JioHotstar vs Amazon Prime vs Netflix: జియోహాట్‌స్టార్ వర్సెస్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్- అతి చవక ప్లాన్స్ ఇందులోనే!-jiohotstar vs amazon prime vs netflix ott platform subscription plans and how much do you need to pay in these 3 otts ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jiohotstar Vs Amazon Prime Vs Netflix: జియోహాట్‌స్టార్ వర్సెస్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్- అతి చవక ప్లాన్స్ ఇందులోనే!

JioHotstar vs Amazon Prime vs Netflix: జియోహాట్‌స్టార్ వర్సెస్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్- అతి చవక ప్లాన్స్ ఇందులోనే!

Sanjiv Kumar HT Telugu

JioHotstar OTT vs Amazon Prime vs Netflix Monthly Plans: ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జియో సినిమా రెండు విలీనమై జియోహాట్‌స్టార్‌గా ఏర్పడ్డాయి. ఇది నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి అగ్ర సంస్థలకు గట్టిపోటీగా నిలబడింది. అత్యంత చవక ప్లాన్స్‌ను మిగతా ఓటీటీలకంటే జియోస్టార్ అందిస్తోంది.

జియోహాట్‌స్టార్ వర్సెస్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్- అతి చవక ప్లాన్స్ ఇందులోనే!

JioHotstar OTT vs Amazon Prime vs Netflix Monthly Plans: అగ్ర ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ రెండు విలీనం అయి జియో హాట్‌స్టార్ పేరుతో ఒకే ఓటీటీ ఛానల్‌గా మారిన విషయం తెలిసిందే. దీంతో ఈ రెండు ఓటీటీ సంస్థలకు సంబంధించిన కంటెంట్ ఒకే యాప్‌లో చూసేయొచ్చు.

ఉచితంగా వీక్షించే అవకాశం

జియో సినిమా, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లు విలీనం చేస్తూ జియోస్టార్ కొత్త ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ జియో హాట్‌స్టార్‌ను శుక్రవారం (ఫిబ్రవరి 14) ప్రారంభించింది. విలీనమైన జియోస్టార్ ఓటీటీ ఇప్పుడు ఇతర సబ్‌స్క్రిప్షన్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లను చిక్కుల్లో పడేసింది. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలతో పాటు 50 కోట్ల మంది యూజర్లకు జియో హాట్‌స్టార్ అన్ని రకాల కంటెంట్‌ను ఉచితంగా వీక్షించే అవకాశం కల్పిస్తోంది.

అంటే, ఇతర ఓటీటీల్లో సబ్‌స్క్రిప్షన్‌తో చూసే కంటెంట్‌ను జియో హాట్‌స్టార్‌లో ఫ్రీగా చూసేయొచ్చు. అయితే, వినియోగదారులు నెలలో పరిమిత సంఖ్యలో కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఇక జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాన్స్‌ను కూడా సంస్థ ప్రకటించింది. ఇవి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి అగ్ర ఓటీటీ సంస్థల కంటే అత్యంత చవకగా ఉన్నాయి.

ఆటోమెటిక్‌గా అప్డేట్

జియోస్టార్ ఎంటర్టైన్మెంట్ సీఈఓ కెవిన్ వాజ్ ప్రకారం.. ప్రస్తుత డిస్నీ + హాట్‌స్టార్ పెయిడ్ సబ్‌స్క్రైబర్స్ కొత్త యాప్‌ను తెరిచినప్పుడు ఎలాంటి మార్పు కనిపించదు. అయితే జియోసినిమా సబ్‌స్కైబర్స్ సబ్‌స్క్రిప్షన్స్ మాత్రం ఆటోమేటిక్‌గా ప్రీమియం వెర్షన్‌కు అప్డేట్ అవుతాయి.

జియో హాట్‌స్టార్ ఓటీటీ మొబైల్ యాడ్ సపోర్ట్ ప్లాన్ 3 నెలకు రూ. 149, సంవత్సరానికి రూ .499 నుంచి ప్రారంభమవుతుంది. ఒకేసారి ఒక యూజర్ మాత్రమే ఈ ప్లాన్‌తో జియో హాట్‌స్టార్ కంటెంట్‌ను చూడొచ్చు. అయితే, ఈ ప్లాన్స్‌లో ప్రకటనలు వస్తాయి.

ప్రకటన లేని ప్లాన్

ఈ ప్లాన్‌పై "మా ధర సుపరిచితమే. ఉదాహరణకు, ఒక త్రైమాసికానికి (3 నెలలకు) మొబైల్ సబ్‌స్క్రిప్షన్‌లకు రూ. 149, ప్రకటన లేని ప్లాన్ కావాలంటే త్రైమాసికానికి రూ. 499 చెల్లించాలి" అని జియో హాట్‌స్టార్ సీఈఓ కెవిన్ వాజ్ పేర్కొన్నారు.

ఇక జియో హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాన్స్ విశేషాలపై లుక్కేస్తే..

జియో హాట్‌స్టార్ ఓటీటీ ప్లాన్:

> మొబైల్ (యాడ్ సపోర్ట్ ప్లాన్): 3 నెలలకు రూ. 149, సంవత్సరానికి రూ.499. ఒకేసారి ఒక యూజర్ మాత్రమే చూడగలరు.

>సూపర్ (యాడ్ సపోర్టెడ్ ప్లాన్) - 3 నెలలకు రూ. 299, సంవత్సరానికి రూ. 899. మొబైల్, వెబ్ లేదా మరే ఇతర సపోర్ట్ లివింగ్ రూమ్ డివైస్‌లలో ఒకేసారి ఇద్దరు యూజర్స్ ఉపయోగించవచ్చు.

>ప్రీమియం (యాడ్ ఫ్రీ ప్లాన్) - నెలకు రూ. 299, 3 నెలలకు రూ. 499, సంవత్సరానికి రూ. 1499. యూజర్లు ఒకేసారి ఏదైనా నాలుగు డివైజ్‌లలో కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాన్:

>నెలకు: రూ .299

>3 నెలలకు: రూ.599

>సంవత్సరానికి: రూ.1499

>వార్షిక ప్రైమ్ లైట్: రూ.799 ((ప్రైమ్ రీడింగ్, ప్రైమ్ గేమింగ్, ప్రైమ్ వీడియో యాక్సెస్ మినహా అన్ని ప్రైమ్ బెనిఫిట్స్ ఒక డివైజ్‌కే పరిమితం)

నెట్ ఫ్లిక్స్:

>మొబైల్ (480పీ): నెలకు రూ.149. ఒకేసారి ఒక డివైజ్‌లో ఒక యూజర్ మాత్రమే కంటెంట్‌ను వీక్షించవచ్చు.

>బేసిక్ (720పీ): నెలకు రూ. 199. మొబైల్, కంప్యూటర్, టీవీ, టాబ్లెట్‌తో సహా ఒకేసారి ఒక డివైజ్‌లో మాత్రమే చూడగలరు.

> స్టాండర్డ్ (1080పీ): నెలకు రూ.499. మొబైల్, కంప్యూటర్, టీవీ, టాబ్లెట్‌తో సహా ఒకేసారి రెండు డివైజ్‌లలో ఇద్దరు యూజర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు.

>ప్రీమియం (4కె + హెచ్ డిఆర్): నెలకు రూ. 649. ఒకేసారి ఏదైనా నాలుగు డివైజ్‌లలో నలుగురు యూజర్స్ కంటెంట్‌ను వీక్షించవచ్చు.

Platform NameSubscription Price
Jio HotstarStarts at 299 for 3 months
Prime VideoStarts at 299 per month
NetflixStarts at 149 per month

అత్యంత చవక ప్లాన్

ఇలా అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాన్స్ కంటే జియోహాట్‌స్టార్ ప్లాన్స్ చాలా చవకగా కనిపిస్తున్నాయి. అమెజాన్, నెట్‌ఫ్లిక్స్ నెలవారి చొప్పున ప్లాన్స్ అందుబాటులో ఉంచితే.. జియో హాట్‌స్టార్ ఏకంగా 3 నెలల ప్లాన్‌తో అట్రాక్ట్ చేస్తోంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం