Jewel Thief Censor Board: సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ జ్యువెల్ థీఫ్‌కు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్.. అదే హైలెట్ అంటూ!-jewel thief beware of burglar receives ua certificate from censor board produced by mallela prabhakar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Jewel Thief Censor Board: సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ జ్యువెల్ థీఫ్‌కు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్.. అదే హైలెట్ అంటూ!

Jewel Thief Censor Board: సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ జ్యువెల్ థీఫ్‌కు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్.. అదే హైలెట్ అంటూ!

Sanjiv Kumar HT Telugu

Jewel Thief Beware Of Burglar Censor Board Certificate: టాలీవుడ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కిన సినిమా జ్యువెల్ థీఫ్. ఈ సినిమాకు బివేర్ ఆఫ్ బర్గర్ అనేది క్యాప్షన్. మల్లెల ప్రభాకర్ నిర్మాతగా వ్యవహరించిన జ్యువెల్ థీఫ్ మూవీకి సెన్సార్ బోర్డ్ నుంచి యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది.

సస్పెన్స్ థ్రిల్ల‌ర్‌ జ్యువెల్ థీఫ్‌కు సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్.. అదే హైలెట్ అంటూ!

Jewel Thief Completes Censor Certification: టాలీవుడ్‌లో ఎప్పటికప్పుడు వివిధ విభిన్నమైన కంటెంట్‌తో సినిమాలు వస్తున్నాయి. డిఫరెంట్ కాన్సెప్ట్స్‌తో మూవీస్ తెరకెక్కించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు దర్శకనిర్మాతలు. అలా తాజాగా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన చిత్రమే జ్యువెల్ థీఫ్.

యూ/ఏ సర్టిఫికేట్

జ్యూవెల్ థీఫ్ మూవీకి బీవేర్ ఆఫ్ బర్గర్ (Beware of Burglar) అనేది క్యాప్షన్. ఈ సినిమాకు మల్లెల ప్రభాకర్ నిర్మాతగా వ్యహరించారు. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. అంతేకాకుండా జ్యువెల్ థీఫ్ మూవీపై సెన్సార్ బోర్డ్ ప్రశంసలు కురిపించింది. సెన్సార్ బోర్డ్ నుంచి జ్యువెల్ థీఫ్ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ జారీ అయింది.

దీంతో జ్యూవెల్ థీఫ్ మూవీపై మరింతగా అంచనాలు పెరిగాయి. ఇదివరకే విడుదలైన పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సెన్సార్ బోర్డ్ నుంచి ప్రశంసలు రావడంతో జ్యువెల్ థీఫ్ మంచి చిత్రంగా నిలుస్తుందని దర్శకనిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాను నవంబర్ 8న థియేటర్లలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు.

స్పెష‌ల్ ఇమేజ్

జ్యువెల్ థీఫ్ సినిమాకు లేడి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు. జ్యువెల్ థీఫ్ చిత్రానికి ఎంఎం శ్రీలేఖ అందించిన మ్యూజిక్ బాగా వచ్చిందని, త‌మ‌ సినిమాకి హైలెట్‌గా నిలుస్తుందని చెప్పారు. అలాగే, ఇటీవలే రిలీజైన ట్రైలర్, ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింద‌న్నారు. హీరో కృష్ణసాయి బాగా నటించార‌ని, ఈ సినిమాతో ఆయనకు ఇండ‌స్ట్రీలో స్పెష‌ల్ ఇమేజ్ వ‌స్తుంద‌ని చెప్పారు.

కృష్ణసాయితో పాటు సీనియర్ నటీనటులు ప్రేమ, అజయ్, 30 ఇయర్స్ పృథ్వి, శివారెడ్డి, శ్రావణి, శ్వేతా రెడ్డి బాగా నటించార‌ని, ప్రేక్ష‌కుల‌కు పూర్తిస్థాయిలో న‌చ్చే సస్పెన్స్ థ్రిల్ల‌ర్ ఇది అని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. ప్రతి ఒక్కరు ‘జ్యువెల్ థీఫ్’ సినిమాను థియేటర్‌లో చూసి, తమ టీమ్‌ను సపోర్ట్ చేయాలని కోరారు.

జోడీగా మీనాక్షి  జైస్వాల్

ఇదిలా ఉంటే, కృష్ణసాయి హీరోగా తెరకెక్కిన చిత్రం ‘జ్యువెల్ థీఫ్’. Beware of Burglar అనేది స‌బ్ టైటిల్. మీనాక్షి జైస్వాల్ హీరోయిన్‍గా కృష్ణసాయికి జోడీగా చేస్తోంది. శ్రీ విష్ణు గ్లోబల్ మీడియా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. జ్యూవెల్ థీఫ్ సినిమాకు పీఎస్ నారాయణ దర్శకత్వం వహించగా.. మల్లెల ప్రభాకర్ నిర్మించారు. ఎంఎం శ్రీలేఖ సంగీతం అందించారు.

ఇటీవల ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదలైన జ్యువెల్ థీఫ్ సినిమాలోని మూడు పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. బ్యాంకాక్‌లో ఈ పాటలను గ్రాండ్‌గా చిత్రీకరించారు. ఇటీవల విడుదలైన టీజర్, ట్రైలర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు అభిమాని అయిన‌ హీరో కృష్ణసాయి డాన్స్, మేనరిజమ్స్, హెయిర్ స్టైల్ ఆకట్టుంకుంటున్నాయి.

రిలీజ్‌కు రెడీ

పోస్ట్ ప్రోడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న జ్యువెల్ థీఫ్ మూవీ సెన్సార్ పూర్తి చేసుకుని థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వ బాధ్యతలను పీఎస్ నారాయణ చేపట్టగా డీవోపీగా అడుసుమిల్లి విజయ్ కుమార్ చేశారు. ఎడిటర్‌గా జేపీ పని చేశారు. మార్షల్ రమణ ఫైటర్ మాస్టర్‌గా స్టంట్స్ చేయించారు.