OTT Telugu Action Drama: ఓటీటీలోకి ఐదు నెలల తర్వాత వస్తున్న తెలుగు యాక్షన్ డ్రామా మూవీ.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
OTT Telugu Action Drama: ఓటీటీలోకి ఓ తెలుగు యాక్షన్ డ్రామా ఐదు నెలల తర్వాత రాబోతోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీ గురువారం (మార్చి 13) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.

OTT Telugu Action Drama: ఈటీవీ విన్ ఓటీటీలోకి ఇప్పుడు గతేడాది నవంబర్లో రిలీజైన తెలుగు సినిమా రాబోతోంది. ఇదో బయోపిక్ కావడం విశేషం. థియేటర్లలో రిలీజై ఐదు నెలలైనా డిజిటల్ ప్రీమియర్ మాత్రం కాలేదు. మొత్తానికి వచ్చే వారమే ఈ సినిమా ఈటీవీ విన్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
జితేందర్ రెడ్డి ఓటీటీ రిలీజ్ డేట్
ఓటీటీలోకి రాబోతున్న తెలుగు యాక్షన్ డ్రామా పేరు జితేందర్ రెడ్డి. గతేడాది నవంబర్ 8న థియేటర్లలో రిలీజైంది. విరించి వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా మార్చి 20 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని గురువారం (మార్చి 13) తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఆ ఓటీటీ వెల్లడించింది.
“ఓ లీడర్. ఓ ఫైటర్. ఓ విప్లవం. జితేందర్ రెడ్డి ఎదుగుదల చూడండి. ఇది పవర్, తిరుగుబాటుకు చెందిన స్టోరీ. మార్చి 20 నుంచి ఈటీవీ విన్ లో మాత్రమే స్ట్రీమింగ్ అవుతోంది. విరించి వర్మ డైరెక్ట్ చేసిన మూవీ” అనే క్యాప్షన్ తో ఈటీవీ విన్ ట్వీట్ చేసింది.
జితేందర్ రెడ్డి మూవీ గురించి..
బాహుబలి ఫేమ్ రాకేష్ వర్రే ప్రధాన పాత్రలో నటించిన మూవీ జితేందర్‌రెడ్డి. రియా సుమన్ హీరోయిన్‌గా నటించింది. గతేడాది నవంబర్ 8న రిలీజైంది. నక్సలిజం ఉద్యమం తెలంగాణలో బలంగా ఉన్న రోజుల్లో 1980 -90 దశకంలో జగిత్యాలకు చెందిన ఆర్ఎస్ఎస్ లీడర్ జితేందర్ రెడ్డి జీవితంలో ఎదురైన సంఘటనల ఆధారంగా దర్శకుడు విరించి వర్మ ఈ సినిమాను తెరకెక్కించారు.
జితేందర్‌రెడ్డిని నక్సలైట్లు చంపడానికి ముందు ఏం జరిగిందన్నది అప్పటి తెలంగాణ సామాజిక జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయన్నది ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశాడు. నక్సలిజం ఉద్యమంలోని మరో కోణాన్ని జితేందర్‌రెడ్డి బయోపిక్ ద్వారా ఈ మూవీలో ఆవిష్కరించారు డైరెక్టర్.
బస్సులను తగలబెట్టడం, బ్రిడ్జ్‌లను రోడ్లను పేల్చేయటం లాంటి పనులతో అభివృద్ధిని అడ్డుకున్నారనేలా చూపించారు. జితేందర్‌రెడ్డిని హీరోగా.. కంప్లీట్‌గా పాజిటివ్ కోణంలోనే చూపించాలనే లక్ష్యంతో చేసినట్లుగా ఉంది ఈ మూవీ.
నక్సలైట్లకు ఎదురొడ్డి జితేందర్ రెడ్డి సాగించిన జర్నీతో పాటు అప్పట్లో పీడీఎస్‌యు, ఏబీవీపీ లాంటి స్టూడెంట్స్ యూనియన్స్ ఎలా పనిచేశాయన్నది టచ్ చేశారు. ఎన్టీఆర్, వాజ్‌పాయి లాంటి నాయకుల ప్రస్తావన కథలో చర్చించారు. ఆ సీన్స్ బాగున్నాయి. జితేందర్ రెడ్డి నక్సలైట్లు దారుణంగా ఎలా చంపారన్నది క్లైమాక్స్‌లో కళ్లకు కట్టినట్లుగా ప్రజెంట్ చేశారు. పాతకాలం నాటి వార్త పత్రికల క థనాల్ని చూపించడం బాగుంది.
ఈ సినిమాకు థియేటర్లలో పెద్దగా రెస్పాన్స్ రాలేదు. మరి ఇప్పుడు ఈటీవీ విన్ ఓటీటీలో మార్చి 20 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
సంబంధిత కథనం