ్యాపార, సినిమా రంగాలతో బలమైన సంబంధాలు ఉన్న రెండు కుటుంబాల కలయికకు ఇది గుర్తుగా నిలిచింది. మీడియా దిగ్గజం నార్నే శ్రీనివాసరావు కుమారుడైన నార్నే నితిన్, వెంకట కృష్ణ ప్రసాద్ తల్లూరి కుమార్తె అయిన లక్ష్మీ శివాని తల్లూరి ఇద్దరూ ప్రముఖ తెలుగు కుటుంబాలకు చెందినవారే. తల్లూరి కుటుంబానికి హైదరాబాద్‌లోని ప్రఖ్యాత దగ్గుబాటి కుటుంబంతో సంబంధాలు ఉన్నాయి. ఈ కుటుంబంలో వెంకటేష్, సురేష్ బాబు వంటి స్టార్లు ఉన్నారు. ఈ వివాహ వేడుకలో, జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబంతో కలిసి నూతన వధూవరులతో ఫొటోలకు పోజులిచ్చారు.

నీల్ తో

ఇక సినిమాల విషయానికొస్తే జూనియర్ ఎన్టీఆర్ తదుపరి దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి ఒక భారీ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తాత్కాలికంగా ఎన్టీఆర్ నీల్ అనే టైటిల్ పెట్టారు. ఆయన చేతిలో 'దేవర 2' కూడా ఉంది. అలాగే రీసెంట్ గా 'వార్ 2' చిత్రంతో ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం