ఓటీటీలోకి తెలుగులో తమిళ హారర్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. 8 నుంచి పడిపోయిన రేటింగ్.. ఇక్కడ చూసేయండి!-jinn the pet ott streaming on sun nxt tamil horror thriller jinn the pet ott release in telugu in few hours ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  ఓటీటీలోకి తెలుగులో తమిళ హారర్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. 8 నుంచి పడిపోయిన రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీలోకి తెలుగులో తమిళ హారర్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. 8 నుంచి పడిపోయిన రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి సరికొత్త హారర్ థ్రిల్లర్ మూవీ జిన్ ది పెట్ డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. తమిళంలో ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన జిన్ ది పెట్ తెలుగులో ఓటీటీ రిలీజ్ కానుంది. అది కూడా మరికొన్ని గంటల్లో జిన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అయితే, జిన్ ది పెట్ మూవీ రేటింగ్ మాత్రం 8 నుంచి పడిపోయింది.

ఓటీటీలోకి తెలుగులో తమిళ హారర్ థ్రిల్లర్.. మరికొన్ని గంటల్లో స్ట్రీమింగ్.. 8 నుంచి పడిపోయిన రేటింగ్.. ఇక్కడ చూసేయండి!

ఓటీటీ ఆడియెన్స్‌ను ఎక్కువగా కట్టిపడేసే సినిమా జోనర్లలో హారర్ ఒకటి. ఈ హారర్ థ్రిల్లర్ జోనర్స్‌కు కామెడీ, అడల్ట్, యాక్షన్, ఫాంటసీ, సైకలాజికల్ వంటి వివిధ ఎలిమెంట్స్‌ను యాడ్ చేసి తెరకెక్కిస్తుంటారు దర్శకనిర్మాతలు. మనుషుల్లో కామన్ అంశమైన భయం మీద వచ్చే ఈ సినిమాలు దాదాపుగా మంచి ఆదరణ దక్కించుకుంటాయి.

తమిళంలోని హారర్ థ్రిల్లర్

ఇప్పటికీ సౌత్, హిందీ భాషల్లో ఎన్నో హారర్ థ్రిల్లర్ సినిమాలు వచ్చాయి. వాటిలో డిఫరెంట్ స్టోరీతో తమిళంలో తెరకెక్కిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమానే జిన్ ది పెట్. తమిళంలో మే 30న థఇయేటర్లలో విడుదలైన జిన్ ది పెట్ సినిమాకు టాక్ అంతంత మాత్రంగానే వచ్చింది. కానీ, రేటింగ్ మాత్రం ఎంతో సాధించుకుంది.

జిన్ ఓటీటీ స్ట్రీమింగ్

ఐఎమ్‌డీబీ సంస్థలో పదికి ఏకంగా 8 రేటింగ్‌ను సొంతం చేసుకుంది జిన్ ది పెట్. అలాంటి జిన్ ఆ వెంటనే ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన నెల రోజులకు అంటే జూన్ 20న తమిళంలో జిన్ ది పెట్ ఓటీటీ రిలీజ్ అయింది. మొన్నటివరకు తమిళ వెర్షన్‌లోనే ఓటీటీ స్ట్రీమింగ్ అయిన జిన్ ఇప్పుడు తెలుగులోకి వచ్చేస్తోంది.

తెలుగు భాషలో జిన్ ది పెట్

సన్ నెక్ట్స్‌లో తమిళంలో జిన్ ఓటీటీ రిలీజ్ అయింది. ఇప్పుడు అదే సన్ నెక్ట్స్‌లోనే తెలుగు భాషలో జిన్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అంటే, రేపటి (ఆగస్ట్ 1) నుంచి సన్ ఎన్ఎక్స్‌టీలో జిన్ ది పెట్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఆగస్ట్ 1 అర్థరాత్రి 12 గంటల సమయంలోనే జిన్ ఓటీటీ రిలీజ్ కానుంది.

పడిపోయిన రేటింగ్

అయితే, థియేట్రికల్ రిలీజ్ సమయంలో జిన్ మూవీ పదికి 8 రేటింగ్ సాధించుకోగా.. ఇప్పుడు మాత్రం కేవలం 4.2 రేటింగ్‌ను మాత్రమే నమోదు చేసుకుంది. అంటే, ఈ మధ్య కాలంలో జిన్ ది పెట్ సినిమాకు వచ్చిన రేటింగ్ అది. ప్రస్తుతం 8 నుంచి ఏకంగా సగం వరకు జిన్ రేటింగ్ పడిపోయినట్లు తెలుస్తోంది.

సన్ నెక్ట్స్ ఓటీటీలో

ఇదిలా ఉంటే, హారర్ థ్రిల్లర్స్ ఇష్టపడేవారు జిన్ ది పెట్ మూవీని సన్ నెక్ట్స్‌ ఓటీటీలో తెలుగులో ఎంచక్కా చూసేయొచ్చు. ఇకపోతే జిన్ ది పెట్ సినిమాకు టీఆర్ బాల కథ, దర్శకత్వం వహించారు. జిన్ ది పెట్ సినిమా ముగేన్ రావ్, భవ్య త్రిఖ హీరో హీరోయిన్స్‌గా నటించారు.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం