Malayalam Movie: మలయాళం బ్లాక్‌బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో ఫ్రీ స్ట్రీమింగ్ - ఎందులో చూడాలంటే?
Malayalam Movie:జోజు జార్జ్ హీరోగా నటించిన మలయాళం గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ ఆంటోనీ తెలుగులో యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు ఫ్రీగా ఈ మూవీని యూట్యూబ్‌లో చూడొచ్చు. ఆంటోనీలో కళ్యాణి ప్రియదర్శన్ కీలక పాత్రలో నటించింది.
Malayalam Movie: జోజు జార్జ్ హీరోగా నటించిన మలయాళం మూవీ ఆంటోనీ కమర్షియల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది. యాక్షన్ డ్రామా థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ ఓ కీలక పాత్రలో కనిపించింది. ఆంటోనీ తెలుగు వెర్షన్ యూట్యూబ్‌లో రిలీజైంది. ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు లేకుండా ఫ్రీగా ఈ సినిమాను యూట్యూబ్‌లో చూడొచ్చు. ఓటీటీలో ఆంటోనీ తెలుగు వెర్షన్ ఆహాలో విడుదలైంది.
సీనియర్ డైరెక్టర్...
యాక్షన్ అంశాలకు తండ్రీకూతుళ్ల అనుబంధాన్ని జోడించి మలయాళం సీనియర్ డైరెక్టర్ జోషి ఆంటోనీ మూవీని తెరకెక్కించాడు. గత ఏడాది డిసెంబర్‌లో ఈ మూవీ థియేటర్లలో విడుదలైంది. జోజు జార్జ్ హీరోయిజం, ఎలివేషన్స్, కళ్యాణి ప్రియదర్శిని యాక్టింగ్, జోషి టేకింగ్ ఆడియెన్స్‌ను మెప్పించాయి. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ మ్యూజిక్ అందించాడు.
ఆంటోనీ కథ ఇదే...
జేవియర్ అనే రౌడీని ఆంటోనీ (జోజు జార్జ్) చంపేస్తాడు. జేవియర్ భార్య జెస్సీ (ఆశా శరత్) ఆ హత్యను కళ్లారా చూస్తుంది. కానీ ఆంటోనీకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పదు. ఓ ప్రమాదంలో జెస్సీ కూడా చనిపోవడంతో ఆమె కూతురు మరియాకు (కళ్యాణి ప్రియదర్శన్) గార్డియన్‌గా ఆంటోనీ ఉండాల్సివస్తుంది.
కాలేజీలో జరిగిన కొన్ని గొడవల వల్ల మరియాను తన ఇంటికే తీసుకొస్తాడు ఆంటోనీ. మరియాను తన కూతురిగా భావిస్తాడు. కానీ వారి రిలేషన్‌ను ఊరిలోని కొందరు పెద్దలు తప్పుపడతారు. మరోవైపు తన అన్నయ్య జేవియర్ చావుకు కారణమైన ఆంటోనీపై అతడి తమ్ముడు టార్జన్ పగతో రగిలిపోతుంటాడు.
టార్జన్ బారి నుంచి మరియాతో పాటు తన వాళ్లను ఆంటోనీ ఎలా కాపాడుకున్నాడు? కరుడుగట్టిన రౌడీగా జీవిస్తున్న ఆంటోనీలో మరియా ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? భర్త జేవియర్‌ను తన కళ్ల ముందే ఆంటోనీ హత్య చేసినా అతడికి వ్యతిరేకంగా జెస్సీ ఎందుకు సాక్ష్యం చెప్పలేదు. తన నిజమైన తండ్రిని కలవాలనే మరియా కోరికను ఆంటోనీ ఎలా నెరవేర్చాడు? అన్నదే ఆంటోనీ మూవీ కథ.
మణిరత్నం థగ్‌లైఫ్
ఇటీవలే పణి మూవీ మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు జోజు జార్జ్. మలయాళంలో బిజీగా అతడికి హిందీ, తమిళం, తెలుగు భాషల నుంచి ఆఫర్లు వస్తోన్నాయి. తమిళంలో మణిరత్నం థగ్‌లైఫ్, సూర్య 45 సినిమాల్లో నటిస్తోన్నాడు. బాలీవుడ్‌లో అనురాగ్ కశ్యప్‌తో ఓ మూవీ చేస్తోన్నాడు.
తెలుగు సినిమాలతోనే...
హీరోయిన్‌గా కళ్యాణి ప్రియదర్శన్ కెరీర్ తెలుగు సినిమాలతోనే మొదలైంది. అఖిల్ హలో మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చిత్రలహరి, రణరంగం సినిమాల్లో నటించింది.