OTT Action Thriller: ఓటీటీలో ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అదిరే రెస్పాన్స్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
Pani OTT Streaming: పని చిత్రానికి ఓటీటీ రిలీజ్ తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ మూవీని ప్రశంసిస్తూ చాలా మంది నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. నరేషన్, సస్పెన్స్ అదిరిపోయిందంటూ కామెంట్స్ రాసుకొస్తున్నారు.
మలయాళ సీనియర్ యాక్టర్ జోజూ జార్జ్ దర్శకుడిగా మారి 'పని' చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రధాన పాత్ర పోషించటంతో పాటు ఈ మూవీకి డైరెక్షన్ చేశారు. దర్శకుడిగా ఆయనకు ఇదే తొలి చిత్రం. 2024 అక్టోబర్ 24న రిలీజైన ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా పాజిటివ్ టాక్‍తో తెచ్చుకుంది. మంచి కలెక్షన్లను సాధించింది. పని చిత్రం చాలా రోజుల నిరీక్షణ తర్వాత రీసెంట్‍గా ఓటీటీలోకి వచ్చింది. ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు రాగా ఈ మూవీకి అదిరే రెస్పాన్స్ వస్తోంది.

ఐదు భాషల్లో స్ట్రీమింగ్
పని సినిమా జనవరి 15వ తేదీ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. ముందు ప్రకటించిన దానికంటే ఒకరోజు ముందుగా అందుబాటులోకి వచ్చింది. మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో రిలీజైన సుమారు మూడు నెలలకు సోనీ లివ్ ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది.
అదిరే రెస్పాన్స్
పని చిత్రాన్ని సోనీ లివ్ ఓటీటీలో చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ చిత్రానికి స్ట్రీమింగ్ తర్వాత ఎక్కువగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రం నరేషన్ అదిరిపోయిందని, సస్పెన్స్‌తో ఆకట్టుకుందని కొందరు పోస్ట్ చేశారు. ఇంటెన్సిటీ, ఎమోషన్స్‌తో కట్టిపడేసిందని ప్రశంసిస్తున్నారు.
నటుడిగా ఇప్పటికే చాలా సినిమాలకు గానూ ప్రశంసలు పొందిన జోజూ జార్జ్.. దర్శకుడిగా తొలి చిత్రంతోనే మెప్పించారు. పని మూవీ డైరెక్షన్ అదిరిపోయిందని చాలా మంది నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రివేంజ్ డ్రామా మూవీని సస్పెన్స్‌ఫుల్‍గా తెరకెక్కించారని అంటున్నారు. ఈ చిత్రంలో నటీనటుల పర్ఫార్మెన్స్ సహా బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్‍పై మంచి రెస్పాన్స్ వస్తోంది. కథ రొటీన్‍గా ఉందని కొందరు ఎత్తిచూపుతున్నారు. పని మూవీకి ఎక్కువ శాతం పాజిటివ్ స్పందనలే వస్తున్నాయి.
పని సినిమాలో గిరి అనే గ్యాంగ్‍స్టర్ పాత్ర పోషించారు జోజూ జార్జ్. సాగర్ సూర్య, అభియన, జూనైజ్ వీపీ, సుజిత్ శంకర్, చాందినీ శ్రీధరన్, ప్రశాంత్ అలెగ్జాండర్, అభయ హిరణ్మయి, జయరాజ్ వారియర్ ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి విష్ణు విజయ్, సామ్ సీఎస్, సంతోశ్ నారాయణన్ మ్యూజిక్ అందించారు.
పని చిత్రాన్ని ఏడీ స్టూడియోస్, అప్పు పథు పప్పు పతాకాలు నిర్మించాయి. రూ.10కోట్లతో రూపొందిన ఈ మూవీలో గతేడాది అక్టోబర్‌లో విడుదలైంది. ఈ చిత్రం మొత్తంగా సుమారు రూ.38కోట్ల కలెక్షన్లు దక్కించుకుంది. ఈ మూవీకి వేణు, జింటో జార్జ్ సినిమాటోగ్రాఫర్లుగా చేశారు.
సంబంధిత కథనం