నలుగురు ఆడవాళ్ల స్కామ్- ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన కామెడీ మూవీ- 7.5 రేటింగ్, తెలుగులో స్ట్రీమింగ్!-jolly o gymkhana ott streaming on aha prabhudeva madonna sebastian comedy film jolly o gymkhana ott release today telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  నలుగురు ఆడవాళ్ల స్కామ్- ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన కామెడీ మూవీ- 7.5 రేటింగ్, తెలుగులో స్ట్రీమింగ్!

నలుగురు ఆడవాళ్ల స్కామ్- ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన కామెడీ మూవీ- 7.5 రేటింగ్, తెలుగులో స్ట్రీమింగ్!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి ఇవాళ తమిళ కామెడీ సినిమా తెలుగులో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఐఎమ్‌డీబీ నుంచి 7.5 రేటింగ్ సాధించిన జాలీ ఓ జింఖానా ఓటీటీ రిలీజ్ అయింది. నలుగురు ఆడవాళ్లు కలిసి చేసే ఓ బ్యాంక్ స్కామ్ చుట్టూ ఈ సినిమా సాగనుంది. మరి జాలీ ఓ జింఖానా ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

నలుగురు ఆడవాళ్ల స్కామ్- ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన కామెడీ మూవీ- 7.5 రేటింగ్, తెలుగులో స్ట్రీమింగ్!

ఓటీటీలోకి ఎన్నో రకాల సినిమాలు అలరించడానికి ప్రతివారం సిద్ధంగా ఉంటున్నాయి. తాజాగా ఇవాళ మే (15) ఓ కోలీవుడ్ కామెడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. ఆ సినిమానే జాలీ ఓ జింఖానా. నేటి నుంచి తెలుగు భాషలో జాలీ ఓ జింఖానా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

జాలీ ఓ జింఖానా నటీనటులు

ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో ప్రభుదేవా మెయిన్ లీడ్ రోల్ చేశాడు. అలాగే, హీరోయిన్స్‌గా మడోన్నా స్టెబాస్టియన్, పూజిత పొన్నాడ నటించారు. సీనియర్ హీరోయిన్ (చెప్పవే చిరుగాలి) అభిరామి, పాపులర్ కమెడియన్ యోగిబాబు, రెడిన్ కింగ్స్‌లీ, రోబో శంకర్, జాన్ విజయ్, సాయిధీనా, మధుసూదన్ రావు, యాషికా ఆనంద్ ఇతర కీలక పాత్రల్లో అలరించారు.

డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా

శక్తి చిదంబరం దర్శకత్వం వహించిన జాలీ ఓ జింఖానా సినిమా డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. నలుగురు ఆడవాళ్లు కలిసి ఓ శవంతో బ్యాంక్ స్కామ్ ఎలా చేశారనే కాన్సెప్ట్‌తో కామెడీ ఎలిమెంట్స్‌తో రూపొందించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా జాలీ ఓ జింఖానా సినిమాను రూపొందించారు మేకర్స్.

7.5 ఐఎమ్‌డీబీ రేటింగ్

గతేడాది 2024లో నవంబర్ 22న థియేటర్లలో విడుదలైన జాలీ ఓ జింఖానా సినిమాకు టాక్ బాగానే వచ్చింది. దాంతో ఐఎమ్‌డీబీ నుంచి పది పాయింట్లకు 7.5 రేటింగ్ సాధించుకుంది ఈ మూవీ. అలాంటి జాలీ ఓ జింఖానా మూవీ ఇవాళ తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్

ఆహాలో జాలీ ఓ జింఖానా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న నవ్వుల పండుగను మిస్ కాకండి అంటూ మేకర్స్ ప్రకటన అనౌన్స్ చేశారు. భవానీ మీడియా ద్వారా ఆహాలో నేటి నుంచి (మే 15) జాలీ ఓ జింఖానా ఓటీటీ రిలీజ్ అయింది.

జాలీ ఓ జింఖానా కథ

ఇక జాలీ ఓ జింఖానా కథ విషయానికొస్తే.. తంగ‌సామి త‌న కూతురు చెల్ల‌మ్మ‌ (అభిరామి), మ‌న‌వ‌రాళ్లు భ‌వానీ, య‌జానీ, శివానీ (మ‌డోన్నా సెబాస్టియ‌న్‌) తో క‌లిసి హోట‌ల్ రన్ చేస్తుంటాడు. అనుకోకుండా ఓ రోజు లోక‌ల్ ఎమ్మెల్యేతో చెల్లమ్మ గొడవ పెట్టుకుంటుంది. తంగ‌సామిని ఆ ఎమ్మెల్యే మ‌నుషులు కొట్ట‌డంతో హాస్పిట‌ల్ పాల‌వుతాడు.

25 లక్షలు కట్టాలని

తంగ‌సామికి ఆప‌రేష‌న్ చేయాల‌ని అందుకు రూ. 25 ల‌క్ష‌లు కట్టాలని డాక్ట‌ర్లు చెబుతారు. ఇంతలో స‌డెన్‌గా వారి బ్యాంకు అకౌంట్‌లో ఆప‌రేష‌న్‌కు అవ‌స‌ర‌మైన డ‌బ్బు డిపాజిట్ అవుతుంది. ఆ డ‌బ్బుతో తంగ‌సామిని బ‌తికించుకుంటారు చెల్ల‌మ్మ‌, ఆమె కూతుళ్లు.

జాలీ ఓం జింఖానా ట్విస్టులు

ఆ డబ్బు ఎవరిది? చెల్లమ్మతో పాటు తన కూతుళ్ల వెంట ఎమ్మెల్యె రోడీలు ఎందుకు పడ్డారు?. డబ్బు కోసం ఓ శవంతో బ్యాంక్ స్కామ్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అనే ఇంట్రెస్టింగ్, కామెడీ విషయాలు తెలియాలంటే ఆహాలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోన్న జాలీ ఓ జింఖానా సినిమాను చూడాల్సిందే.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం