Malayalam Movie: మలయాళం హారర్ థ్రిల్లర్ మూవీ స్టార్ తెలుగులోకి అదే పేరుతో డబ్ అయ్యింది. నేరుగా ఈ మూవీ యూట్యూబ్‌లో రిలీజైంది. స్టార్ మూవీలో జోజుజార్జ్, షీలు అబ్రహం హీరోహీరోయిన్లుగా నటించారు. సలార్ ఫేమ్ ఫృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించాడు.
హారర్ మిస్టరీ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన స్టార్ మూవీకి డొమిన్ డిసిల్వా దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నర్ ఎం జయచంద్రన్ మ్యూజిక్ అందించాడు. 2021లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నది.
అరుద్ర స్కూల్ టీచర్‌గా పనిచేస్తుంటుంది. రాయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. రామ్ తమ మతం వాడు కాకపోవడంతో ఆరుద్రను ఆమె ఫ్యామిలీ దూరం పెడుతుంది. రాయ్ ఎప్పుడు బిజినెస్ వ్యవహారాలతో బిజీగా ఉంటాడు. అనుకోకుండా ఆరుద్ర వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. పిల్లలతో సరిగ్గా మాట్లాడుదూ.
తనలో తానే నవ్వుకుంటూ, మాట్లాడుకుంటూ ఉండటంతో పిల్లలతో పాటు ఆమె ఇంట్లోని పనివాళ్లు భయపడతారు. తనను ఎవరో వెంటాడుతున్నట్లుగా భయపడుతుంది. అరుద్రలో సడెన్‌గా మార్పు రావడానికి కారణం ఏమిటి? అరుద్ర గతం ఏమిటి? ఆరుద్రకు ఎదురైన పెద్ద సమస్య నుంచి రాయ్ ఆమెను ఏ విధంగా కాపాడుకున్నాడు? రాయ్‌కి సాయం చేసిన డాక్టర్ డేరిక్ ఎవరు అన్నదే స్టార్ మూవీ కథ.
స్టార్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ గెస్ట్ పాత్రలో నటించారు. క్లైమాక్స్‌లో అతడి పాత్ర కనిపిస్తుంది. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు మహిళల జీవితంలో మిడిల్ ఏజ్‌లో ఎదురయ్యే సమస్యను ఈ మూవీలో చూపించారు. ఎర్లీ మోనోపాజ్ మహిళలు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటారు? వారి జీవితం ఒక్కసారిగా ఎ లా తలక్రిందులు అవుతుంది అన్నది థ్రిల్లింగ్‌గా ఈ మూవీలో చూపించాడు. కాన్పెప్ట్ బాగున్నా దర్శకుడు అర్థవంతంగా చెప్పడంలో తడబడటంతో ఈ సినిమా ప్రేక్షకుల మెప్పించలేకపోయింది.
పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహించిన లూసిఫర్ 2 ఎంపురన్ మూవీ మార్చి 27న పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది. యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో మోహన్‌లాల్ హీరోగా నటిస్తోన్నాడు. మలయాళ ఇండస్ట్రీలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో లూసిఫర్ 2 మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీలో టోవినో థామస్‌తో పాటు హాలీవుడ్ యాక్టర్ జెరోమీ ఫ్లిన్ కూడా నటిస్తున్నారు.
మరోవైపు జోజు జార్జ్ మలయాళంతో పాటు తమిళం, బాలీవుడ్‌లో డిఫరెంట్ రోల్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. సూర్య రెట్రోతో పాటు కమల్‌హాసన్, మణిరత్నం కాంబోలో వస్తోన్న థగ్ లైఫ్‌లో విలన్‌గా కనిపిం చబోతున్నాడు.
సంబంధిత కథనం
టాపిక్