ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో ఒకటైన జియోహాట్‌స్టార్ లోనూ మలయాళం కంటెంట్ చాలానే ఉంది. అందులోనూ థ్రిల్లర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్యే వచ్చిన ఎల్2 ఎంపురాన్ నుంచి కరోనా పేపర్స్ వరకు ప్రేక్షకులను అలరించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటిలో బెస్ట్ సినిమాల జాబితా ఇక్కడ ఇస్తున్నాం. వాటిని చూడకపోతే వెంటనే ప్లాన్ చేసుకోండి.
అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళం మూవీ ఈ ఎల్2: ఎంపురాన్. ఈ మధ్యే జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ గతంలో వచ్చిన లూసిఫర్ సినిమాకు సీక్వెల్. మంచి పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ సినిమాను చూడొచ్చు.
కరోనా పేపర్స్ కూడా ఓ మంచి థ్రిల్లర్ మూవీయే. కొవిడ్ 19 మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఓ భారీ మొత్తాన్ని దోపిడీ చేసిన ఓ గ్యాంగ్ ను పట్టుకునేందుకు ప్రయత్నించే పోలీస్ ఆఫీసర్ చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఐఎండీబీలో 6.4 రేటింగ్ ఉన్న ఈ సినిమా కూడా తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
హెవెన్ ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. తన కొడుకును హత్య చేసిన వాళ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు ప్రయత్నించే ఓ పోలీస్ ఆఫీసర్ కథ ఇది. సూరజ్ వెంజరమూడు లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాలోని పోలీస్ ఇన్వెస్టిగేషన్ మంచి థ్రిల్ పంచుతుంది.
సూక్ష్మదర్శిని మూవీలో బేసిల్ జోసెఫ్, నజ్రియా నజీమ్ లీడ్ రోల్స్ లో నటించారు. ఓ ఇంట్లో జరిగే హత్య, దానిని పొరిగింట్లో ఉండే ఓ అమ్మాయి పట్టువదలకుండా ప్రయత్నించి బయటపెట్టే తీరు చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. ఐఎండీబీలో 7.8 రేటింగ్ సాధించిన ఈ థ్రిల్లర్ సినిమాను తెలుగులోనూ చూడొచ్చు.
కిష్కింధ కాండం ఓ సూపర్ హిట్ మలయాళ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఆసిఫ్ అలీ లీడ్ రోల్లో నటించాడు. ఓ మిస్సింగ్ గన్ కోసం మొదలైన పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఓ ఊహకందని విషయాన్ని వెలికి తీస్తుంది. ఈ సూపర్ థ్రిల్లర్ మూవీ కూడా తెలుగులో అందుబాటులో ఉంది.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ కన్నూర్ స్క్వాడ్. ఓ క్రిమినల్ గ్యాంగ్ ను పట్టుకోవడానికి ఓ పోలీస్ అధికారి, అతని టీమ్.. ఇండియా మొత్తం తిరుగుతూ చేసే జర్నీ మంచి థ్రిల్ల అందిస్తుంది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ సంపాదించిన ఈ సినిమా తెలుగులో అందుబాటులో ఉంది.
సంబంధిత కథనం