Pani OTT: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మలయాళ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎక్కడ?
Pani OTT Streaming: పని చిత్రం ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలలకు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఈ చిత్రం ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్‍కు రానుందో ఇక్కడ చూడండి.
మలయాళంలో సూపర్ హిట్ అయిన ఓ మూవీ ఓటీటీలోకి ఐదు భాషల్లో అందుబాటులోకి వస్తోంది. అదే ‘పని’ సినిమా. ఈ రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం అక్టోబర్ 24వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ మూవీలో జోజూ జార్జ్ లీడ్ రోల్స్ చేశారు. ఆయనే ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. పని చిత్రం మంచి హిట్ సాధించింది. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని కొందరు ఎదురుచూస్తూ ఉన్నారు.ఈ వారంలోనే పని చిత్రం ఓటీటీలోకి రానుంది. తెలుగులోనూ స్ట్రీమింగ్ కానుంది.

స్ట్రీమింగ్ ఎక్కడ?
పని చిత్రం సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో రేపు (జనవరి 16) స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరికొన్ని గంటల్లోనే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. సోనీ లివ్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవనుంది. థియేటర్లలో మలయాళంలో ఒక్కటే రిలీజైన ఈ చిత్రం ఓటీటీలో ఐదు భాషల్లో వస్తోంది.
పని సినిమా థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలల తర్వాత ఓటీటీలోకి అడుగుపెడుతోంది. ఈ చిత్రం మలయాళంలో గతేడాది అక్టోబర్ 24న రిలీజైంది. అయితే, ఓటీటీలోకి వచ్చేందుకు ఆలస్యమైంది. దీంతో ఈ చిత్రం స్ట్రీమింగ్ కోసం కొందరు ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఆ తరుణం సమీపించింది. రేపే ఈ చిత్రం సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులోకి రానుంది.
దర్శకుడిగా తొలిసారి
మలయళ సీనియర్ యాక్టర్ జోజూ జార్జ్‌కు దర్శకుడిగా ‘పని’నే తొలి చిత్రం. ఈ మూవీలో గిరి అనే ప్రధాన పాత్ర పోషించటంతో పాటు ఆయన డైరెక్షన్ కూడా వహింటారు. నటనతో ఎన్నో చిత్రాల్లో మెప్పించి జోజూ.. దర్శకుడిగానూ ఈ చిత్రంతో ఆకట్టుకున్నారు. పక్కా రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని జోజూ తెరకెక్కించారు.
పని చిత్రంలో జోజూ జార్జ్‌తో పాటు సాగర్ సూర్య, జులైజ్ వీపీ, చాందినీ శ్రీధరన్, అభినయ, బాబీ కురియన్, ప్రశాంత్ అలెగ్జాండర్, సుజీత్ శంకర్, సీమ, అనూప్ కృష్ణన్ కీలకపాత్రలు పోషించారు. ఈ మూవీకి విష్ణు విజయ్, సామ్ సీఎస్, సంతోషన్ నారాయణన్ మ్యూజిక్ డైరెక్టర్లుగా పని చేశారు.
పని కలెక్షన్లు
పని సినిమా సుమారు రూ.10కోట్ల బడ్జెట్‍తో రూపొందినట్టు అంచనా. ఈ చిత్రం సుమారు రూ.38 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి కమర్షియల్‍గా సూపర్ హిట్ అయింది. ఈ సినిమాను ఏడీ స్టూడియోస్, అప్పు పథు పప్పు బ్యానర్లపై రియాజ్ ఆడమ్, సిజూ వడక్కన్ ప్రొడ్యూజ్ చేశారు.
సంబంధిత కథనం