జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ టాప్‌-5 ఇవే..ఫ‌స్ట్ ప్లేస్‌లో బిగ్‌బాస్ షో.. లిస్ట్‌లో రెండు సినిమాలు, సిరీస్‌లు-jiohotstar trending top 5 list bigg boss 9 telugu in top place sundarakanda hridayapoorvam rambo heart beat ott trending ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ టాప్‌-5 ఇవే..ఫ‌స్ట్ ప్లేస్‌లో బిగ్‌బాస్ షో.. లిస్ట్‌లో రెండు సినిమాలు, సిరీస్‌లు

జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ టాప్‌-5 ఇవే..ఫ‌స్ట్ ప్లేస్‌లో బిగ్‌బాస్ షో.. లిస్ట్‌లో రెండు సినిమాలు, సిరీస్‌లు

పాపులర్ ఓటీటీ జియోహాట్‌స్టార్ లో తెలుగు బిగ్ బాస్ 9వ సీజన్ అదరగొడుతోంది. ఈ షో ట్రెండింగ్ నంబర్ వన్ గా కొనసాగుతూనే ఉంది. టాప్-5లో రెండు సినిమాలు, రెండు సిరీస్ లున్నాయి. వీటిల్లో మీరెన్ని చూశారు?

జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ టాప్‌-5 (x)

పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ జియోహాట్‌స్టార్ ఆడియన్స్ ఎక్కువే. ఈ ఓటీటీలో ట్రెండింగ్ లో ఉన్న మూవీస్, సిరీస్, షోలను వదలకుండా చూసేస్తారు. ఇప్పుడు జియోహాట్‌స్టార్ ఓటీటీలో ట్రెండింగ్ టాప్-5లో ఏమున్నాయో ఓ సారి చూసేయండి. పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 9 నంబర్ వన్ ప్లేస్ లో కొనసాగుతూనే ఉంది.

బిగ్ బాస్ 9 తెలుగు

బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉండే క్రేజ్ వేరు. ముఖ్యంగా తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ షోను విపరీతంగా ఫాలో అవుతారు. అందుకే బిగ్ బాస్ 9 తెలుగు ఓటీటీలోనూ అదరగొడుతోంది. జియోహాట్‌స్టార్ లో ఈ షో స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రెండింగ్ నంబర్ వన్ గానే కొనసాగుతోంది. ఇప్పుడు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్ నాలుగో వారం ఎండింగ్ కు వచ్చింది. శ్రష్ఠి వర్మ, మర్యాద మనీష్, ప్రియా శెట్టి వరుసగా తొలి మూడు వారాల్లో ఎలిమినేట్ అయ్యారు.

హార్ట్ బీట్

80 ఎపిసోడ్లున్న భారీ సిరీస్ హార్ట్ బీట్ సీజన్ 2 జియోహాట్‌స్టార్ లో అదరగొడుతూనే ఉంది. ఇది ఓటీటీలో ట్రెండింగ్ నంబర్ టూగా ఉంది. మెడికల్ బ్యాక్ డ్రాప్ లో ఫ్రెండ్స్ మధ్య సాగే సిరీస్ ఇది. హార్ట్ బీట్ సీజన్ 1 సక్సెస్ అయింది. దీంతో సీజన్ 2 మీద కూడా భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే సీజన్ 2 కు మంచి ఆదరణ దక్కింది.

సుందరకాండ

యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ సినిమా సుందరకాండ. నారా రోహిత్ హీరోగా యాక్ట్ చేసిన లేటెస్ట్ మూవీ ఇది. తల్లీ, కూతురిని ప్రేమించే యువకుడిగా నారా రోహిత్ కనిపించాడు. స్కూల్ డేస్ లో ఒక అమ్మాయిని లవ్ చేస్తాడు. కానీ అది మధ్యలోనే బ్రేకప్ అవుతుంది. ఆ తర్వాత మరో అమ్మాయిని లవ్ చేస్తాడు. జియోహాట్‌స్టార్ ట్రెండింగ్ లో సుందరకాండ మూడో స్థానంలో ఉంది.

హృద‌య పూర్వం

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హ్యాట్రిక్ సూపర్ హిట్ హృద‌య పూర్వం. గుండె మార్పిడి చేసుకున్న హీరో కథనే ఈ మూవీ. ఎంపురాన్ ఎల్2, తుడరుమ్ లాంటి బ్లాక్ బస్టర్ల తర్వాత హృద‌య పూర్వంతో మోహన్ లాల్ వరుసగా మూడో విక్టరీని ఖాతాలో వేసుకున్నాడు. ఇది జియోహాట్‌స్టార్ లో నాలుగో ప్లేస్ లో ఉంది.

రాంబో

జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ వెబ్ సిరీస్ ర్యాంబో ఇన్ లవ్. కష్టాల్లో పడ్డ తన కంపెనీని గట్టెంచుకోవడానికి ఫండ్స్ కోసం చూస్తుంటాడు. తన ఎక్స్ ఫండ్స్ ఇచ్చి కంపెనీ కోసం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ సీజన్ 1లో 16 ఎపిసోడ్లున్నాయి. ఇది అయిదో ప్లేస్ లో ఉంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం