మాసన్ పెట్టిట్స్ (జాన్ సెనా) యూఎస్ స్పెషల్ ఫోర్స్ టీమ్‌లో పనిచేస్తాడు. ఓ సీక్రెట్ ఆపరేషన్‌లో జరిగిన ప్రమాదంలో మాసన్ తీవ్రంగా గాయపడటంతో ఆర్మీ నుంచి అతడిని తప్పిస్తారు. లాయర్ వృత్తిని చేపట్టిన సరైన ఆదాయం లేకపోవడంతో డబ్బు కోసం క్లైర్ వెల్లింగ్లన్ (అలీసన్ బ్రీ) అనే జర్నలిస్ట్‌కు ప్రైవేట్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేయడానికి మాసన్ అంగీకరిస్తాడు.
పాల్డోనియా అధ్యక్షుడు వెనెగాస్‌ను ఇంటర్వ్యూ చేసి ఫేమస్ అవ్వాలని క్లైర్ వెల్లింగ్లన్ భావిస్తోంది. ఆమెతో కలిసి మాసన్ పాల్గొనియా వెళతాడు. పాల్గొనియాలో వెనెగాస్, వెల్లింగ్టన్‌తో పాటు మాసన్ ప్రయాణిస్తోన్న కారుపై తిరుగుబాటు దారులు దాడిచేస్తారు. ఆ ప్రమాదం నుంచి వెల్టింగ్టన్‌ను మాసన్ ఎలా కాపాడాడు?
వెనెగాస్‌పై ఎటాక్ చేసింది ఎవరు? అసలు మాసన్ పాల్గొనియా ఎందుకు వచ్చాడు? వెనెగాస్‌పై అతడు కోపంతో రగిలిపోవడానికి కారణం ఏమిటి? తన శత్రువు అయిన వెనగాస్‌ను మాసన్ తిరుగుబాటు దారుల నుంచి ఎలా కాపాడాడు? బాగా డబ్బు సంపాదించాలనే మాసన్ కోరిక ఎలా తీరింది? అన్నదే ఈ మూవీ కథ.
జాన్ సెనా సినిమా అంటేనే కంప్లీట్ యాక్షన్ మూవీ అనే అంచనాకు రావడం కామన్. భారీ ఛేంజింగ్‌లు, హై ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్స్, కళ్ల చెదిరే విన్యాసాలు జాన్ సెనా సినిమాలో ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తుంటాం. కానీ ఫ్రీలాన్స్ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా సాగుతుంది.
పేరుకు ఫ్రీలాన్స్ యాక్షన్ కామెడీ మూవీనే...కానీ సినిమాలో మాత్రం యాక్షన్ లేదు.. కామెడీ లేదు. పేపర్‌పై మూవీ కథను ఇంట్రెస్టింగ్‌గా రాసుకున్నాడు డైరెక్టర్ పియర్ మోరెల్. ఓ దేశ అధినేతను చంపాలని అనుకున్న ఓ రిటైర్డ్ మిలట్రీ ఆఫీసర్ అతడినే ఎందుకు కాపాడాల్సివచ్చింది?
చిన్న దేశాల్లోని సంపద, ఖనిజాల్ని దోచుకునేందుకు పెద్ద దేశాలు ఎలాంటి కుట్రలు పన్నుతాయి? చిన్న దేశాల అధ్యక్షులను ఎలా విలన్స్‌గా చిత్రీకరిస్తారనే అంశాలను ఈ సినిమాలో చూపించాలని దర్శకుడు అనుకున్నాడు. ఓ లేడీ జర్నలిస్ట్‌ను హీరో సేవ్ చేసే మిషన్ ద్వారా తాను అనుకున్న కథను చెప్పడంలో దర్శకుడు పూర్తిగా తప్పటడుగులు వేశారు.
దేశాధినేతగా నటించిన వెనగాస్ పాత్ర నుంచి కామెడీని రాబట్టాలనే దర్శకుడు ఐడియా పూర్తిగా బెడిసికొట్టింది. పవర్‌ఫుల్ జర్నలిస్ట్‌గా వెల్లింగ్లన్ క్యారెక్టర్‌ను పరిచయం చేసి ఆమె చేత బోల్డ్ సీన్స్ చేయించాడు.
ముఖ్యంగా జాన్ సెనా నుంచి అభిమానులు ఆశించే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కూడా మూవీలో కనిపించదు. ఫైట్స్ పెట్టేందుకు చాలా సార్లు సిట్యూవేషన్స్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. వాటిని సరిగ్గా వాడుకోలేదు. ప్రతిసారి హీరో పారిపోయినట్లుగానే చూపించాడు. క్లైమాక్స్ ఫైట్ ఒక్కటే కాస్తంత పరవాలేదు. అదొక్కటే యాక్షన్ ప్రియులను మెప్పిస్తుంది.
మాసన్ పాల్డోనియా రావడానికి సంబంధించిన అసలు కారణం రివీలయ్యే సీన్‌తో పాటు ప్రత్యర్థులను వెనగాస్ ప్రీ క్లైమాక్స్‌లో బోల్తా కొట్టించే ఎపిసోడ్స్ థ్రిల్‌ను పంచుతాయి. అలాంటి ట్విస్ట్‌లు మరికొన్ని ఉండేలా చూసుకుంటే బాగుండేది.
మాసన్ పాత్రలో జాన్ సెనా యాక్టింగ్ ఓకే. కుటుంబం బాగు కోసం ప్రాణాలకు తెగించి శత్రు దేశంలో అడుగుపెట్టిన వ్యక్తిగా ఎమోషనల్ యాక్టింగ్ కనబరిచాడు. వెల్లింగ్టన్‌గా అలిసన్ బ్రీ గ్లామర్‌తో ఆకట్టుకుంది. వెనెగాస్‌గా జువాన్ పాబ్లో రబా సీరియస్‌గా కనిపించే కామెడీ రోల్‌కు న్యాయం చేసేందుకు కష్టపడ్డాడు.
జాన్ సెనా అభిమానులను ఫ్రీలాన్స్ మెప్పించడం కష్టమే. . జాన్ సెనా కటౌట్, పోస్టర్స్ చూసి ఓ భారీ యాక్షన్ సినిమా కావచ్చుననే అంచనాలతో ఫ్రీలాన్స్‌ను చూస్తే మాత్రం డిసపాయింట్ కావడం పక్కా.