Yatra 2 OTT: ఏపీ సీఏం బయోపిక్ ఓటీటీలోకి వచ్చేస్తోంది - యాత్ర 2 స్ట్రీమింగ్ డేట్ ఇదేనా!
Yatra 2 OTT: వెఎస్ జగన్ జీవితం ఆధారంగా రూపొందిన యాత్ర 2 మూవీ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ పొలిటికల్ డ్రామా మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.
Yatra 2 OTT: ఏపీ సీఏం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన యాత్ర 2 మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. ఈ పొలిటికల్ డ్రామా మూవీకి మహి.వి. రాఘవ్ దర్శకత్వం వహించాడు. జగన్ పాత్రలో కోలీవుడ్ నటుడు జీవా కనిపించాడు. మమ్ముట్టి గెస్ట్ రోల్ చేశాడు. థియేటర్లలో రిలీజైన రెండు నెలల తర్వాత యాత్ర 2 మూవీ ఓటీటీలోకి రాబోతోంది.
అమెజాన్ ప్రైమ్ వీడియో...
యాత్ర 2 స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నది. ఏప్రిల్ 19న ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో కూడా యాత్ర 2 స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. త్వరలోనే యాత్ర 2 ఓటీటీ రిలీజ్ డేట్‌పై అమెజాన్ ప్రైమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు సమాచారం.
యాత్రకు సీక్వెల్...
యాత్ర 2 మూవీ ఫిబ్రవరి 8న థియేటర్లలో రిలీజైంది. దాదాపు 30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతలకు నష్టాలను మిగిల్చింది. ఫుల్ థియేట్రికల్ రన్‌లో పది కోట్లలోపే యాత్ర 2 వసూళ్లను రాబట్టినట్లు చెబుతోన్నారు. వైఎస్ జగన్ గురించి మీడియాలో ప్రచారంలో ఉన్న, అందరికి తెలిసిన కథనే దర్శకుడు ఈ సినిమాలో చూపించడం, జగన్‌లోని పాజిటివ్ కోణాలను మాత్రమే సినిమాలో టచ్ చేయడం యాత్ర 2 పరాజయానికి కారణమని ప్రచారం జరుగుతోంది.
2019లో రిలీజైన యాత్ర మూవీకి సీక్వెల్‌గా దర్శకుడు మహి .వి రాఘవ్ యాత్ర 2ను తెరకెక్కించారు. యాత్ర సినిమా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితంలోని ప్రధాన ఘట్టాల ఆధారంగా తెరకెక్కింది. యాత్ర కమర్షియల్‌గా సక్సెస్‌గా నిలిచింది. సీక్వెల్ మాత్రం ఆ రిజల్ట్‌ను రిపీట్ చేయలేకపోయింది.
పదేళ్ల రాజకీయ జీవితం...
వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత జగన్ జీవితంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో దర్శకుడు మహి వి రాఘవ్ యాత్ర 2 సినిమాను తెరకెక్కించారు. తండ్రి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీని జగన్ వదిలేయడానికి దారితీసిన పరిణామాలు, జగన్ ఓదార్పు యాత్రను సొంత పార్టీవాళ్లే అడ్డుకోవడానికి చేసిన ప్రయత్నాలు, జగన్‌పై పెట్టిన అవినీతి ఆరోపణల కేసులను ఈ సినిమాలో చర్చించాడు డైరెక్టర్. సొంత పార్టీ ఏర్పాటుతో పాటు ప్రజల మద్ధతుతో తొలిసారి సీఏంగా జగన్ ఎన్నికయ్యాడన్నది యాత్ర 2లో చూపించాడు డైరెక్టర్ మహి వి రాఘవ్.
చంద్రబాబుగా...
జగన్ పాత్రలో జీవా యాక్టింగ్‌తో మెప్పించాడు. ఈ సినిమాలో చంద్రబాబు క్యారెక్టర్‌లో మహేష్ మంజ్రేకర్, వైఎస్ భారతిగా కేతకీ నారయణన్ కనిపించారు. ఈ సినిమాలో సోనియా గాంధీ, కేవీపీ, కొడాలి నానితో పాటు చాలా రియలిస్టిక్ క్యారెక్టర్స్‌ను ఈ సినిమా కోసం రీ క్రియేట్ చేశారు. యథార్థ ఘటనలను పోలిన కొన్ని సీన్స్ మెప్పించాయి. యాత్ర 2 మూవీకి సంతోష్ నారాయణన్ సంగీతాన్ని అందించాడు. రంగంతో పాటు పలు డబ్బింగ్ మూవీస్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన జీవా యాత్ర 2తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చాడు. నాగచైతన్య కస్టడీలో ఓ చిన్న రోల్‌లో కనిపించాడు.
టాపిక్