ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్నాడు జూనియర్ ఎన్టీఆర్. వార్ 2 మూవీతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మంగళవారం వార్ 2 మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. నేషనల్ వైడ్‌గా వార్ 2 టీజర్ ట్రెండింగ్ అవుతోంది.
అయితే హీరో కాకముందు జూనియర్ ఎన్టీఆర్ ఓ టీవీ సీరియల్‌లో నటించాడు. భక్త ధృవ మార్కాండేయ పేరుతో తెలుగులో రూపొందిన ఈ సీరియల్‌లో మార్కాండేయగా టైటిల్‌లో రోల్‌లో ఎన్టీఆర్ నటించాడు. ఈ సీరియల్‌లో ఎన్టీఆర్‌తో పాటు టాలీవుడ్ డైరెక్టర్ వక్కంతం వంశీ కూడా నటించాడు ఓ కీలక పాత్రలో కనిపించాడు. మార్కండేయుడి పాత్రలో ఈ సీరియల్‌లో ఎన్టీఆర్ అసమాన నటనతో అదరగొట్టాడు.
ఈటీవీలో చాలా కాలం పాటు భక్త ధృవ మార్కాండేయ సీరియల్ టెలికాస్ట్ అయ్యింది. అయితే ఈ సీరియల్ ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు ఎక్కడ ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులో లేకపోవడం గమనార్హం. ఈ సీరియల్‌కు వీణాపాణి మ్యూజిక్ అందించాడు.
ప్రస్తుతం ఎన్టీఆర్ వార్ 2తో పాటు తెలుగులో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మూవీ, దేవర 2లలో నటిస్తున్నాడు. హృతిక్ రోషన్ హీరోగా నటిస్తోన్న వార్ 2లో ఎన్టీఆర్ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో కనిపించబోతున్నాడు. మంగళవారం రిలీజ్ చేసిన ట్రైలర్‌లో ఎన్టీఆర్ లుక్, అతడిపై తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్ అభిమానులను ఆకట్టుకుంటోన్నాయి.
మరోవైపు ఇటీవలే ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్‌ను మొదలుపెట్టాడు ఎన్టీఆర్. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి డ్రాగన్ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఈ ఏడాదే దేవర 2 షూటింగ్ మొదలుపెట్టబోతున్నాడు ఎన్టీఆర్. దేవర పార్ట్ 1కు మిక్స్‌డ్ టాక్ రావడంతో దేవర సీక్వెల్ ఉండటం అనుమానమేనని వార్తలొచ్చాయి. దేవర 2 తప్పకుండా ఉంటుందని ఇటీవలే ఈ పుకార్లపై ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చాడు.
సంబంధిత కథనం