Aghathiyaa: కోలీవుడ్ స్టార్ హీరోలతో రాశీ ఖన్నా హారర్ థ్రిల్లర్- ఇవాళ విడుదల కావాల్సిన సినిమా వాయిదా- అవేంజర్స్ తరహాలో!
Jiiva Arjun Sarja Rashi Khanna Aghathiyaa Release Postponed: తమిళ స్టార్ హీరోలు అర్జున్ సర్జా, జీవాతో టాలీవుడ్ హీరోయిన్ రాశీ ఖన్నా కలిసి నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా అఘాతియా. అయితే, ఇవాళ (జనవరి 31) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా వచ్చే నెలకు వాయిదా పడింది. మరెప్పుడు రిలీజ్ కానుందో చూద్దాం.
Jiiva Arjun Sarja Rashi Khanna Aghathiyaa Postponed: తమిళంలో స్టార్ హీరోలుగా పేరు తెచ్చుకన్నారు యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా, జీవా. వీరిద్దరు కలిసి నటించిన సినిమా అఘాతియా. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా. విజయ్ కథ, దర్శకత్వ బాధ్యతలను నిర్వహించారు.

నేలమ్మ తల్లి సాంగ్
గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి ఫాంటసీ హారర్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ ముద్దుగుమ్మ రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి రీసెంట్‌గా విడుదలైన సెకెండ్ సాంగ్ బాగా ఆకట్టుకుంది. 'నేలమ్మ తల్లి' అంటూ సాగే ఈ పాట అర్జున్ క్యారెక్టర్‌ను హైలెట్ చేసింది.
జీవా నటించిన గత చిత్రం బ్లాక్ కూడా మంచి విజయం అందుకుంది. ఇప్పుడు అఘాతియాతో తమిళం, తెలుగు, హిందీ ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. ఈ సినిమా అద్భుతమైన సీజీ వర్క్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కనుంది. ఇందులో మన సంస్కృతి, మానవ అనుబంధాలను దర్శకుడు బలంగా స్పృశిస్తున్నారు.
మార్వెల్ చిత్రాల తరహాలో
మార్వెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించి ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించేందుకు చిత్ర యూనిట్ కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం మరికొంత సమయం కేటాయించాలని భావించిన మేకర్స్.. సినిమా విడుదలను జనవరి 31 నుంచి ఫిబ్రవరి 28కి పోస్ట్‌పోన్ చేసినట్లు అధికారికంగా ప్రకటించారు.
అవేంజర్స్ తరహాలో ప్రేక్షకులను వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ఊహాత్మక కథా చిత్రంగా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ప్రేక్షకులకు సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించాలనే ఉద్దేశంతో కొంత సమయం తీసుకుంటున్నట్లు మేకర్స్ వెల్లడించారు. సినిమాను చూసే ప్రతి ఒక్కరికీ అగత్యా సరికొత్త అనుభూతిని అందిస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.
లెక్కలేనన్ని వ్యాధులను
అఘాతియా సినిమాలో జీవా, రాశీ ఖన్నా, అర్జున్ సర్జాతోపాటు తమిళ టాప్ కమెడియన్ యోగిబాబు కూడా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే, ఇదివరకు విడుదలైన సెకండ్ సింగిల్ సాంగ్ “నేలమ్మ తల్లే” మన భూమి వారసత్వంలోకి ఒక ఆత్మీయ ప్రయాణం చేసినట్లుగా ఉంటుంది. ఈ పాటలో మూలికలు, సహజ వనరులను ఉపయోగించి లెక్కలేనన్ని వ్యాధులను నయం చేసిన ఋషులు, ప్రకృతి వైద్యుల అద్భుతమైన సహకారాన్ని అందంగా చిత్రీకరించారు.
దీపక్ కుమార్ పాధి అద్భుతమైన సినిమాటోగ్రఫీ విజువల్ వండర్‌గా ఉంది. పా. విజయ్ రాసిన సాహిత్యం ద్వారా పాట సారాంశం మరింత సుసంపన్నం చేసేలా ఉంది. పాటపై దర్శకుడు పా. విజయ్ తన ఆలోచనలను పంచుకుంటూ "ఈ పాట కేవలం సంగీతం మాత్రమే కాదు. ఇది మన భూమి లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక వారసత్వం గుండా ఒక ప్రయాణం" అని తెలిపారు.
వాణిజ్యపరంగా
"లెక్కలేనన్ని వ్యాధులను నయం చేసిన అద్భుతమైన ఔషధ మూలికలను మనకు ఇచ్చిన మన నేల సారాన్ని ప్రదర్శించాలనుకున్నాను. నేను ఈ విజన్‌ని యువన్‌తో పంచుకున్నాను అతను దానిని వాణిజ్యపరంగా ఆకర్షణీయంగా మార్చారు. ఈ పాట మన నేల శక్తి ద్వారా మానవాళికి దోహదపడిన ఋషులు, వైద్యులకు నివాళి" అని డైరెక్టర్ పా విజయ్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం